For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాతో ఇంటి వ్యక్తి చనిపోతే రూ.7 లక్షల వరకు ఇన్సురెన్స్

|

ప్రావిడెంట్ ఫండ్ అలర్ట్. కరోనా మహమ్మారి నేపథ్యంలో EPFO కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ (ELDI) పథకం కింద తన కస్టమర్లకు లభించే ఉచిత బీమా గరిష్ట ప్రయోజనాలను రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కరోనాతో అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచడమే ఈపీఎఫ్ఓ ముఖ్య ఉద్దేశ్యం.

ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో చనిపోయిన సబ్‌స్క్రైబర్ నామినీ లేదా చట్టబద్ద వారసులకు ఈ బీమా కవరేజీ వర్తిస్తుంది. ఈ స్కీంలో భాగంగా రూ.2.5 లక్షల కనీ, డెత్ బెనిఫిట్‌తో పాటు రూ.1.75 లక్షల వరకు బోనస్ లభిస్తుంది.

ఇలా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు

ఇలా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు

ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్లకు ELDI స్కీం వర్తిస్తుంది. ఉద్యోగులు ఈ పథకం కోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లిచంవలసిన అవసరంలేదు. ఉద్యోగి వేతనంలో 0.5 శాతానికి సమానమైన మొత్తాన్ని యాజమాన్యం ఇందుకు జమ చేస్తుంది. ఉద్యోగి చనిపోక ముందు కనీసం ఏడాది నుండి ఉద్యోగంలో కొనసాగితుంటే కనుక బీమా క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది. ఆ ఏడాది కాలంలో ఒక ఉద్యోగం ఉండి మరో ఉద్యోగానికి మారిన సందర్భంలో కూడా బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

క్లెయిమ్ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి

క్లెయిమ్ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి

చనిపోయిన ఉద్యోగి కనీస వేతనం, PF ఖాతాలో జమ అయిన సొమ్ముపై బీమా క్లెయిమ్ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. ఉద్యోగి మృతి చెందక ముందు సంవత్సర కాలంలో అందుకున్న కనీస వేతన సరాసరికి 35 రెట్ల డెత్ బెనిఫిట్‌ ఇందులో కనీసం రూ.2.5 లక్షలు, దీంతో పాటు పీఎఫ్ బ్యాలెన్స్ సరాసరిలో 50 శాతాన్ని బోనస్‌గా కలిపి చెల్లిస్తారు. ఇది గరిష్టంగా రూ.1.75 లక్షలు.

కనీస వేతనంతో పాటు కరువు భత్యాన్ని(డీఏ) కూడా కలిపి వేతన సరాసరిని లెక్కిస్తారు. గరిష్టంగా అనుమతించే కనీస వేతనం రూ.15,000.ఈ మొత్తానికి 35 రెట్లు అంటే రూ.5.25 లక్షల గరిష్ఠ డెత్ బెనిఫిట్ ఉంటుంది. గరిష్ఠ బోనస్ రూ.1.75 లక్షలు. మొత్తం కలిపితే రూ.7 లక్షల వరకు బీమా క్లెయిమ్ అయ్యే అవకాశముంది.

వార్షిక వడ్డీ

వార్షిక వడ్డీ

చనిపోయిన పీఎఫ్ సబ్‌స్క్రైబర్ నామినీ లేదా చట్టబద్ద వారసులు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు ఈపీఎఫ్ ఫాంను నింపి కంపెనీ యాజమాన్యంతో అటెస్ట్ చేయించి సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇవ్వాలి. కంపెనీ యాజమాన్యం సంతకం లభించని పక్షంలో ఎవరైనా గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించుకోవచ్చు. ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయంలో ఫాంతో పాటు ఇతర డాక్యుమెంట్స్ సమర్పించాక 30 రోజుల్లో క్లెయిమ్ ప్రాసెస్ చేసుకోవాలి. గడువు దాటితే జాప్యమైన కాలానికి క్లెయిమ్ సొమ్ముపై 12 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

English summary

కరోనాతో ఇంటి వ్యక్తి చనిపోతే రూ.7 లక్షల వరకు ఇన్సురెన్స్ | Family members to get up to Rs 7 lakh if employee dies of covid 19

Employees Provident Fund Organisation (EPFO), which is the nodal authority for Employees’ Provident Fund (EPF) or PF, is now offering death insurance up to Rs 7 lakh to assist family members of active salaried staff if he or she unfortunately dies of highly contagious Covid-19.
Story first published: Sunday, May 16, 2021, 7:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X