For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI భారీ ఆఫర్: నెలకు రూ.1 లక్ష, దరఖాస్తుకు ఎల్లుండి ఆఖరి తేదీ

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అదిరిపోయే ఆఫర్. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ పీహెచ్‌డీ పూర్తి చేసిన ఇండియన్ నేషనల్స్ నుండి ఎస్బీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1 లక్ష స్టైఫండ్ అందిస్తుంది. అంతేకాదు, వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆ తర్వాత ఒకేసారి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందిస్తుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అక్టోబర్ 8వ తేదీ చివరి తేదీ.

వయో పరిమితి.. ఖాళీలు..

వయో పరిమితి.. ఖాళీలు..

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ప్రింట్ కాపీనీ తీసుకొని ముంబైలోని ఎస్బీఐ కార్పోరేట్ సెంటర్‌కు అక్టోబర్ 15వ తేదీలోగా పంపించాలి. జూలై 31, 2020 నాటికి దరఖాస్తుదారు వయస్సు 40 మించకూడదు. ఈ కాంట్రాక్ట్ రెండేళ్ల కాలం ఉంటుంది. ఐదుగురికి మాత్రమే ఈ బంపరాఫర్ దక్కుతుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కోసం ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్ పంపిస్తారు. అంతేకాదు, ఎస్బీఐ వెబ్ సైట్‌లోను అప్ లోడ్ చేస్తారు.

విద్యార్హతలు

విద్యార్హతలు

ఎంపిక చేసిన దరఖాస్తుదారుని కోల్‌కతాలోని స్టేట్ బ్యాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్‌కు పంపిస్తారు. అభ్యర్థి బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లేదా ఐటీ లేదా ఎకనమిక్స్ లేదా ఏదైనా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. అభ్యర్థికి మంచి అకడమిక్ రికార్డ్ ఉండాలి. ఎవరైనా ఏ కేటగిరీ జర్నల్స్ రాసి ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఐఐఎం, ఐఐటీ, ఐఎస్‌బీ, ఎక్స్ఎల్ఆర్ఐ లేదా ఇతర సమాన ఇనిస్టిట్యూషన్స్ లేదా కన్సల్టెన్సీ బోధన/పరిశోధనలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులకు అంతర్జాతీయ, జాతీయ కాన్ఫరెన్స్‌లకు అయ్యే ఖర్చును ఎస్బీఐ భరిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.

ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.

బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్ తదితర కాపీలు జత చేయాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు వీటిని అప్ లోడ్ చేయాలి.

ఇంటర్వ్యూకు సెలక్ట్ అయినప్పుడు ఒరిజినల్స్ తీసుకు రావాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రింట్ అవుట్‌తో పాటు అవసరమైన అన్ని పత్రాల స్వీయ ధృవీకృత కాపీనీ ఎస్బీఐ ముంబై కార్పోరేట్ కార్యాలయానికి పంపించాలి.

ముఖ్యమైన తేదీలు

ముఖ్యమైన తేదీలు

రెండేళ్ల పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ దరఖాస్తు కోసం ముఖ్య తేదీలు..

దరఖాస్తు ప్రారంభమైన తేదీ - 18 సెప్టెంబర్ 2020

దరఖాస్తు చివరి తేదీ - 08 అక్టోబర్ 2020

దరఖాస్తులో మార్పులకు చివరి తేదీ - 08 అక్టోబర్ 2020

మీ అప్లికేషన్ ప్రింటింగ్ చివరి తేదీ - 31 అక్టోబర్ 2020

ఆన్‌లైన్ ఫీ-పేమెంట్ - 18 సెప్టెంబర్ - 08 అక్టోబర్

English summary

SBI భారీ ఆఫర్: నెలకు రూ.1 లక్ష, దరఖాస్తుకు ఎల్లుండి ఆఖరి తేదీ | Earn Rs 1 lakh a month from SBI! last date to apply is October 8

The State Bank of India has invited applications from Indian nationals who have completed PhD for Post Doctoral Research Fellowship and they will be given Rs 1 lakh every month to the elected fellows as stipend.
Story first published: Tuesday, October 6, 2020, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X