For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోంలోన్ నుండి రిటైల్ లోన్ వరకు.. అన్నింటిపై గుడ్‌న్యూస్

|

ఇటీవల బ్యాంకులు తమ కస్టమర్లకు వడ్డీ రేట్లు తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెబుతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) హోంలోన్ మొదలు రిటైల్ రుణాల వరకు అన్ని వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవి మార్చి 15వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ మేరకు తమ రెపో లింక్డ్ లెండింగ్ రేటు(BRLLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.85 శాతం నుండి 6.75 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం తెలిపింది. అన్ని రకాల రిటైల్ రుణాలకు రెపో లింక్డ్ రేటు ఆటోమేటిక్‌గా వర్తిస్తుందని తెలిపింది.

అన్ని రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుదల

అన్ని రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుదల

బ్యాంక్ ఆఫ్ బరోడా BRLLR వడ్డీ రేటు తగ్గింపుతో హోంలోన్‌పై వడ్డీరేటు 6.75 శాతానికి తగ్గుతుంది. వెహికిల్ లోన్స్ 7 శాతం నుండి ప్రారంభం కానున్నాయి. మోర్టగేజ్ రుణాలపై రేటు 7.95 శాతం నుండి ప్రారంభమవుతున్నాయి. స్టడీ లోన్ వడ్డీరేటు 6.75 శాతంగా నిర్ణయించింది. ఖాతాదారులకు తక్కువవడ్డీకే రుణాలు అందించాలనే ఉద్దేశంతో BRLLRని తగ్గించినట్లు తెలిపింది. అలాగే డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా కస్టమర్లకు త్వరితగతిన రుణాలు అందించడానికి అవకాశం ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. అయితే మార్జినల్ కాస్ట్ ఆప్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది.

త్వరితగతిన రుణాలు

త్వరితగతిన రుణాలు

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మోర్టగేజ్ అండ్ అద‌ర్ రిటైల్ అసెట్స్ విభాగం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ హ‌ర్ష‌ద్ కుమార్ మాట్లాడుతూ.. BRLLR త‌గ్గింపుతో తమ క‌స్ట‌మ‌ర్ల‌కు చౌకగా రుణాలు ల‌భిస్తాయని, అత్యంత చౌక వ‌డ్డీరేట్ల‌పై తమ క‌స్ట‌మ‌ర్లు త్వ‌రిత‌గ‌తిన సులువుగా రుణాలు పొందేందుకు డిజిట‌ల్ ప్ర‌క్రియ ఉప‌క‌రిస్తుందన్నారు. ఈ ఆఫ‌ర్ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు.

ఇతర బ్యాంకులు కూడా

ఇతర బ్యాంకులు కూడా

గతంలో ఇతర ప్రయివేటురంగ, ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ, ఐసీఐసీఐ, HDFC, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ICICI బ్యాంకు రూ.75 ల‌క్ష‌ల వ‌ర‌కు హోం లోన్ పైన 6.70 శాతం, రూ.75 ల‌క్ష‌లకు మించి రుణాలపై 6.75 శాతం వ‌డ్డీరేటు అందిస్తున్నట్లు తెలిపింది. ఎస్బీఐ 6.70 శాతానికి హోంలోన్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా 6.7 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. కొటక్ మహీంద్రా కూడా అదే దారిలో నడిచింది.

English summary

హోంలోన్ నుండి రిటైల్ లోన్ వరకు.. అన్నింటిపై గుడ్‌న్యూస్ | Bank of Baroda reduces BRLLR by 10 bps to 6.75 per cent

Borrowers availing of Home Loan, Mortgage Loan, Car Loan, Education Loan, Personal Loan or any other retail loan products can avail of this benefit.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X