For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సీజన్‌లో బంగారానికి ప్రత్యామ్నాయంగా బిట్ కాయిన్!

|

క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కింగ్ బిట్ కాయిన్‌ను చాలామంది బంగారానికి ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. కరోనా తర్వాత బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ అందించాయి. ప్రపంచ, భారతీయ ఇన్వెస్టర్లు చాలాకాలంగా స్టాక్స్‌తో పాటు బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే గతకొంతకాలంగా క్రిప్టోల్లోను ఇన్వెస్ట్ చేస్తూ గడిస్తున్నారు. సాధారణంగా బంగారంపై వ్యాపారులు పండుగ సీజన్లో ఆఫర్లు ఇస్తుంటారు. ఇప్పుడు బిట్ కాయిన్ వంటి క్రిప్టోలు కూడా మార్కెట్లో మరింత వాటాను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.

ఇందులో భాగంగా ఈ పండుగ సీజన్‌ను కూడా ఉపయోగించుకోవడం గమనార్హం. క్రిప్టోలు ఇలా పండుగలను ఉపయోగించుకోవడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. బిట్ కాయిన్ పండుగ సీజన్‌లో కొత్త రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

బిట్ కాయిన్.. పండుగ సీజన్

బిట్ కాయిన్.. పండుగ సీజన్

గత శుక్రవారం గణేష్ చతుర్థి పర్వదినంతో ఈ పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కొత్త రిటైల్ పెట్టుబడిదారులను జత చేసుకోవడానికి నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. కొత్త రిటైల్ పెట్టుబడిదారులను చేరుకోవడానికి ప్రోడక్ట్ లాంచ్, భారీస్థాయి ప్రకటన ప్రచారాలను ప్లాన్ చేస్తున్నాయి.

భారతీయ మార్కెట్ అంటే సేవింగ్స్, స్పెండింగ్స్ అండ్ పండుగ సమయంలో బహుమతులు. దీనిని తాము అవకాశంగా మలుచుకుంటామని యూనోకాయిన్ కోఫౌండర్ సాత్విక్ విశ్వనాథన్ అభిప్రాయపడుతున్నారు. తాము తమ ప్లాట్‌ఫాంను టెక్నికల్‌గా, కార్యాచరణతో పండుగ సీజన్‌కు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

గిఫ్ట్ ఓచర్

గిఫ్ట్ ఓచర్

క్రిప్టో ఏజెన్సీలు కస్టమర్లను ఆకర్షించేందుకు బిట్ కాయిన్ బహుమతులపై దృష్టి సారించాయి. గణేష్ చతుర్థి సందర్భంగా రూ.200 విలువైన బిట్ కాయిన్‌ను అందించేందుకు యూనోకాయిన్ కూపన్ కోడ్‌ను తీసుకు వచ్చింది. ఇందుకు గాను ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఈ-కామర్స్ కంపెనీలు, బ్రాండ్స్‌తో జత కట్టింది. ఇక్కడ వినియోగదారులు బిట్ కాయిన్‌ను ఉపయోగించి గిఫ్ట్ ఓచర్‌ను రీడీమ్ చేసుకోవచ్చు.

'తమ డెవలప్‌‌మెంట్ టీమ్ ముఖ్యంగా పండుగలకు కొత్త కూపన్ కోడ్స్ అందిస్తోంది. కస్టమర్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే అందుకు అనుగుణంగా సర్వర్ లోడ్‌ను పరీక్షిస్తున్నాము' అని సాత్విక్ విశ్వనాథన్ తెలిపారు.

గిఫ్టింగ్‌కు డిమాండ్

గిఫ్టింగ్‌కు డిమాండ్

క్రిప్టో ఎక్స్చేంజ్ వాజీర్-ఎక్స్ ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుండి గిఫ్టింగ్ డిమాండ్ పెరిగిందని వివిధ క్రిప్టో ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారట. ప్రోడక్ట్ లాంచింగ్స్‌తో పాటు క్రిప్టో సెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువమంది కస్టమర్లను తమ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ ఎత్తుపల్లాలు చూస్తున్నప్పటికీ అంతిమంగా లాభపడుతోంది.

నేడు బిట్ కాయిన్, సోలానా, ఎథేరియం వంటి క్రిప్టోలు 1 శాతం నుండి 7 శాతం లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఒక శాతం పెరిగి 2.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం పెరిగింది. గతవారం బిట్ కాయిన్ 20 శాతం మేర కరెక్షన్‌కు గురయింది. గత కొద్ది రోజులుగా 44,000 డాలర్ల నుండి 46,000 డాలర్ల మధ్య కదలాడుతోంది. బిట్ కాయిన్ నేడు ప్రారంభ సెషన్‌లో 1.3 శాతం లాభపడి 45,233 డాలర్ల వద్ద, ఎథేరియం 1 శాతం మేర ఎగిసి 3,297.09 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 0.71 శాతం పెరిగి 401.26 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 0.71 శాతం పెరిగి 35.22 డాలర్ల వద్ద, సోలానా 7.14 డాలర్లు పెరిగి 168.07 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

పండుగ సీజన్‌లో బంగారానికి ప్రత్యామ్నాయంగా బిట్ కాయిన్! | Bitcoin as an alternative to gold this festive season

Indian crypto exchanges are ramping up hiring, and planning product launches and largescale advertising campaigns to add new retail investors.
Story first published: Tuesday, September 14, 2021, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X