For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెబిట్ కార్డ్ ఉందా.. SBI అదిరిపోయే ఆఫర్: మీరు అర్హులేనా చూడండి?

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డు ఉందా? అయితే మీకో శుభవార్త. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో మీకు షాపింగ్ చేసేందుకు అద్భుతమైన ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డు లేకుండా కేవలం డెబిట్ కార్డు ఉండి.. షాపింగ్ చేయడానికి ఇబ్బందులుపడేవారికి ఇది ఆనందించే విషయం. డెబిట్ కార్డ్ ఈఎంఐ సౌకర్యాన్ని అక్టోబర్ 7 (సోమవారం)న ఎస్బీఐ ప్రారంభించింది. ఇది కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?

18 నెలల వరకు ఈఎంఐ, 40వేల మర్చంట్స్..

18 నెలల వరకు ఈఎంఐ, 40వేల మర్చంట్స్..

డెబిట్ కార్డుతో షాపింగ్ చేసేవారు 'డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీ' కింద 6 నెలల నుంచి 18 నెలల వరకు ఈఎంఐ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అంతేకాదు, 40,000కు పైగా మర్చంట్స్, స్టోర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. 1500 నగరాల్లో ఇది అందుబాటులో ఉంది. స్టోర్స్‌లలో డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఫైన్ ల్యాబ్స్ బ్రాండెండ్ పీఓఎస్ మెషీన్స్ ఉన్న స్టోర్స్‌కు ఇది వర్తిస్తుంది.

కీలక బెనిఫిట్స్

కీలక బెనిఫిట్స్

ఎస్బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీలో ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది పేపర్‌లెస్ లోన్. ఎలాంటి చిక్కులు ఉండవు. ప్రాసెసింగ్ ఫీజు వంటివి లేవు. బ్రాంచీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన బ్రాండ్స్ పైన జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. నిమిషం లోపే లోన్ వస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే డెబిట్ కార్డుపై ఈఎంఐ సౌకర్యం పొందవచ్చు. మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనే అంశంతో నిమిత్తం లేదు. కానీ మంచి క్రెడిట్ చరిత్ర ఉండాలి. ఉత్పత్తి కొనుగోలు చేసిన నెల రోజుల తర్వాత నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది.

అర్హతను చెక్ చేసుకోండి..

అర్హతను చెక్ చేసుకోండి..

ఈ లోన్‌కు మీరు అర్హులా కాదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి DCEMI అని 567676 కు ఎస్సెమ్మెస్ చేయాలి.

ఎస్బీఐ చైర్మన్ ఏం చెప్పారంటే...

ఎస్బీఐ చైర్మన్ ఏం చెప్పారంటే...

'డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీ' లాంచింగ్ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడారు. ఈ పండుగ సీజన్లో తమ కస్టమర్లకు దీనిని అందుబాటులోకి తెచ్చినందుకు ఆనందంగా ఉందని, డెబిట్ కార్డు ఈఎంఐ వినియోగదారులకు వివిధ మర్చంట్ స్టోర్స్‌లలో వివిధ ఈఎంఐలలో మన్నికైన ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చునన్నారు. మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా ఈఎంఐలలో చెల్లించే సౌకర్యం కల్పిస్తుందన్నారు.

English summary

డెబిట్ కార్డ్ ఉందా.. SBI అదిరిపోయే ఆఫర్: మీరు అర్హులేనా చూడండి? | SBI launches Debit Card EMI facility with multiple benefits

With an aim to provide an ultimate and affordable shopping experience to its customers this festive season, the country’s largest lender, State Bank of India (SBI) on October 7 launched the Debit Card EMI facility for its bank account holders.
Story first published: Monday, October 7, 2019, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X