For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనం

|

క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ గత ఏడు రోజుల్లో ఆరు సెషన్‌లు నష్టాల్లో ఉంది. అమెరికా అధ్యక్షులు జోబిడెన్ పన్ను వార్తలు క్రిప్టో పైన ప్రభావం చూపాయి. దీంతో బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు క్షీణిస్తున్నాయి. గత వారం బిట్ కాయిన్ 64,000 డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఈ వారం దారుణంగా పతనమైంది. 65 వేల డాలర్ల దిశగా సాగిన బిట్ కాయిన్, 55వేలకు ఆ తర్వాత 51 వేలకు ఇప్పుడు 48,000 దిగువకు పడిపోయింది.

Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటుForbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు

జోబిడెన్ క్యాపిటల్ గెయిన్స్ ఎఫెక్ట్

జోబిడెన్ క్యాపిటల్ గెయిన్స్ ఎఫెక్ట్

అమెరికా అధ్యక్షులు జోబిడెన్ ఉన్నత వర్గాల ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను రెండింతలు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ క్షీణించింది. క్రితం సెషన్‌లో ఇది 8 శాతం పడిపోయి 50,500 డాలర్ల వద్ద కదలాడింది. ఈ వారంలోనే 15 శాతం కంటే పైన పడిపోయింది. తాజాగా నేటి సెషన్లో ఏకంగా 48,000 డాలర్ల దిగువకు చేరుకుంది.

ప్రధానంగా జోబిడెన్ యూఎస్ ట్యాక్స్ కోడ్‌లో మార్పులు ప్రకటించనుండటం, ఇందులో 1 మిలియన్ డాలర్లకు పైన ఆదాయం కలిగిన వారిపై క్యాపిటల్ గెయిన్స్ రెండింతలు చేస్తామని చెప్పడం ప్రభావం చూపింది. దీనిని 39.6 శాతానికి పెంచనున్నారు.

ఈ పతనం తాత్కాలికమేనా?

ఈ పతనం తాత్కాలికమేనా?

బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ పైన పలువురు ఆర్థికవేత్తలకు పలు అభిప్రాయాలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ దూకుడు తాత్కాలికమేనని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం బిట్ కాయిన్ వంటి క్రిప్టో పతనం కావడం కూడా తాత్కాలికమని నమ్మేవారు ఉన్నారు. మున్ముందు డిజిటల్ కరెన్సీలకు డిమాండ్ మరింత పెరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో వీటికి డిమాండ్ ఉంటుందని, ఈ పతనం తాత్కాలికమేనని అంటున్నారు.

బిట్ కాయిన్, ఎథేరియం

బిట్ కాయిన్, ఎథేరియం

గత కొంతకాలంగా బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు భారీగా ఎగిశాయి. అయితే ఇప్పుడు ఎథేరియం 10 శాతం క్షీణించి 2140 డాలర్లకు పడిపోయింది. గత వారం ఇది 2645.97 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఇక బిట్ కాయిన్ ని్న 3.62 శాతం క్షీణించి 49,824.97 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

బిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనం | Bitcoin retreats to weekend's flash crash lows amid tax anxiety

Bitcoin declined for the sixth time in seven days, extending losses after President Joe Biden was said to propose almost doubling the capital-gains tax for the wealthy.
Story first published: Friday, April 23, 2021, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X