For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19 Personal Loans: తక్కువ వడ్డీ రేటుతో ఈ బ్యాంకుల్లో కోవిడ్ 19 పర్సనల్ లోన్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ వైరస్ సోకిన వారికి, వారి కుటుంబాలకు చికిత్స కోసం వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు కోవిడ్ 19 పర్సనల్ లోన్‌ను రూ.5 లక్షల వరకు అందిస్తున్నాయి. ఈ రుణాల శాలరైడ్‌కు, అలాగే నాన్-శాలరైడ్‌కు, పెన్షనర్లకు తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా అయిదేళ్ల కాలపరిమితితో ఈ రుణాలను అందిస్తున్నాయి.

01.04.2021 తేదీన లేదా ఆ తర్వాత ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఇందుకు కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి. మీలో ఎవరైనా కోవిడ్ 19 పాజిటివ్ చికిత్స కోసం రుణం పొందాలనుకుంటే ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులివే.

SBI కవచ్ పర్సనల్ లోన్ స్కీం

SBI కవచ్ పర్సనల్ లోన్ స్కీం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవచ్ పర్సనల్ లోన్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. SBI అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ స్కీం ఫీచర్స్....

- కనీస, గరిష్ట లోన్ మొత్తం: కనీసం రూ.25,000 & గరిష్టం: రూ.5 లక్షలు. అర్హత ఆధారంగా ఉంటుంది.

- రీయింబర్స్‌మెంట్ సౌకర్యం: బ్రాంచీ ఛానల్, డిజిటల్ ఛానల్ (యోనో ద్వారా ప్రీ-అప్రూవ్డ్) ద్వారా అందుబాటులో ఉంటాయి.

- రుణ వితరణ: శాలరీ అకౌంట్లోకి క్రెడిట్/ పెన్షన్/ SB అకౌంట్‌లోకి క్రెడిట్

- CIC (సిబిల్ CV స్కోర్): బ్యాంకు నిబంధనలు ఉంటాయి.

- రుణ సౌకర్యం: టర్మ్ లోన్

- టార్గెట్ గ్రూప్: శాలరైడ్, నాన్-శాలరైడ్, పెన్షనర్లైన బ్యాంకు కస్టమర్లు.

- రుణ కాలపరిమితి: 60 నెలలు (3 నెలల మారటోరియం కలిపి). అంటే 57 నెలల పాటు ఈఎంఐ ఉంటుంది. మారటోరియం కాలంలో వడ్డీ రేటు కలిపి ఉంటుంది.

- వడ్డీ రేటు: 8.50%

- ప్రాసెసింగ్ ఫీజు: NIL

- సెక్యూరిటీ: NIL

- రీపేమెంట్ పెనాల్టీ: NIL

- ముందస్తు చెల్లింపు ఛార్జీలు: NIL

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహ్యోగ్ రిన్ కోవిడ్ పర్సనల్ లోన్ స్కీం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహ్యోగ్ రిన్ కోవిడ్ పర్సనల్ లోన్ స్కీం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహ్యోగ్ రిన్ కోవిడ్ పర్సనల్ లోన్ స్కీంను అందిస్తోంది.

- వ్యాలిడిటీ: ఈ స్కీం 31.03.2022 వరకు వర్తిస్తుంది.

- అర్హత: బ్యాంకులో అకౌంట్ కలిగిన ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు అందరూ. గత 12 నెలలుగా వేతనం క్రెడిట్ అవుతున్న వారు అర్హులు.

- నేచర్ ఆఫ్ లోన్: టర్మ్ లోన్

- రుణ మొత్తం: వేతన జీవులకు అయితే గత 6 నెలలుగా అకౌంట్‌లో క్రెడిట్ అవుతున్న మొత్తానికి ఆరు రెట్లు.

- రీయింబర్సుమెంట్ ఫెసిలిటీ: 3 నెలల వరకు

- ఇన్‌కం క్రెటేరియా: అర్బన్, మెట్రోలో రూ.15000.00 & సెమీ అర్బన్, రూరల్ కేంద్రాల్లో రూ.10000.00.

- లోన్ టెన్యూర్: గరిష్టంగా 60 నెలలు లేదా or మిగతా సర్వీస్ కాలం. ఏది తక్కువ అయితే అది.

- వడ్డీ రేటు RLLR + 1.70%

- CIC Score: 650 & above

- ప్రాసెసింగ్ ఫీజు & డాక్యుమెంటేషన్ ఛార్జీలు: NIL

బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్ 19 పర్సనల్ లోన్

బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్ 19 పర్సనల్ లోన్

బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన కోవిడ్ 19 పర్సనల్ లోన్ ఫీచర్స్ ఇవి...

- అర్హత - ఏడాది కాలంగా ఈ బ్యాంకు నుండి వేతనం క్రెడిట్ అవుతున్న శాలరైడ్.

- రుణ మొత్తం - గ్రాస్ శాలరీకి మూడు రెట్లు.

- రుణ పరిమితి - గరిష్టంగా రూ. లక్షలు (ఉద్యోగులకు).

- ప్రాసెసింగ్ ఫీజు - NIL

- రీపేమెంట్ మోడ్- 6 నెలల మారటోరియంతో కలిపి 36 నెలలు.

బరోడా కోవిడ్ పర్సనల్ లోన్ 2.0

బరోడా కోవిడ్ పర్సనల్ లోన్ 2.0

బరోడా కోవిడ్ పర్సనల్ లోన్ 2.0 ఫీచర్...

- రుణ అవసరం - కోవిడ్ ట్రీట్మెంట్ కోసం.

- రుణ మొత్తం - కనీసం రూ.25,000. గరిష్టం రూ.5,00,000.

- వడ్డీ రేటు - 2 శాతం

- రీపేమెంట్ ఛార్జీలు - NIL

English summary

COVID-19 Personal Loans: తక్కువ వడ్డీ రేటుతో ఈ బ్యాంకుల్లో కోవిడ్ 19 పర్సనల్ లోన్ | 4 Best PSU Banks With The Cheapest Interest Rates On COVID-19 Personal Loans

To cover the costs of Covid-19 treatment for self and families, major public-sector banks declared COVID-19 personal loans of up to Rs 5 lakh. These loans are available at low-interest rates to salaried, non-salaried, and pensioners with a tenure of 5 years and no processing fees.
Story first published: Thursday, July 15, 2021, 12:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X