For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్సిస్ బ్యాంకు అదిరిపోయే ఆఫర్: హోమ్ లోన్ తీసుకుంటే 12 EMIలు రద్దు!

|

ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు మంగళవారం హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన హోమ్ లోన్ కస్టమర్లకు 12 EMIలను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌లో వివిధ బ్యాంకులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హోమ్ లోన్ పైన వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించాయి. ఇందులో భాగంగా యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గింపుతో పాటు ఈఎంఐ మినహాయింపు ప్రయోజనం కూడా అందిస్తోంది.

ఫెస్టివెల్ ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్ ఉత్పత్తులపై ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తే వివిధ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన హోమ్ లోన్ ఉత్పత్తులతో పాటు టూ-వీలర్ లోన్ కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆన్-రోడ్ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే, వ్యాపారులకు టర్మ్ లోన్స్, ఎక్విప్‌మెంట్ లోన్, కమర్షియల్ వెహికిల్ ఫైనాన్స్ పైన వివిధ ప్రయోజనాలు అందిస్తోంది.

దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్

దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్

'దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్: క్యోంకీ దివాలీ రోజ్ రోజ్ నహీ ఆతీ'ను లాంచ్ చేసింది. దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ పేరుతో పండుగ ఆఫర్లను తీసుకు వచ్చినట్లు వెల్లడించింది. ఈ పండుగ సీజన్‌లో తమ కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రముఖ బ్రాండ్స్, స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లోన్స్ చీఫ్ సుమిత్ బాలీ అన్నారు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా రెస్టారెంట్ షాపింగ్, ఇతర రిటైల్ లోన్ ఉత్పత్తుల కొనుగోలుపైన కూడా మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది.

ఇవి ప్రయోజనాలు

ఇవి ప్రయోజనాలు

- 50 నగరాల్లో 2500 లోకల్ మర్చంట్స్ నుండి కొనుగోలుపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంకు తెలిపింది.

- ఈ స్టోర్స్ ద్వారా షాపింగ్ చేయడం ద్వారా బ్యాంకు కస్టమర్లు 20 శాతం వరకు డిస్కౌంట్ పొందుతారు.

- ఎంపిక చేసిన హోమ్ లోన్స్ పైన 12 ఈఎంఐల మినహాయింపు ఉంది.

- టూ-వీలర్ కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఆన్-రోడ్ ఫైనాన్స్ సౌకర్యం.

- వ్యాపారుల కోసం టర్మ్ ఎక్విప్‌మెంట్ లోన్స్, వాణిజ్య వాహనాల ఫైనాన్స్ పైన ప్రత్యేక ప్రయోజనాలు.

- యాక్సిస్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లు.

- రిటైల్ లోన్ ప్రోడక్ట్స్, రెస్టారెంట్స్ బిల్లులపై రాయితీలు.

తక్కువ వార్షిక వడ్డీకే పర్సనల్, స్టడీ, బంగారు రుణాలు. పర్సనల్ లోన్ పైన 10.25 శాతం, స్టడీ లోన్ 8.9 శాతం, బంగారం రుణాలు 9 శాతం వడ్డీ వర్తిస్తుంది.

- ఈ పండుగ సందర్భంగా వివిధ బ్రాండ్స్‌తో జత కట్టింది యాక్సిస్ బ్యాంకు. అలాగే, స్థానిక రిటైలర్స్‌తోను జత కట్టింది.

పెరుగుతున్న గృహ విక్రయాలు

పెరుగుతున్న గృహ విక్రయాలు

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జూలై-సెప్టెంబర్ కాలంలో గృహ విక్రయాలు 59 శాతం మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో విక్రయాలు 59 శాతం పెరిగి 55,907 యూనిట్లుగా నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం రియాల్టీ మార్కెట్ వేగంగా కోలుకుంటోంది.

ప్రోప్ టైగర్ ప్రకారం గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 35,132 విక్రయాలు మాత్రమే నమోదు అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు అహ్మదాబాద్‌లో 64 శాతం, బెంగళూరులో 36 శాతం, చెన్నైలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఢిల్లీలో విక్రయాలు గత ఏడాది వలె ఉన్నాయి. హైదరాబాద్‌లో విక్రయాలు రెట్టింపు అయ్యాయి. కోల్‌కతాలో ఏడు శాతం వృద్ధి నమోదయింది. ముంబైలో 92 శాతం పెరిగాయి. పుణేలో 43 శాతం వృద్ధి కనిపించింది.

English summary

యాక్సిస్ బ్యాంకు అదిరిపోయే ఆఫర్: హోమ్ లోన్ తీసుకుంటే 12 EMIలు రద్దు! | Axis Bank to waive 12 EMIs on select home loans under festive offer

Axis Bank on Tuesday announced waiver of 12 EMIs on select home loan products, and discounts on various online purchases as part of its festival offer.
Story first published: Wednesday, October 20, 2021, 8:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X