For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ పరుగు: త్వరలో 50,000 మార్క్, 2022 నాటికి మూడింతల రిటర్న్స్!

|

క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ ఇటీవల భారీగా పతనమైనప్పటికీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యల అనంతరం మళ్లీ పుంజుకుంటోంది. ఈ వారం బిట్ కాయిన్ సహా క్రిప్టో కరోన్సీలు భారీగా జంప్ చేస్తున్నాయి. గతవారం ఓ సమయంలో 30వేల డాలర్ల దిగువకు పతనమైన బిట్ కాయిన్ ఇప్పుడు 40వేల డాలర్లను క్రాస్ చేసి, 50వేల దిశగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ 40వేల డాలర్ల దిగువనే ఉంది. అయితే గత పది రోజుల్లోనే బిట్ కాయిన్ ఏకంగా 30 శాతం ఎగిసింది. బిట్ కాయిన్ పరుగు చూస్తుంటే వచ్చే నెల ప్రారంభంలోనే 50వేల మార్క్‌కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

30 శాతం జంప్

30 శాతం జంప్

బిట్ కాయిన్ ఏడు సెషన్లలో ఏకంగా 30 శాతం ఎగిసింది. బుధవారం ఈ క్రిప్టో కింగ్ 40,000 మార్కును క్రాస్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ 50,000గా కనిపిస్తోంది. స్వల్పకాలిక పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అయితే దీర్ఘకాలంలో మాత్రం బిట్ కాయిన్ సహా ఇతర డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడి పెట్టవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో పెట్టుబడిదారులు ఆర్థిక మార్కెట్లలోను అనిశ్చితి, భయాన్ని వేరు చేసి, వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలని అంటున్నారు.

2022 నాటికి 15000 మార్క్

2022 నాటికి 15000 మార్క్

బిట్ కాయిన్ ఈ నెలలో ఓ సమయంలో 29,600 డాలర్ల వద్ద కదలాడింది. అయితే బుధవారం నేడు రూ.40,700కు చేరుకుంది. వచ్చే కొద్ది రోజుల్లోనే బిట్ కాయిన్ యాభై వేల మార్కు చేరుకుంటుందని, అంటే ప్రస్తుత లెవల్ నుండి 20 శాతం జంప్ కావొచ్చునని అంటున్నారు. బిట్ కాయిన్ 2022 నాటికి 150000 మార్కుకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 65000తో దాదాపు 40 శాతం క్షీణతతో ట్రేడ్ అవుతోంది.

నేటి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

నేటి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

నేడు వివిధ క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ ఇలా ఉంది. Bitcoin: $39,695, Ether: $2283, Tether: $1.00, Binance Coin: $312, Cardano: $1.27, XRP: $0.7047, USD Coin: $1.00, Dogecoin: $0.2039, Polkadot: $14.52, Binance USD: $1 వద్ద ట్రేడ్ అయింది.

English summary

బిట్ కాయిన్ పరుగు: త్వరలో 50,000 మార్క్, 2022 నాటికి మూడింతల రిటర్న్స్! | Bitcoin jumps 30 percent in ten days, Will it touch 50,000 this week

While equity investors are nervous about weak market sentiments, crypto investors are cheering the recent rally in the digital token market.
Story first published: Thursday, July 29, 2021, 22:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X