For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ బుల్లిష్, క్రిప్టో కరెన్సీ జంప్‌కు కారణాలెన్నో

|

ఓ వైపు కరోనా వైరస్ నేపథ్యంలో దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇదే సమయంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఊగిసలాట మధ్య ఉంది. ఓ సమయంలో 65వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ ఆ తర్వాత 35వేల డాలర్ల దిగువకు వచ్చింది. ఇటీవల 40వేల డాలర్లు దాటినప్పటికీ, నేడు మళ్లీ 35వేల దిగువకు పడిపోయింది. గత కొద్దిరోజులుగా క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ పడిపోయినప్పటికీ ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా ఎగిసింది. బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు ఇటీవల కాస్త క్షీణించినప్పటికీ మున్ముందు మరింత పైకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

అందుకే క్రిప్టో జంప్

అందుకే క్రిప్టో జంప్

క్రిప్టో మార్కెట్ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. టెస్లా ఇంక్, ఆపిల్ వంటి వివిధ దిగ్గజ సంస్థలు వివిధ క్రిప్టోకరెన్సీలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిట్ కాయిన్‌కు అనుకూలంగా ట్వీట్ చేయడంతో ఆ తర్వాత ఎగిసిపడింది. ఇటీవల మస్క్ బిట్ కాయిన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. ఈ ప్రభావం ఈ క్రిప్టో పైన పడింది. ఏడాది కాలంగా వివిధ ఇనిస్టిట్యూషన్స్ క్రిప్టోకు ప్రాధాన్యత ఇవ్వడం కలిసి వచ్చింది.

మరిన్ని కారణాలు

మరిన్ని కారణాలు

పేపాల్ క్రిప్టో ఎక్స్చేంజ్ మరో కారణం. పేపాల్ దాదాపు 350 మిలియన్ యూజర్లను కలిగి ఉంది. ఈ పేపాల్ తన వినియోగదారులందరికీ క్రిప్టో కరెన్సీ కొనుగోలు, అమ్మకానికి వెసులుబాటు కల్పించింది. ఈ సరికొత్త ఫ్యూచర్ ద్వారా బిట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, ఎథేరియం, లైట్ కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు విక్రయించవచ్చు. వివిధ దేశాలు కూడా క్రిప్టోకు అంగీకరించడం కలిసి వచ్చింది.

వివిధ క్రిప్టో వ్యాల్యూ

వివిధ క్రిప్టో వ్యాల్యూ

క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం 37000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 617,861,173,328 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత ఎథేరియం 2,458.91 డాలర్లు, మార్కెట్ క్యాప్ 286,375,345,233 డాలర్లు, టెథెర్ 1.00 డాలర్లు, మార్కెట్ క్యాప్ 62,355,814,053 డాలర్లు, డోజీకాయిన్ 0.318 డాలర్లు, మార్కెట్ క్యాప్ 41,401,918,994 డాలర్లు పలికింది.

English summary

బిట్ కాయిన్ బుల్లిష్, క్రిప్టో కరెన్సీ జంప్‌కు కారణాలెన్నో | Bitcoin and the cryptocurrency market is on a bullish streak

Amidst all the volatility, the cryptocurrency market is recovering well despite COVID-19 disrupting major world economies. When companies were facing the heat of the pandemic with their businesses taking a hit, several crypto and blockchain startups launched themselves to support the roaring demand of Bitcoin and cryptocurrencies.
Story first published: Wednesday, June 9, 2021, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X