For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Section 80 C: బెస్ట్ ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ తెలుసుకోండి

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఖర్చులు పెరిగాయని, దీంతో ఈ మొత్తాన్ని పెంచవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 80సీ కింద వచ్చే బెస్ట్ ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏమిటో చూద్దాం....

ELSS ఫండ్

ELSS ఫండ్

ELSS ఫండ్ లేదా ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ పన్ను ఆదా ఎంపికగా చెప్పవచ్చు. వీటి ద్వారా డబుల్ ప్రయోజనం ఉంటుంది. ఒకటి పన్నులను ఆదా చేయడం, రెండోది పెట్టుబడి పైన అధిక రాబడిని పొందడం ద్వారా రెండు విధాలా లబ్ధి చేకూరుతుంది.

ELSSలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.46,800 వరకు పన్ను రూపంలో ఆదా చేయవచ్చు.

వీటిలో అతి తక్కువ లాకింగ్ పీరియడ్ ఉంది. లాకింగ్ పీరియడ్ మూడేళ్లు.

రిటర్న్స్ చరిత్రను చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్ కంటే వీటి ద్వారా అధిక రిటర్న్స్ వచ్చాయి.

వడ్డీ ప్రయోజనంపై పాక్షిక పన్ను ఉంటుంది.

ఫిక్స్డ్ డిపాజిట్

ఫిక్స్డ్ డిపాజిట్

ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు. లాకిన్ పీరియడ్ అయిదేళ్లు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంది.

ఇండియన్ ఇండివిడ్యువల్స్ ఎవరైనా అర్హులే.

ఫిక్స్డ్ డిపాజిట్ లాక్-ఇన్ పీరియడ్ అయిదేళ్లు.

ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 5.5 శాతం నుండి 7.75 శాతం మధ్య ఉన్నాయి.

కనీస పెట్టుబడి రూ.1000.

పెట్టుబడి వడ్డీపై పన్ను ఉంటుంది.

పీపీఎఫ్

పీపీఎఫ్

సెక్షన్ 80సి కింద ప్రభుత్వ ప్రాయోజిత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడిపై మినహాయింపు ఉంి.

ఇండియన్ ఇండివిడ్యువల్స్, శాలరైడ్, నాన్-శాలరైడ్ ఇండివిడ్యువల్స్ అర్హులు. HUF పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.

పీపీఎఫ్ లాక్-ఇన్ పీరియడ్ పదిహేనేళ్లు. ఆ తర్వాత మరో అయిదేళ్లు పొడిగించుకోవచ్చు. ఏడేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంది.

ప్రస్తుతం వడ్డీ రేటు ఏడాదికి 8 శాతంగా ఉంది.

రూ.500 నుండి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

పెట్టుబడిపై వచ్చే వడ్డీ పైన కూడా పన్ను మినహాయింపు ఉంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

శాలరైడ్ అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF). బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఈపీఎఫ్‌కు వెళ్తుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతంతో పాటు కంపెనీ కూడా మరో 12 శాతం అదనంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది.

నెలకు రూ.15,000 వేతనం కలిగిన ఉద్యోగి అర్హులు.

ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.

బేసిక్ శాలరీ ప్లస్ డీఏలో 12 శాతం కాంట్రిబ్యూట్ చేయాలి.

పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంది.

NPS పెట్టుబడి

NPS పెట్టుబడి

అసంఘటిత రంగంలోని వారి కోసం ఎన్పీఎస్ పెన్షన్ స్కీంను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.

18 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు ఉన్న ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

పదిహేనేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణ. ఇది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో.

వడ్డీ రేటు 12 శాతం నుండి 14 శాతం వరకు ఉంది.

పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

యజమాని కాంట్రిబ్యూషన్ పైన పన్ను లేదు.

ULIP

ULIP

యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్స్(ULIP).. ఇన్సురెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ కలయిక. రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.

ULIPను తన కోసం, తన భార్యా, పిల్లల కోసం కొనుగోలు చేయవచ్చు.

వడ్డీ రేటు మార్కెట్ ఆధారితం.

వడ్డీ రేటు 12 శాతం నుండి 14 శాతం మధ్య ఉంది.

గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

పెట్టుబడి, ఉపసంహరణ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన(SSY) ప్రభుత్వ ప్రాయోజిత పథకం.

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాలికకు పదేళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె పేరు మీద ఖాతాను తెరువవచ్చు.

అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత డిపాజిట్ మొత్తంలో యాభై శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.

వడ్డీ రేటు ప్రస్తుతం 8.5 శాతంగా ఉంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పెట్టుబడి పరిమితి 1,50,000.

పెట్టుబడి, ఉపసంహరణ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంది.

English summary

Section 80 C: బెస్ట్ ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ తెలుసుకోండి | Best Tax Saving Investment option under Section 80C

Investment in ELSS Fund or Tax Saving Mutual Fund is considered as the best tax saving option. These funds are specially designed to give you dual benefit of saving taxes and getting higher returns on investment.
Story first published: Thursday, January 20, 2022, 9:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X