For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ మద్దతు ధర, ఈ వారం క్రిప్టోకు సానుకూలం

|

క్రిప్టోకింగ్ బిట్ కాయిన్ గతవారం స్వల్ప లాభాల్లో ముగిసింది. గతవారం 32,600 దిగువన ప్రారంభమైన బిట్ కాయిన్ వారాంతంలో 32,769 డాలర్ల వద్ద ముగిసింది. బిట్ కాయిన్ ఓ సమయంలో 29వేల డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని, వారం మొత్తంలో ఎక్కువగా 31,000 డాలర్ల నుండి 32,000 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా బిట్ కాయిన్ వలె గతవారం అంతా పైకీ కిందకు కదలాడి, చివరకు అతి స్వల్ప లాభాల్లో ముగిశాయి. కొన్ని క్రిప్టోలు నష్టపోయాయి.

బిట్ కాయిన్‌కు సానుకూలం

బిట్ కాయిన్‌కు సానుకూలం

బిట్ కాయిన్ మైనింగ్ పైన చైనా కఠిన నిర్ణయం నేపథ్యంలో గతవారం మధ్యలో బిట్ కాయిన్ 30వేల డాలర్ల దిగువన కూడా ట్రేడ్ అయింది. అయితే ఈ వారం బిట్ కాయిన్ సానుకూలంగా కదలాడే అవకాశం ఉందని పలు రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఎల్ సాల్వేడార్ తర్వాత మరో దేశం కూడా బిట్ కాయిన్‌కు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటోంది. పరాగ్వే దేశం బిట్ కాయిన్‌ను అధికారికంగా గుర్తించే దేశంగా మారనుంది. ఎల్ సాల్వేడార్ కూడా దేశంలోని ప్రతి అడల్ట్‌కు 30 డాలర్ల విలువ కలిగిన బిట్ కాయిన్స్ ఇస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుండి ఎల్ సాల్వేడార్‌లో బిట్ కాయిన్ లీగల్.

క్రిప్టో మద్దతు, నిరోధకస్థాయి

క్రిప్టో మద్దతు, నిరోధకస్థాయి

క్రిప్టోకరెన్సీ మద్దతు ధర 29,700 డాలర్లు, 28,500 డాలర్లు, 27,300 డాలర్లు, 25,600 డాలర్లుగా ఉంది. నిరోధకస్థాయి 41,500 డాలర్లు, 39,800 డాలర్లు, 36,500 డాలర్లు, 32,100 డాలర్లుగా ఉంది. ఈ వారం బిట్ కాయిన్ వ్యాల్యూ కాస్త తగ్గి 30వేల డాలర్ల స్థాయికి కూడా చేరుకోవచ్చునని, కానీ మొత్తంగా కాస్త సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలాన్ మస్క్ చమత్కారం

ఎలాన్ మస్క్ చమత్కారం

బిట్ కాయిన్, ఈ క్రిప్టో మద్దతుదారులకు ట్విట్టర్ వేదికగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కాస్త ఫన్ ఇచ్చారు. తాజా ట్వీట్‌లో ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ మాక్సిస్ అంటూ చమత్కరించారు. లైట్ బల్బ్‌లో స్క్రూ చేయడానికి ఎన్ని బిట్ కాయిన్ మాక్సిస్ పడుతుందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary

బిట్ కాయిన్ మద్దతు ధర, ఈ వారం క్రిప్టోకు సానుకూలం | A volatile Bitcoin continues to dictate market trends

Bitcoin slips towards $30,000 as strategists flag near-term risks. Bitcoin dropped from $36,000 levels to $29,000 mid-week before regaining most of the losses later.
Story first published: Sunday, June 27, 2021, 17:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X