For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నారా? వడ్డీ రేటు భారాన్ని, EMIని ఇలా తగ్గించుకోండి

|

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఇటీవల పెరిగాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు అరవై శాతం వృద్ధి నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో మూడు రెట్లు పెరిగిందని, ఏడాది ప్రాతిపదికన 59 శాతం పెరిగిందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ తెలిపింది. మిగతా విక్రయ సంస్థలు కూడా అమ్మకాలు పెరిగినట్లు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గడం, ప్రస్తుత పండుగ సీజన్‌లో ఆఫర్ల కింద వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేటును మరింత తగ్గించడం, జాబ్ మార్కెట్ పుంజుకోవడం, ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటం, నివాస గృహాలు డిమాండ్‌కు మించి అందుబాటులో ఉండటం, వర్క్ ఫ్రమ్ హోంతో సొంతిళ్లకు డిమాండ్ పెరగడం, ఇటీవల కరోనా నుండి కోలుకొని, కంపెనీలు వేతనాలు పెంచడం వంటి వివిధ అంశాలు కలిసి వస్తున్నాయి. దీనికి కార్పోరేట్ రుణాలు లేకపోవడంతో బ్యాంకులు హోమ్ లోన్ పైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం బెస్ట్ ఆఫర్ అని చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ బాగుంటే 6.5 శాతం నుండే హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఉన్నాయి.

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోండి

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోండి

ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటు పదిహేనేళ్ల కనిష్టం వద్ద ఉంది. వివిధ బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేటును తగ్గించాయి. పండుగ సీజన్‌లో దాదాపు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు 7 శాతానికి దిగువనే ఉంది. చాలా ఆర్థిక సంస్థలు ఇప్పటికే తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్నాయని, ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారు ఈ పండుగ సీజన్‌లో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.

హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంది. అయితే ఈ వడ్డీ రేటు ఆయా ఆర్థిక సంస్థ ఆధారంగా, మీ క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం, ఉద్యోగ ప్రొఫైల్, యజమాని ప్రొఫైల్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారు వివిధ ఆర్థిక సంస్థల ఆన్‌లైన్ వెబ్ సైట్లను సందర్శించి, ఆఫర్లను పోల్చుకోవాలి. ఎందులో మీకు తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుందో తెలుసుకోవాలి.

వివిధ ఆర్థిక సంస్థలు అందించే వడ్డీ రేట్లతో పాటు మీ క్రెడిట్, వేతన, ఉద్యోగ ప్రొఫైల్ ఆధారంగా ఎక్కడ మంచి డీల్ ఉందో చూసుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజులను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే, రుణ కాలపరిమితి మీ ఈఎంఐ, మొత్తం చెల్లింపు పైన ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది. తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే ఎక్కువ ఈఎంఐ వర్తిస్తుంది.

ఉద్యోగి నెల ఆదాయంలో 50 శాతం లోపు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు మొగ్గు చూపుతాయి. అందుకే దరఖాస్తు ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి తెలుసుకోవాలి. ఈఎంఐ స్థోమత, అనివార్య ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకొని అందుకు తగిన కాలపరిమితి లేదా ఈఎంఐ ఉండేలా చూసుకోవాలి.

మీ ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోండి

మీ ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోండి

ఎప్పటి నుండో ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. దేశంలోని అనేక బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఇస్తున్నందున ప్రాపర్టీ పైన పెట్టుబడికి ఇది సరైన సమయం. పండుగ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఉంది. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు మంచి ఉపశమనంగా ఉన్నాయి. అయితే మీరు ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని ఉంటే, ఈఎంఐలను చెల్లిస్తుంటే మీ హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేటు దశాబ్ద కనిష్టం వద్ద ఉంది. అయితే ఇప్పటికే లోన్ తీసుకున్న వారు కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు. ఈ వడ్డీ రేటు భారాన్ని తగ్గించుకోవడానికి మిగతా రుణాన్ని ట్రాన్సుఫర్ చేసుకోవడం ఓ మంచి మార్గం.

మీ రుణాన్ని బీపీఎల్ఆర్ నుండి ఈబీఆర్ లింక్డ్ రుణం కిందకు మార్చుకుంటే మీ ఈఎంఐతో పాటు వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు తగ్గుదల అంటే తగ్గిన వడ్డీ రేటుతో మీరు ఈఎంఐ చెల్లిస్తారు. ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ రుణ గ్రహీతలు పెనాల్టీ లేకుండా పాక్షిక ప్రీపేమెంట్ చేయడం ద్వారా ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు.

మీ ప్రస్తుత రుణంపై వడ్డీ రేటు అధికంగా ఉందని భావిస్తే ఆయా ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను పరిశీలించి బ్యాలెన్స్‌ను ట్రాన్సుఫర్ చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అలాగే డెబిట్ టు ఇన్‌కం రేషియో కూడా తక్కువగా ఉండాలి. ఇది మీకు తక్కువ వడ్డీ రేటును పొందడానికి ఉపయోగపడుతుంది.

అలాగే, ఈఎంఐ ఎక్కువగా ఉందని భావిస్తే, మీరు రుణ కాల వ్యవధిని కూడా పొడిగించవచ్చు.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

- ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.7 శాతం నుండి 7.50 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.70 శాతం నుండి 7.75 శాతం, రూ.75 లక్షలకు పైన 6.70 శాతం నుండి 7.75 శాతం.

- బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.50 శాతం నుండి 8.00 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.50 శాతం నుండి 8.00 శాతం, రూ.75 లక్షలకు పైన 6.50 శాతం నుండి 8.25 శాతం.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.8 శాతం నుండి 7.60 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.90 శాతం నుండి 7.65 శాతం, రూ.75 లక్షలకు పైన 6.90 శాతం నుండి 7.65 శాతం.

- కెనరా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.9 శాతం నుండి 11.45 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.90 శాతం నుండి 11.45 శాతం, రూ.75 లక్షలకు పైన 6.90 శాతం నుండి 7.65 శాతం.

- కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.5 శాతం నుండి 7.25 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.50 శాతం నుండి 7.25 శాతం, రూ.75 లక్షలకు పైన 6.50 శాతం నుండి 7.15 శాతం.

- ఐసీఐసీఐ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.7 శాతం నుండి 7.55 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.50 శాతం నుండి 7.55 శాతం, రూ.75 లక్షలకు పైన 6.70 శాతం నుండి 7.55 శాతం.

- యాక్సిస్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.75 శాతం నుండి 11.50 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.75 శాతం నుండి 11.50 శాతం, రూ.75 లక్షలకు పైన 6.75 శాతం నుండి 11.50 శాతం.

- ఎల్ఐసీ హౌసింగ్ హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.66 శాతం నుండి 7.85 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.66 శాతం నుండి 8.05 శాతం, రూ.75 లక్షలకు పైన 6.66 శాతం నుండి 8.05 శాతం.

- HDFC లిమిటెడ్ హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 6.7 శాతం నుండి 8.45 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 6.70 శాతం నుండి 8.60 శాతం, రూ.75 లక్షలకు పైన 6.70 శాతం నుండి 8.70 శాతం.

- PNB హౌసింగ్ హోమ్ లోన్ వడ్డీ రేటు - రూ.30 లక్షల వరకు 7.20 శాతం నుండి 12.00 శాతం వరకు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 7.20 శాతం నుండి 12.00 శాతం, రూ.75 లక్షలకు పైన 7.40 శాతం నుండి 12.00 శాతం.

English summary

ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నారా? వడ్డీ రేటు భారాన్ని, EMIని ఇలా తగ్గించుకోండి | Are you looking for cheapest home loan? Follow this to reduce existing interest rate

Many people consider festive seasons auspicious for making big-ticket spends or for meeting crucial life goals.
Story first published: Wednesday, October 20, 2021, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X