For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: కంపెనీల 4 ఆర్థిక పద్ధతుల మార్గంలో నడిస్తే.. పర్సనల్ ఫైనాన్స్ టిప్స్

|

గత కొన్నేళ్లుగా తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ కలిగిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా ఎవరైనా ఆర్థిక క్రమశిక్షణ కోసం బడ్జెట్ ప్లాన్ ఉండాలని చెబుతుంటారు. అయితే ఆ బడ్జెట్ ప్లాన్‌కు పలు మార్గాలు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫైనాన్స్‌ను పెంచుకుంటున్నట్లుగా నిర్ధారించుకోవడానికి ఎక్కువ సమయం, వనరులను వెచ్చిస్తాయి. ఫార్చూన్ 500 లకంపెనీల నుండి చిన్న సంస్థల వరకు, పరిమాణంతో సంబంధం లేకుండా బడ్జెట్ ప్లాన్ అవసరం. ఆర్థిక నిర్వహణకు సంబంధించి ప్రతి కంపెనీలో కొన్ని నమూనాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని సూత్రాలను ఆచరించస్తే, ఆర్థిక విజయానికి సహయపడతాయి. ఇలాంటి సూత్రాలు పర్సనల్ లైఫ్‌లోను ఆచరిస్తే ప్రయోజనకరమే.

 వ్యయ శాత నిర్వహణ

వ్యయ శాత నిర్వహణ

ఆర్థిక క్రమశిక్షణలో ముఖ్యమైనది వ్యయ శాతాన్ని నిర్వహించడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ ఖర్చులను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాయి. రోజువారీ కార్యక్రమాల అమలు కోసం తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను కనుగొంటాయి. చాలా కంపెనీలకు ఒక లక్ష్యం ఉంటుంది. అదే లాభాల సమీకరణ ఆదాయం మైనస్ ఖర్చు. కంపెనీ తగిన నాణ్యమైన ఉత్పత్తి లేదా సేవలను అందిస్తుంటే ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఇది వ్యయ శాతాన్ని నిర్వహించడం ద్వారా సాధిస్తుంది. ఉదాహరణకు 1 మిలియన్ డాలర్ల బడ్జెట్ కలిగిన కంపెనీ 50 శాతాన్ని కంపెన్సేషన్, 20 శాతం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, 20 శాతం ఓవర్ హెడ్ కాస్ట్, 10 శాతం మిస్‌లీనియల్స్ కోసం... ఇలా వర్గీకరించుకుంటుంది. వ్యయ శాతాలను ఇలా నిర్ణయించుకున్నప్పటికీ, ఈ మొత్తాలను లేదా ఈ వ్యయ శాతాన్ని తగ్గించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది.

ఒక కంపెనీ వ్యయ శాతాన్ని నిర్వహించినట్లుగా వ్యక్తి కూడా ఆర్థిక విషయాలలో దీనిని విలువైన సాధనంగా చూడవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం నెలకు రూ.40,000 అయితే 40 శాతం హౌసింగ్, 30 శాతం లివింగ్ ఎక్స్‌పెన్సెస్, 10 శాతం ఇతర అవసరాల కోసం, 10 శాతం సేవింగ్స్, 10 శాతం ఎమర్జెన్సీ ఫండ్.. ఇలా వర్గీకరించుకోవచ్చు.

నిరంతర ఫైనాన్షియల్ అప్ డేట్

నిరంతర ఫైనాన్షియల్ అప్ డేట్

చాలా కంపెనీలు రాబోయం కాలంలో ఖర్చు కోసం ఏడాది ప్రారంభంలోనే ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు, ప్రాధాన్యతలను బట్టి మధ్యలో మారవచ్చు. కానీ ముందస్తు అంచనా ఉంటుంది. మార్పును బట్టి కంపెనీలు బడ్జెట్‌లో నిరంతరం మార్పులతో నవీకరిస్తాయి.

మీ వ్యక్తిగత ఆర్థిక విషయంలోను ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు మీ కేబుల్ బిల్లు నెలకు రూ.300. అయితే మధ్యలో రూ.50 పెరిగితే.. ఏడాదికి రూ.600 భారం అవుతుంది. ఇటీవల టెలికం టారిఫ్స్ పెరిగాయి. ఈ భారం 20 శాతం వరకు పెరిగింది. అంటే ప్రతి నెల రూ.1000 రీచార్జ్ కోసం వినియోగిస్తే ఇప్పుడు రూ.1200కు పెరుగుతుంది. నెలకు రూ.200 పెరిగితే, ఏడాదికి 2400 భారం అవుతుంది. వీటితో పాటు ఊహించని విధంగా మీ వాహనం రిపేర్‌కు రావడం, ఆరోగ్య సమస్యలు వంటివి తలెత్తవచ్చు. కాబట్టి బడ్జెట్‌ను ఎప్పటికి అప్పుడు నవీకరించుకోవాలి.

లక్ష్యానికి మించి...

లక్ష్యానికి మించి...

మీకో లక్ష్యం ఉన్నప్పటికీ, అనుకున్నదాని కంటే పెద్ద గోల్ మన ముందు ఉందనుకోవాలి. సాధారణంగా కార్పోరేట్ కంపెనీల్లో ఇదే సూత్రం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి.. అంతకుమించిన టార్గెట్ ముందు ఉంచుకుంటారు. ఇందుకోసం అధిక పనితీరును కనబరిచే ఉద్యోగులకు ప్రత్యేక రివార్డ్స్ ఉంటాయి. ఉదాహరణకు ఓ కంపెనీ తదుపరి లక్ష్యం రూ.50,00,000 అయితే, దానిని రూ.60,00,000గా పేర్కొనవచ్చు. అప్పుడు ఉద్యోగులు ఈ లక్ష్యం (60,00,000) దిశగా సాగితే, కంపెనీ అసలు లక్ష్యం (50,00,000)ను అందుకునే అవకాశాలు ఉంటాయి.

పర్సనల్ ఫైనాన్స్ విషయంలోను మన లక్ష్యాన్ని కాస్త పెద్దది చేసి చూసుకోవాలి.

సర్దుబాటు

సర్దుబాటు

చాలా కంపెనీలు ఓ వ్యాపార ప్రణాళిక, వ్యూహాన్ని కలిగి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో సర్దుబాట్లు తప్పనిసరి. ఉదాహరణకు ఓ కంపెనీకి ఇంటర్నెట్ అవసరమైతే.. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ కోసం అయ్యే ఖర్చును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ రోటర్ అవసరం ఒకవేళ రోటర్ అవసరం ఉందని భావించినప్పటికీ, ఒకటి అనుకుంటే రెండింటి అవసరం ఏర్పడటం లేదా చిన్నది అనుకుంటే పెద్ద ఉత్పత్తి అవసరం ఏర్పడటం వంటి అంశాల కారణంగా ఇది అదనపు ఖర్చు. ఇలాంటి అదనపు ఖర్చును సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు ఆఫీస్‌లో ప్రతి వారం టీమ్ లంచ్ ఏర్పాటు చేస్తుంటే కనుక, దానిని ఓ వారం తగ్గించడం ద్వారా సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్ విషయంలోను అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు అనవసర లేదా ఇప్పుడే అవసరం లేదనుకున్న ఉత్పత్తి ఖర్చును తగ్గించాలి.

English summary

Big Company Financial Practices To Use In Your Personal Finances

It may seem surprising, but the largest companies in the world monitor their expenses very closely and find cost-effective ways to execute daily tasks.
Story first published: Thursday, December 9, 2021, 20:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X