For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారులకు అమెజాన్ గుడ్‌న్యూస్, ICICI ద్వారా రూ.25 లక్షల రుణం

|

భారత్‌లోని చిన్న వ్యాపారులకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త. ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి వ్యాపారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తో జత కట్టింది. అమెజాన్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులకు ఈ సౌకర్యం లభిస్తుంది. దీని ద్వారా వ్యాపారులకు రూ.25 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు ప్రత్యేకించి చిన్న వ్యాపారులకు తొలిసారి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ సౌకర్యంగా అందుబాటులో ఉంటుంది.

ఇతర బ్యాంకు ఖాతాదారులు కూడా

ఇతర బ్యాంకు ఖాతాదారులు కూడా

అమెజాన్ ఇండియా మార్కెట్ ప్లేస్‌లో నమోదయిన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలకు రూ.25 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్(OD) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ICICI బ్యాంకు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకులో కరెంట్ ఖాతా ఉన్న వ్యాపారులు తమ నిర్వహణ మూలధన అవసరాల కోసం దీనిని వాడుకోవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు తమ వద్ద కరెంట్ ఖాతా ప్రారంభించి, ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చునని వెల్లడించింది. దరఖాస్తు నుండి OD మంజూరు వరకు పూర్తిగా డిజిటల్‌లో జరుగుతుందని స్పష్టం చేసింది. క్రెడిట్ బ్యూరోల నుండి వ్యాపారులు, సంస్థలకు సంబంధించిన ఆర్థిక వివరాల ఆధారంగా OD మొత్తాన్ని నిర్ణయిస్తుంది. MSMEలు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం కోసం ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.

వడ్డీ చెల్లించాలి

వడ్డీ చెల్లించాలి

OD సౌకర్యాన్ని ఉపయోగించుకున్న వ్యాపారులు తాము ఉపయోగించిన OD మొత్తంపై వడ్డీని చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆటోమేటెడ్ స్కోర్ కార్డ్ ఆధారిత వ్యవస్థ ద్వారా వ్యాపారులకు తక్షణ OD సౌకర్యాన్ని ఆమోదిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని తక్షణమే పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా లేకుంటే మాత్రం ఖాతా తెరిచి, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. వ్యాపారులు తమ బ్యాంకు స్టేట్‌మెంట్, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు సమర్పించడం ద్వారా OD రూపంలో క్రెడిట్ తీసుకోవచ్చును.

ఏడాదికోసారి రెన్యూవల్

ఏడాదికోసారి రెన్యూవల్

కస్టమర్లు ఏడాదికి ఒకసారి ఈ OD సౌకర్యాన్ని రెన్యూవల్ చేసుకోవచ్చు. ఒకసారి OD తీసుకున్న తర్వాత చెల్లింపులను బట్టి మరోమారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు వెబ్ సైట్‌లోని సెల్లర్ సెంట్రల్ బ్యానర్ క్లిక్ చేస్తే ఐసీఐసీఐ బ్యాంకు ఇన్‌స్టా ఓడీ ఫెసిలిటీని పొందవచ్చు. వెబ్ సైట్‌లోకి లాగ్-ఇన్ కావడం ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును పూర్తి చేయాలి. KYC తర్వాత ఆమోదం లభిస్తుంది. క్రెడిట్ స్కోర్, బ్యాంకు స్టేట్‌మెంట్, ఐటీ రిటర్న్స్‌ను బట్టి OD సౌకర్యం అప్రూవ్ అవుతుంది.

అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ బన్సాల్ మాట్లాడుతూ... అమెజాన్ డాట్ ఇన్ ద్వారా సెల్లర్స్‌కు మద్దతు ఇస్తున్నామని, కరోనా మహమ్మారి సమయంలో ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. వ్యాపారులకు సులభమైన, నమ్మకమైన క్రెడిట్ యాక్సెస్ ఇవ్వడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. తక్కువ ఖర్చుతో, పారదర్శక నిబంధనలతో మద్దతు ఇస్తామన్నారు. ఐసీఐసీఐ బ్యాంకుతో తమ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా వ్యాపారులకు OD సౌకర్యం తక్షణమే, డిజిటల్‌గా అందుతుందని, సౌకర్యవంతమైన రేట్లలో ఇది ఉంటుందన్నారు. వారి భవిష్యత్తు, తక్షణ లక్ష్యాలను నెరవేర్చేదిగా ఉంటుందన్నారు.

English summary

వ్యాపారులకు అమెజాన్ గుడ్‌న్యూస్, ICICI ద్వారా రూ.25 లక్షల రుణం | Amazon India sellers get overdraft protection upto RS 25 lakh through ICICI bank

ICICI announced it has partnered with Amazon India to offer overdraft protection up to 25 lakh rupees for Amazon India sellers and small businesses, according to a press release from the bank.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X