For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందుకే... ఈ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 40% వరకు లాభాలు!

|

పెట్టుబడులకు సంబంధించి రిస్క్ తీసుకోదలిచిన వారు ఆర్బీఐ మానిటరీ పాలసీకి ముందు బ్యాంకింగ్ స్టాక్స్ కనుగోలు చేయడం మంచి ఆలోచనగా మార్కెట్ నిపుణులు చెబుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టిన వారికి కూడా ఈ స్టాక్స్ మంచి ప్రయోజనం ఇవ్వవచ్చు. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఓ బ్యాంకింగ్ స్టాక్ కొనుగోలును సిఫార్సు చేస్తోంది. బంధన్ బ్యాంకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. బంధన్ బ్యాంకును కొనుగోలు చేయమని సిఫార్స్ చేయడానికి కొన్ని కారణాలను చెబుతోంది బ్రోకరేజీ సంస్థ. ఈ బ్యాంకు నలభై శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని చెబుతోంది.

ఆరోగ్యకర లాభాలు, మార్జిన్స్

ఆరోగ్యకర లాభాలు, మార్జిన్స్

బంధన్ బ్యాంకు షేర్ ధర ప్రస్తుతం రూ.299 వద్ద ఉంది. ఈ బ్యాంకు టార్గెట్ ధరను ఈ బ్రోకరేజీ సంస్థ రూ.410కి పెంచింది. ప్రొవిజన్స్ పెరిగినప్పటికీ బంధన్ బ్యాంకు నికర లాభాలు రూ.3.7 బిలియన్లకు చేరుకున్నాయి. కరెంట్, సేవింగ్స్ అకౌంట్ 43 శాతంతో ఆరోగ్యకరంగా ఉంది. ఈ బ్యాంకు ఎన్పీఏలుగా గుర్తించడానికి బదులు రుణాలను రీస్ట్రక్చర్ చేసింది. తక్కువ వడ్డీ రేటుకే వీటిని అందించింది. దీంతో FY21 నాలుగో త్రైమాసికంలో 6.8 శాతం మార్జిన్స్ నమోదు చేయగా, FY22 మొదటి త్రైమాసికంలో 8.5 శాతం ఆరోగ్యకర మార్జిన్స్ నమోదు చేసింది. ఈ బ్యాంకు రుణ వృద్ధి 22 శాతం నుండి 14 శాతానికి తగ్గించింది.

రుణ చెల్లింపులు బాగున్నాయి

రుణ చెల్లింపులు బాగున్నాయి

బంధన్ బ్యాంకు గ్రాస్ స్లిప్పేజ్ రూ.16.2 బిలియన్లను (9.6 శాతం) నివేదించింది. అదే సమయంలో అధిక రికవరీతో రూ.9.9 బిలియన్ల వద్ద జీఎన్‌పీఏ 138 బేసిస్ పాయింట్ల వరకు పెరిగి త్రైమాసికం ప్రాతిపదికన 8.2 శాతం పెరిగింది. బ్యాంకు ECGLS/ టాప్ అప్ లోన్స్ లేవు. కానీ లోన్ రీస్ట్రక్చరింగ్ 6 శాతం వరకు ఉన్నాయి. బ్యాంకు నివేదిక ప్రకారం లోన్ రీస్ట్రక్చర్ చేసిన 84 శాతం మంది కస్టమర్లు చెల్లిస్తున్నారు. మొత్తం మీద కలెక్షన్ ఎఫిసియెన్సీ(CE) 89 శాతం వద్ద ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇధి 86 శాతంగా ఉంది.

టార్గెట్ ధర

టార్గెట్ ధర

బంధన్ బ్యాంకు టార్గెట్ ధరను గతంలోని రూ.390 నుండి రూ.410కి పెంచింది. కరోనా థర్డ్ వేవ్ వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. లాభాలతో పాటు ఊహించని లేదా భారీ నష్టాలు వచ్చే ప్రమాదాన్ని కూడా కొట్టి పారేయలేం. వివిధ బ్రోకరేజీ సంస్థలు ఆయా సంస్థల గత చరిత్ర ఆధారంగా, ఆయా సంస్థలు ప్రకటించే ఆదాయాల ఆధారంగా అంచనా వేస్తాయి. కాబట్టి వ్యాసం ఆధారంగా పెట్టుబడుల కంటే నిపుణుల సలహాలు తీసుకోవడం, మార్కెట్ పైన పూర్తి అవగాహనతో పెట్టుబడి మంచిది.

English summary

అందుకే... ఈ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 40% వరకు లాభాలు! | Bandhan Bank stock may give 40 percent returns!

For those willing to take a risk, it is a great idea to buy into banking stocks ahead of the Monetary Policy Committee meet.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X