For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వద్దు.. వద్దు ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఎందుకు ముట్టుకోవడం! అలా ఉండనివ్వండి

|

చేతిలో కాస్త ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేస్తాం.. ఏ అవసరాలు ఉన్నాయో వాటి కోసం వినియోగించుకుంటాం. అయినా ఇంకా డబ్బు మిగిలిపోయి ఇప్పుడు అవసరం లేకుండా భవిష్యత్తులో అవసరం ఉందనుకుంటే దాచిపెట్టు కుంటాం. ఆ డబ్బులు అలా ఉంచేస్తే ఏమి లాభం. అందుకే మనకు దగ్గరలో ఉండే బ్యాంకుకు వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఇది మనలో చాలా మంది చేసే పని. చాలా తక్కువ సమయంలో ఈ పనిని పూర్తి చేయవచ్చు.

నిర్ణీత కాలంలో మన డబ్బు వడ్డీతో సహా చేతికి అందుతుంది. అప్పుడు మన అవసరాలు తీర్చుకోవచ్చు. నిర్ణీత కాలంలో లోపు కూడా మన అవసరాన్ని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను మూసివేయవచ్చు. కొత్త మంది తమకు డబ్బు అవసరం ఉందనగానే బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఉందికదా దాన్ని క్లోజ్ చేసి డబ్బు తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ ఇలా చేయడం కన్నా మీకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే ఉంటుంది. మీ అవసరం తీరుతుంది. వాటి గురించి చూద్దామా మరి.

ఆరోగ్య బీమాలో కో-పే వల్ల లాభమా? నష్టమా?ఆరోగ్య బీమాలో కో-పే వల్ల లాభమా? నష్టమా?

ఇలా చేయండి...

ఇలా చేయండి...

* అత్యవసర సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ ను ఉపసంహరించుకుంటే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ ఇందుకు మీకు ప్రత్యామ్నాయం ఉంది. అదేమిటంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ పై మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. కాబట్టి ముందు ఈ విషయం ఆలోచించండి.

* మీ ఫిక్స్డ్ డిపాజిట్ విలువపై బ్యాంకులు 90-95 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. ఇది ఒక్కో బ్యాంకును బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. మీ అవసరానికి ఈ సొమ్మును వినియోగించుకోవచ్చు. మళ్ళీ మీ వద్ద డబ్బులు ఉండగానే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించి వేయవచ్చు. మీ ఫిక్స్డ్ డిపాజిట్ అలా కొనసాగుతూనే ఉంటుంది.

* మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటు ఒక శాతం నుంచి రెండు శాతం వరకు ఎక్కువ ఉండవచ్చు. ఇది బ్యాంకును బట్టి ఉంటుంది. మీరు గరిష్టంగా ఐదేళ్ల కాలానికి రుణం పొందవచ్చు.

* ఒకవేళ మీరు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే బ్యాంకు మీ ఫిక్స్డ్ డిపాజిట్ ను క్లోజ్ చేసి ఆ మొత్తాన్ని మీరు తీసుకున్న రుణం కింద జమ చేసుకుంటుంది.

* ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పై బ్యాంకు నుంచి రుణ సదుపాయం అందుబాటులో ఉండదు.

బ్యాంకులు సుముఖంగా

బ్యాంకులు సుముఖంగా

* ఫిక్స్డ్ డిపాజిట్ల పై తీసుకునే రుణాలను సెక్యూర్డ్ రుణాలుగా బ్యాంకులు భావిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను హామీగా పెట్టి కస్టమర్ రుణాన్ని తీసుకుంటాడు కాబట్టి బ్యాంకుకు పెద్దగా రిస్క్ ఉండదు. కాబట్టి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పై రుణం ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాయి. ఈ రుణంపై వడ్డీ రేటు కూడా బ్యాంకుకు గిట్టుబాటు అవుతుంది.

* వ్యక్తులు, జాయింట్ ఖాతా ఉన్న వారు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పై రుణం పొందడానికి అవకాశం ఉంటుంది.

* ఫిక్స్డ్ డిపాజిట్ పై తీసుకునే రుణంపై వడ్డీ రేటు కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ పర్సనల్ రుణంతో పోల్చితే ఇది తక్కువే ఉంటుంది. ఈ రుణాన్ని బ్యాంకులు త్వరగా మంజూరు చేస్తాయి. తీసుకున్న రుణాన్ని ఒక్కసారిగా లేదా వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కూడా బ్యాంకులు

బ్యాంకును బట్టి రుణ పరిమితి

బ్యాంకును బట్టి రుణ పరిమితి

ఫిక్స్డ్ డిపాజిట్ పై ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా గరిష్టంగా రుణాన్ని అందిస్తాయి. ఉదాహరణకు...

1. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ... 95 శాతం వరకు

2. ఐసీఐసీఐ బ్యాంక్ ... 90 శాతం

3. యాక్సిస్ బ్యాంక్ .... 85 శాతం వరకు

4. హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ ... కనీసం 25,000

English summary

వద్దు.. వద్దు ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఎందుకు ముట్టుకోవడం! అలా ఉండనివ్వండి | Don't break your fixed deposit, take loan against FD

In emergency many people think to break their fixed deposit (FD) in the bank. But instead of this you can take loan against your FD in your bank with low interest rate.
Story first published: Saturday, March 14, 2020, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X