For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా బ్యాంకు లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్, సరికొత్త టూల్

|

భారత్‌కు చెందిన ప్రముఖ క్రెడిట్ అసెస్‌మెంట్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా ఇప్పటి వరకు రుణాలు తీసుకోని వారికి క్రెడిట్ స్కోర్‌ను ప్రారంభించింది. రుణాలు తీసుకోని వారికి, క్రెడిట్ కార్డును ఉపయోగించని వారి కోసం ఇది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే వీరికి ఎలాంటి ఫార్మాల్ క్రెడిట్ హిస్టరీ ఉండదు. కాబట్టి రుణాలు తీసుకోవడం అంత సులభం కాదు. రుణాలు ఇచ్చే వారికి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం.

కరోనా రెండో దశ ప్రభావంపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఏమన్నారంటే: మున్ముందు ఈ స్టాక్స్ అదుర్స్కరోనా రెండో దశ ప్రభావంపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఏమన్నారంటే: మున్ముందు ఈ స్టాక్స్ అదుర్స్

సరికొత్త టూల్

సరికొత్త టూల్

మీరు ఇప్పటి వరకు బ్యాంకుల నుండి ఎలాంటి రుణాలు తీసుకోకుంటే, కొత్తగా రుణాలు ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ లేని కారణంగా కాస్త ఆలోచన చేస్తాయి. రుణాలు తీసుకోని వారికి, క్రెడిట్ కార్డు ఉపయోగించకుండా సిబిల్ స్కోర్ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తుంటాయి. ఇలాంటి సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా సరికొత్త టూల్‌ను తీసుకు వచ్చింది.

బ్యాంకులకు సులభం

బ్యాంకులకు సులభం

ఎలాంటి క్రెడిట్ స్కోర్, లోన్ హిస్టరీ లేని వారికి గురించి అంచనా వేసేందుకు వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్(NTC) స్కోర్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. ఈ NTCతో వినియోగదారులకు లోన్ ఇవ్వవచ్చా లేదా అని నిర్ణయించడం బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు సులభం కానుంది. ఈ కొత్త స్కోర్‌ను రుణగ్రహీత గురించి అందుబాటులో ఉన్న వివిధ సమాచారం ఆధారంగా నిర్ణయించనున్నారు.

ఇలా స్కోర్

ఇలా స్కోర్

కొత్త అసెస్‌మెంట్ లేదా స్కోరింగ్ మోడల్‌ను క్రెడిట్ విజన్ అంటారు. క్రెడిట్ విజన్ స్కోర్ 101-200 వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణమివ్వడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రిస్క్ అవకాశాలు ఉంటాయని అర్థం. అంటే సదరు రుణగ్రహీత లోన్ తిరిగి చెల్లించే అవకాశాలు తక్కువ అని బ్యాంకులు అంచనా వేసుకోవచ్చు. ఈ స్కోర్ కొత్తగా లోన్ తీసుకునే వారికి ఎంతో కీలకం కానుంది. క్రెడిట్ సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది.

English summary

కొత్తగా బ్యాంకు లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్, సరికొత్త టూల్ | Banks get new tool to assess new to credit customers

India's oldest credit assessment company TransUnion Cibil has launched an eligibility score for new to credit customers who have never taken a loan or have used a credit card and hence have no formal credit history.
Story first published: Thursday, April 22, 2021, 8:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X