For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19 తెచ్చిన మార్పులెన్నో.. డబ్బు ఇలా ఆదా చేస్తున్నారు!

|

చాలామందికి ఆదాయ నిర్వహణ, పొదుపు, పెట్టుబడి కాస్త కష్టమైన అంశం. కరోనా ముందు చాలామందికి వీటిపై శ్రద్ధ కూడా లేదు. కానీ మహమ్మారి మనిషిని చాలా మార్చివేసింది. కరోనా తర్వాత చాలామంది ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్దేశ్యంతో మనీ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. తమ ఆదాయంలో ఖర్చులతో పాటు పెట్టుబడి, అత్యవసర నిధి వంటి వాటికి కేటాయిస్తున్నారు. తద్వారా ఆర్థిక భవిష్యత్తుకు, అలాగే మున్ముందు అత్యవసరమైతే చేతిలో డబ్బు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న భారత్.. వేగవంతమైన రికవరీని నమోదు చేస్తోంది. ప్రజలు ఇప్పుడు అనవసర ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అలాగే పెట్టుబడులు, అత్యవసర నిధి కోసం తమ పోర్ట్‌పోలియోలో కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. అలాగే చేతిలో లిక్విడిటీని అట్టిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత ఎక్కువమంది ప్రజల్లో మార్పులు కొన్ని చూద్దాం.

ఖర్చులు తగ్గించారు

ఖర్చులు తగ్గించారు

కరోనా తర్వాత చాలామంది ఖర్చులు తగ్గించారు. అయితే ఖర్చులు అనడం కంటే అనవసర ఖర్చులు తగ్గించారని చెప్పవచ్చు. ఈటింగ్ ఔట్, ఎంటర్‌టైన్మెంట్, ట్రావెల్ ఖర్చులు పరిమితం చేశారు. దుస్తులు కొనుగోలు చేయడం, ఫర్నీచర్, హోమ్ డెకార్ వంటి వాటి పైన కూడా తక్కువగా ఖర్చు చేస్తూ బడ్జెట్‌ను పరిమితం చేశారు. గ్రాసరీ, యుటిలిటీ బిల్లులు మినహాయించి చాలా గృహాల్లో ఇతర ఖర్చులను లేదా అత్యవసరం కాని ఖర్చులను వాయిదా వేసుకుంటున్నారు. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నారు.

విశాలమైన సొంతింటికి ప్రాధాన్యత

విశాలమైన సొంతింటికి ప్రాధాన్యత

కరోనా తర్వాత ప్రజలు సొంతింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉండేలా ఇంటిని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఆఫీస్, ఇంట్లోనే జిమ్, థియేటర్, ఈవినింగ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూషన్ అవుతోంది. దీంతో ఏ గదికి ఆ గది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త మార్పుకు అనుగుణంగా తమ ఇంటిని మారుస్తున్నారు.

ఇన్సురెన్స్‌లో పెట్టుబడి

ఇన్సురెన్స్‌లో పెట్టుబడి

ఇన్సురెన్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. సొంతింటి కల, పెట్టుబడులు పెట్టడం పెరగడంతో పాటు ఆరోగ్య బీమా, వైద్య బీమా మొదలైన వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. అవసరమైనప్పుడు హెల్త్ ఇన్సురెన్స్ ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో కరోనా మహమ్మారి మనకు నేర్పింది.

పెట్టుబడుల్లో వేగం

పెట్టుబడుల్లో వేగం

కరోనా తర్వాత చాలామంది పెట్టుబడుల వైపు దృష్టి సారించారు. ఇదివరకు తమ చేతిలో అదనపు సొమ్మును బ్యాంకుల్లో దాచడం లేదా ఇతర ఖర్చులకు ఉపయోగించేవారు. కానీ వీటికి ప్రాధాన్యత తగ్గింది. కరోనా సమయంలో బులియన్, స్టాక్ మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారులు పెరిగారు. డీమ్యాట్ ఖాతాలు తెరుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ వంటి ఖాళీ సమయాల్లో డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. పెట్టుబడి సాధనాలను వెదికారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

డబ్బు ఆదా

డబ్బు ఆదా

ఇది చాలా కీలకమైన విషయం. కరోనా మహమ్మారి అనవసర ఖర్చు చేసే వారికి, మనీ మేనేజ్‌మెంట్ లేని వారికి గుణపాఠం నేర్పిందని చెప్పవచ్చు. వైద్య అవసరాలతో పాటు అత్యవసర పరిస్థితి కోసం బ్యాంకుల్లో లేదా ఇంట్లో డబ్బులు పెట్టుకోవాలని గుర్తించారు. FDలు తెరవడం, PPF ఖాతాలు తెరవడం చేస్తున్నారు.

English summary

Covid 19 తెచ్చిన మార్పులెన్నో.. డబ్బు ఇలా ఆదా చేస్తున్నారు! | Covid 19 changed personal finance and how you can save?

Most people find it difficult to manage, save and invest their earnings. If anything, the pandemic has once again put the spotlight on why one must plan their financial future early on.
Story first published: Thursday, November 11, 2021, 19:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X