For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 అద్భుతమైన ప్రత్యేక డిపాజిట్ పథకాలు, వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

కరోనా కారణంగా గత ఏడాది డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గాయి. సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పథకాల పైన ఆధారపడతారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను ప్రారంభించాయి. ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద బ్యాంకులు సీనియర్ సిటిజన్స్‌కు 0.25 శాతం అదనపు వడ్డీని అందిస్తాయి. సాధారణంగా సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 0.50 శాతం ఎక్కువగా ఉంటుంది. దీనికి 0.25 శాతం అదనం. అంటే మొత్తం 0.75 శాతం అదనపు వడ్డీ అందుతుంది. రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అయిదేళ్ల నుండి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ వర్తిస్తాయి.

స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చా?

స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఇటీవల ఆర్బీఐ బై-మంత్లీ మానిటరీ పాలసీ సందర్భంగా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కస్టమర్లు మరింత అధిక వడ్డీ రేటు కోసం ఇంకొంత కాలం వేచి చూడాలి. ఆర్బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటును పెంచితే అప్పుడు కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీర్ఘకాలానికి మాత్రం ఇన్వెస్ట్ చేయమని మాత్రం ఆర్థిక నిపుణులు సూచించడం లేదు. ఎందుకంటే దీర్ఘకాలంలో డిపాజిట్ వడ్డీ రేటు తక్కువగా ఉంది. స్వల్పకాలిక డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఉండవు. అంతేకాదు, వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు తొలుత స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతాయి. దీర్ఘకాలిక డిపాజిట్లపై పెంచవు.

ఉదాహరణకు డిసెంబర్ 1, 2021న HDFC బ్యాంకులో ఏడు రోజుల నుండి సంవత్సరం మెచ్యూరిటీ పైన FD వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లను పెంచింది. సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పై బ్యాంకు పెంచిన వడ్డీ రేటు వర్తించదు. కేవలం స్వల్పకాలానికి మాత్రమే పెంచింది. కాబట్టి అయిదేళ్ల నుండి పదేళ్ల కాలానికి లాక్-ఇన్ చేస్తే ఈ పెరిగిన వడ్డీ రేటుకు దూరమే.

FDతో పాటు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీస్ మంత్లీ స్కీం వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. వివిధ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక వడ్డీ రేట్లు ఇలా...

SBI స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం

SBI స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం

- 7 days to 45 days 3.4,

- 46 days to 179 days 4.4,

- 180 days to 210 days 4.9,

- 211 days to less than 1 year 4.9,

- 1 year to less than 2 year 5.5,

- 2 years to less than 3 years 5.6,

- 3 years to less than 5 years 5.8,

- 5 years and up to 10 years 6.2.

HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FD

HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FD

7 - 14 days 3.00%,

- 15 - 29 days 3.00%,

- 30 - 45 days 3.50% 46 - 60 days 3.50%,

- 61 - 90 days 3.50% 91 days - 6 months 4.00%,

- 6 months 1 day - 9 months 4.90%,

- 9 months 1 day < 1 Year 4.90%,

- 1 Year 5.40%,

- 1 year 1 day - 2 years 5.50%,

- 2 years 1 day - 3 years 5.65%,

- 3 year 1 day- 5 years 5.85%,

- 5 years 1 day - 10 years 6.25%.

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్ FD

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్ FD

- 7 days to 14 days 3.00%,

- 15 days to 29 days 3.00%,

- 30 days to 45 days 3.50%,

- 46 days to 60 days 3.50%,

- 61 days to 90 days 3.50%,

- 91 days to 120 days 4.00%,

- 121 days to 150 days 4.00%,

- 151 days to 184 days 4.00%,

- 185 days to 210 days 4.90%,

- 211 days to 270 days 4.90%,

- 271 days to 289 days 4.90%,

- 290 days to less than 1 year 4.90%,

- 1 year to 389 days 5.40%,

- 390 days to < 15 months 5.40%,

- 15 months to < 18 months 5.40%,

- 18 months to 2 years 5.50%,

- 2 years 1 day to 3 years 5.70%,

- 3 years 1 day to 5 years 5.90%,

- 5 years 1 day to 10 years 6.30%,

- 5 Years (80C FD) 5.90%.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

- 7 days to 14 days 3.30%,

- 15 days to 45 days 3.30%,

- 46 days to 90 days 4.20%,

- 91 days to 180 days 4.20%,

- 181 days to 270 days 4.80%,

- 271 days & above and less than 1 year 4.90%,

- 1 year 5.40% Above 1 year to 400 days 5.50%,

- Above 400 days and up to 2 Years 5.50%,

- Above 2 Years and up to 3 Years 5.60%,

- Above 3 Years and up to 5 Years 5.75%,

- Above 5 Years and up to 10 Years 6.25%.

English summary

4 అద్భుతమైన ప్రత్యేక డిపాజిట్ పథకాలు, వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చా? | 4 Best Special Deposit Schemes For Senior Citizens To Invest In 2022

Last year, some of the country's top lenders, including State Bank of India, HDFC Bank, ICICI Bank, and Bank of Baroda, launched special fixed deposit schemes for elderly folks in order to safeguard interest rates and senior citizens' trust in fixed deposits amid falling interest rates of bank deposits due to COVID and economic slowdown.
Story first published: Friday, December 10, 2021, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X