For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీమా తీసుకుంటున్నారా? ఈ రెండు విషయాలు మరవొద్దు ..

|

బీమా కంపెనీలు కొత్త పాలసీని మార్కెట్లోకి తెచ్చిన తర్వాత దానికి సంబందించిన నియమ నిబంధనలను, ప్రయోజనాలను తెలియజేస్తూ బ్రోచర్ ను విడుదల చేస్తాయి. దీన్ని చాలా తక్కువ మంది చదువుతుంటారు. కొంత మంది చదివినా పూర్తిగా అర్థం చేసుకోరు. బీమా ఏజెంట్ చెప్పే వివరాలను నమ్మి పాలసీని తీసుకుంటారు. బీమా పాలసీ తీసుకోవడానికి సంబందించిన పత్రాన్ని కూడా తమ స్వహస్తాలతో రాయరు. ఇది కూడా ఏజెంట్ పూర్తి చేసిన తర్వాత సంతకం చేస్తుంటారు. క్లెయిమ్ చేసుకున్న సందర్భంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నాలిక కరుచుకుంటారు. మరికొంత మంది తమకు సంభందించిన కొన్ని వివరాలను గోప్యంగా ఉంచుతారు. దీనివల్ల కూడా భవిష్యత్తు లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు. అందుకే బీమా తీసుకునే విషయంలో ఈ రెండు విషయాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇఇవ్వాలి.

ప్రతికూల సంఘటనల నుంచి రక్షణ కోసం..

ప్రతికూల సంఘటనల నుంచి రక్షణ కోసం..

* ఏవైనా ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు తగిన రక్షణను పొందడానికి బీమా పాలసీని తీసుకుంటాం.

* జీవిత బీమాలో ప్రతికూల సంఘటన అంటే మరణంగా చెప్పవచ్చు. ఆరోగ్య బీమా అయితే ఆస్పత్రిలో చేరడం లేదా ఏవైనా శస్త్ర చికిత్సలు జరగడం అన్న మాట. ప్రాపర్టీ, మోటార్ వెహికిల్స్ ఇన్సూరెన్సు పాలసీల విషయంలో అయితే అగ్ని ప్రమాదం జరగడం లేదా ఏదైనా ప్రమాదం జరగడంగా చెప్పుకోవచ్చు.

నమ్మకం ఆధారంగా

నమ్మకం ఆధారంగా

విశ్వాసం ఆధారంగా బీమా కాంట్రాక్టు జరుగుతుంది. బీమా తీసుకునే వ్యక్తి నిజమైన సమాచారాన్ని ఇచ్చి బీమా రిస్క్ కవరేజీ ప్రభావితం కాకుండా సమాచారం ఇచ్చినట్టు బీమా కంపెనీ భావిస్తుంది. ఇదే విధంగా బీమా తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రతికూల సంఘటన జరిగిఉంటే అతనికి తగిన బీమా ప్రయోజనాన్ని బీమా కంపెనీ కల్పించాల్సి ఉంటుంది. అందుకే బీమా తీసుకునే వ్యక్తి ఎట్టి పరిస్థితిలోను అబద్దాలు చెప్పకుండా నిజమైన సమాచారాన్ని ఇచ్చి బీమా తీసుకోవాలి. అప్పుడే బీమా క్లెయిమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

దరఖాస్తు నింపే సమయంలో..

దరఖాస్తు నింపే సమయంలో..

* బీమా తీసుకునే ముందు దానికి సంబంచించిన పత్రంలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

* వయసు, అలవాట్ల గురించిన సమాచారంలో తేడావుండొద్దు. పొగతాగే అలవాటు ఉన్నా, ఆల్కహాలు తీసుకునే అలవాటు ఉన్నప్పటికీ తెలియజేయాలి.

* ఆరోగ్యానికి సంబంధించిన వివరాల వెల్లడిలోనే దాపరికాలు ఉండవద్దు. వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర అంటే సర్జరీలు జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ వివరాలు తెలియజేయాలి. ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేసినా ఆ వివరాలు వెల్లడించాలి. ఈ వివరాలు వెల్లడించడం వల్ల మీకు పెద్ద నష్టమేమీలేదు. మీరు సమాచారాన్ని దాచడం వల్ల మీరు క్లెయిమ్స్ చేసుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ఏజెంట్లపై ఆధారపడొద్దు...

ఏజెంట్లపై ఆధారపడొద్దు...

మనదేశంలో బీమా అప్లికేషన్లను ఏజెంట్లే పూర్తి చేస్తుంటారు. ఈ సందర్భంగా మనం అన్ని అంశాలను పరిశీలించక పోతే తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీని వల్ల మనకే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బీమా పత్రాన్ని పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు.

English summary

బీమా తీసుకుంటున్నారా? ఈ రెండు విషయాలు మరవొద్దు .. | Don't Make mistakes while filling Insurance form

Are u taking new insurance policy.. be careful while filling the insurance form and give proper insurance. Many of us are lazy to fill the form and we leave it to the agent.
Story first published: Saturday, December 14, 2019, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X