For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే దీపావళి నాటికి దుమ్మురేపే స్టాక్స్: ఇందులో 65% వరకు రిటర్న్స్

|

ఆర్థిక మందగమనం, ఆదాయం తగ్గుదల, లిక్విడిటీ క్రైసిస్, అసెట్స్ క్వాలిటీ ఆందోళనలు, విదేశీ పెట్టుబడుల ఫ్లో, కార్పోరేట్ పాలనా సమస్యలు, అమెరికా - చైనా వాణిజ్య భయం, ఇతర అంతర్జాతీయ పరిమాణాలు వంటి వివిధ కారణాల వల్ల గత ఏడాది (2018) దీపావళి నుంచి ఈ ఏడాది (2019) దీపావళి వరకు మందగమనం కనిపించింది. మార్కెట్లలో ఈ భయాలు, ఆందోళనలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీపావళికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. కానీ దాదాపు ఏడాదికాలంగా (కొన్ని సందర్భాల్లో మినహాయించి) మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి.

నిన్న ఉల్లి, నేడు టమాటో ధరతో జేబులకు చిల్లు

గత ఏడాది.. ఇప్పుడు దీపావళి సమయంలో..

గత ఏడాది.. ఇప్పుడు దీపావళి సమయంలో..

దీపావళి సమీపిస్తున్న ఈ సమయంలో ప్రస్తుత ఏడాది నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 11 శాతం, 14 శాతం పడిపోయాయి. అదే సమయంలో 2018 దీపావళి సమయంలో 7 శాతం, 22 శాతం పెరిగాయి. బెంచ్‌మార్క్ ఇండి సూచీలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ ఈ ఏడాది 6 శాతం ర్యాలీ కొనసాగించింది. 2018 దీపావళి సమయంలో వరుసగా 4.5 శాతం, 10 శాతం పెరిగాయి. లాభాలపరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ ముందంజలో ఉన్నాయి. ఇవి వరుసగా 9 శాతం, 17 శాతం, 3 శాతం లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్స్, ఫార్మా రంగాల పతనం మాత్రం డబుల్ డిజిట్‌లో ఉంది.

కేంద్రం నిర్ణయాలతో...

కేంద్రం నిర్ణయాలతో...

ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో మార్కెట్ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని, పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగవచ్చునని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఉద్దీపన చర్యలు బలం చేకూరుస్తాయని, కార్పోరేట్ పన్ను తగ్గింపు ప్రభావం కూడా కార్పోరేట్ ఆదాయాలపై ప్రతిబింబిస్తుందని రెలిగేర్ బ్రోకరింగ్‌కు చెందిన అజిత్ మిష్రా మనీ కంట్రోల్‌తో చెప్పారు.

14,000 మార్క్‌కు నిఫ్టీ

14,000 మార్క్‌కు నిఫ్టీ

ఆర్బీఐ వరుసగా రుణాల రేట్లు తగ్గించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గుతాయని, ఇది కూడా డిమాండ్ పెరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. 12 నుంచి 18 నెలల కాలంలో మళ్లీ పుంజుకుంటామని, 2020 దీపావళి నాటికి మార్కెట్లు తిరిగి 15 శాతం నుంచి 25 శాతం మధ్య పుంజుకుంటాయని చెబుతున్నారు. వచ్చే దీపావళి నాటికి (2020) నిఫ్టీ 50 14,000 మార్క్ చేరుకోవచ్చునని నార్నోలినా ఫైనాన్షియల్ అడ్వయిజర్ హెడ్ రీసెర్చ్ వినీతా శర్మ అన్నారు. వచ్చే మార్చి నాటికి నిఫ్టీ 12,300 మార్క్ చేరుకుంటుందని, దీపావళి నాటికి మరో 15 శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ 13 స్టాక్స్ లాభపడొచ్చు

ఈ 13 స్టాక్స్ లాభపడొచ్చు

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది దీపావళి నాటికి ఓ పదమూడు స్టాక్స్ 13 - 65 శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అవేమంటే... 1. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, 2. HDFC లైఫ్ ఇన్సురెన్స్, 3. ICICI బ్యాంకు, 4. ఇండియన్ హోటల్స్, 5. ITC, 6. రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్స్ మేనేజ్మెంట్, 7. టాటా ఎల్క్సీ, 8. ఇన్ఫోసిస్, 9. లార్సన్ అండ్ టర్బో, 10. మారికో, 11. టాటా గ్లోబల్ బీవరెజెస్, 12. టోరెంట్ పవర్, 13. గుజరాత్ గ్యాస్.

13 శాతం నుంచి 65 శాతం వరకు...

13 శాతం నుంచి 65 శాతం వరకు...

పైన పేర్కొన్న 13 స్టాక్స్‌లు వచ్చే ఏడాది దీపావళి నాటికి 13 శాతం నుంచి 65 శాతం వరకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఫినోలెక్స్ స్టాక్స్ 32 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 24 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 20 శాతం, ఐటీసీ 25 శాతం, ఆర్-నామ్ 40 శాతం, టాటా ఎల్క్సీ 65 శాతం, ఇన్ఫోసిస్ 13 శాతం, ఎల్ అండ్ టీ 18 శాతం, మారికో 13 శాతం, టాటా గ్లోబల్ 22 శాతం, టోరంట్ పవర్ 24 శాతం, గుజరాత్ గ్యాస్ 24 శాతం లాభపడవచ్చునని అంచనా.

English summary

Nifty may touch 14,000: these 13 stocks could return 13-65% by Diwali 2020

The market mood has been sombre from last Diwali 2018, thanks to economic slowdown, subdued earnings, liquidity crisis, asset quality concerns, FII outflow, corporate governance issues (in a few cases) global growth fears amid endless US-China trade tensions etc, which clearly reflected in broader markets. Diwali 2019 is still two-week away.
Story first published: Friday, October 11, 2019, 12:19 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more