For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కొనాలనుకుంటున్నారా: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?

|

ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? హోమ్ లోన్ పై వివిధ బ్యాంకులు వివిధ రకాల వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రయివేటురంగ దిగ్గజాలు HDFC, కొటక్ మహీంద్రా, ICICI సహా వివిధ బ్యాంకులు మార్చి నెలలో వడ్డీ రేట్లపై పరిమిత కాలంలో ఆఫర్లు అందించాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. అయితే అంతకుముందు మందగమనం, గత ఏడాది కరోనా కారణంగా వడ్డీ రేట్లు మాత్రం క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందంటే...

HDFC, ICICI హోమ్ లోన్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

HDFC, ICICI హోమ్ లోన్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

ప్రయివేటు రంగ దిగ్గజం HDFC బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.70 శాతానికి అందిస్తోంది. అంటే లక్షకు రూ.646 ఈఎంఐ చెల్లించాలి. ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.3,000గా ఉంది.

మరో ప్రయివేటురంగ బ్యాంకు ICICI బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా 6.70 శాతంగా ఉంది. నెలకు ఈఎంఐ లక్షకు రూ.646గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం నుండి 2 శాతం వరకు ఉంటుంది. లేదా రూ.1500 ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది. మీరు బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో కనుక ఇంటిని కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రూ.2000గా ఉంటుంది.

కొటక్, యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేట్లు

కొటక్, యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేట్లు

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.75 శాతానికి అందిస్తోంది. అంటే లక్షకు రూ.648 ఈఎంఐ చెల్లించాలి. ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతంగా ఉంది.

యాక్సిస్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.90 శాతానికి అందిస్తోంది. అంటే లక్షకు రూ.659 ఈఎంఐ చెల్లించాలి. ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు మొత్తం లోన్ అమౌంట్ పైన 1 శాతం లేదా కనీసం రూ.10,000 ఉంది.

స్టాండర్డ్ చార్టర్, యస్ బ్యాంకు

స్టాండర్డ్ చార్టర్, యస్ బ్యాంకు

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 7.99 శాతానికి అందిస్తోంది. అంటే లక్షకు రూ.733 ఈఎంఐ చెల్లించాలి. ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం నుండి 1 శాతం వరకు ఉంది.

యస్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 8.95 శాతానికి అందిస్తోంది. అంటే లక్షకు రూ.801 ఈఎంఐ చెల్లించాలి. ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం లేదా రూ.10,000. ఏది ఎక్కువ అయితే దానిని ఛార్జ్ చేస్తారు.

English summary

ఇల్లు కొనాలనుకుంటున్నారా: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత? | Check best Home Loan interest rates from these private banks

Are you looking forward to buying your own home? Dream may come true for you as top private banks are offering home loans in affordable annual interest rates. To avail the home loans from the banks, lenders do charge processing fees along with the home loan interest rates.
Story first published: Friday, April 9, 2021, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X