For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు షాప్ ఉందా? పెట్టుబడి లేకుండానే... అమెజాన్ సూపర్ ఆఫర్!!

|

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐ హ్యావ్ స్పేస్ (IHS) అనే డెలివరీ ప్లాట్ ఫాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే వ్యాపారులను తమ వస్తువులను సరఫరా చేయడంలో భాగస్వాములుగా చేసుకుంటోంది. జనరల్ స్టోర్ యజమానులు, కియోస్క్‌లు, మొబైల్ సర్వీసింగ్ సెంటర్లు, రీచార్జ్ సెంటర్లు, కిరాణా షాప్, కూరగాయల వ్యాపారులు ఇలా అందరినీ తమ వ్యాపారంలో కలుపుకుంటోంది.

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమందిమోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది

స్థానికులను ఎంచుకోవడం ద్వారా సులభమైన డెలివరీ

స్థానికులను ఎంచుకోవడం ద్వారా సులభమైన డెలివరీ

తమ ప్రాంతాలను గురించి బాగా తెలిసిన స్థానికులను ఎంచుకోవడం ద్వారా కొరియర్ సమస్యలను పరిష్కరించుకోవడంతో ఆయా వర్గాల మన్ననలు పొందుతోంది. తమ వస్తువులను తామే డెలివరీ చేసుకుంటామని అమెజాన్ చెబుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్న దుకాణదారులతో చేయి కలుపుతోంది. అఫ్పుడు చిన్న షాపర్స్ ఆయా ప్రాంతాల్లోని వారికి వస్తువులు సరఫరా చేస్తారు.

పెట్టుబడి అవసరం లేదు

పెట్టుబడి అవసరం లేదు

IHSలో చేరేందుకు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదని అమెజాన్ తెలిపింది. ఇందులో స్థానిక దుకాణదారులు తమ దుకాణానికి రెండు నుంచి నాలుగు కిలో మీటర్ల పరిధిలోని అమెజాన్ వినియోగదారులకు ఉత్పత్తులను అందించవలసి ఉంటుంది. ఇందుకు ప్రతి డెలివరీకి కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. సరాసరిన రోజుకు 20 నుంచి 30 ప్యాకేజీలు అందించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని అమెజాన్ పేర్కొంది.

డబుల్ బెనిఫిట్స్!

డబుల్ బెనిఫిట్స్!

దీంతో పాటు IHSలో చేరిన దుకాణాలను తమ పికప్ పాయింట్స్‌గా మారుస్తామని అమెజాన్ తెలిపింది. తద్వారా వారికి డబుల్ బెనిఫిట్ వస్తుందని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మహా నగరాలతో పాటు వరంగల్, గుంటూరు, డెహ్రాడూన్, అమృత్‌సర్ వంటి 180 పట్టణాలలో కూడా తమ IHS భాగస్వాములు ఉన్నారని అమెజాన్ తెలిపింది. అందరూ లాభపడేలా ఉన్న IHS సరఫరా విధానాన్ని త్వరలో పల్లెలకు విస్తరిస్తామని తెలిపింది. దీంతో మీరికూడా IHS చేరి, సంపాదించుకోవచ్చు.

English summary

మీకు షాప్ ఉందా? పెట్టుబడి లేకుండానే... అమెజాన్ సూపర్ ఆఫర్!! | Amazon partners with local Indian stores

Amazon India has partnered with local store owners of India for its 'I Have Space' (IHS) programme to provide pickup and delivery services to customers across different cities within a 2–4 kilometre radius of their store.
Story first published: Wednesday, December 18, 2019, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X