For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలు చౌక కానీ అక్కడే ట్విస్ట్: ఎంత తగ్గుతుంది, మీరేం చేయాలి?

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఐదుసార్లు రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ మొత్తంగా 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 6.50 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇది శుభవార్త. అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకులు తాము ఇచ్చే చలన వడ్డీ రుణాలను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానం చేశాయి. ఈ నేపథ్యంలో రెపో రేటు తగ్గిన వెంటనే ఆ ప్రయోజనాలు రుణాలు తీసుకునే వారికి బదలీ అవుతాయి. ఫలితంగా తక్కువ వడ్డీకే హోమ్, వెహికిల్, పర్సనల్ లోన్లతో పాటు ఎంఎస్ఎంఈరుణాలు అందుబాటులోకి వస్తాయి.

రెపో రేటు ప్రామాణికం... రుణగ్రహీతలకు ప్రయోజనం

రెపో రేటు ప్రామాణికం... రుణగ్రహీతలకు ప్రయోజనం

ఈ ఏడాదిలో అంటే 2019లో ఐదుసార్లు సమీక్షించిన ఆర్బీఐ రెపో రేటును 135 పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.15 శాతానికి చేరుకుంది. గత నాలుగు పర్యాయాలు 1.1 శాతం తగ్గినా బ్యాంకులు పెద్దగా ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు మళ్లించలేదు. ఇలాంటి వాటిని నివారించేందుకు రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్బీఐ.. బ్యాంకులు అనుసరిస్తున్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) లాంటి అంతర్గత ప్రామాణిక సూచీలకు బదులు రెపో రేటు వంటి బాహ్య మార్కెట్ సూచీలను ప్రమాణికంగా తీసుకోవాలని సూచించింది. దీంతో అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటును ప్రామాణికంగా తీసుకున్నాయి. దానికి కొంత అదనంగా కలిపి వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి.

ఎస్బీఐ వడ్డీ రేటు ఇలా...

ఎస్బీఐ వడ్డీ రేటు ఇలా...

ఎస్బీఐ రెపో రేటు మీద 2.65 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రెపో రేటు 5.15 శాతానికి 2.65 శాతం అదనం. అప్పుడు ఎస్బీఐ వడ్డీ రేటు 7.80 శాతంగా ఉంటుంది.

ట్విస్ట్.. ఇది బ్యాంకుల ఇష్టం..

ట్విస్ట్.. ఇది బ్యాంకుల ఇష్టం..

బ్యాంకులకు ఇక్కడ మరో వెసులుబాటు ఉంది. రుణాలను రెపో రేటుకు అనుసంధానం చేసినప్పటికీ దీనిపై ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలన్న విచక్షణ బ్యాంకులకే వదిలేసింది.

రెపో రేటు తగ్గింపు.. రుణగ్రహీతలకు ప్రయోజనమెంత?

రెపో రేటు తగ్గింపు.. రుణగ్రహీతలకు ప్రయోజనమెంత?

ఆర్బీఐ రెపో రేటును ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకుల రుణాలను రెపో రేటుతో అనుసంధానించిన నేపథ్యంలో వడ్డీ రేటు దాదాపు ఎంత తగ్గుతుందో తెలుసుకుందాం... ఉదాహరణకు ఎస్బీఐ రూ.30 లక్షల లోపు హోమ్ లోన్ తీసుకుంటే ఇదివరకు ఉన్న 5.40 శాతం రెపో రేటు ప్లస్ 2.65 బ్యాంకు రేటు కలిపి 8.05 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గడంతో అంతే వడ్డీ రేటు తగ్గొచ్చు. అంటే 7.80 శాతానికి చేరుకుంటుంది.

ఎలాంటి రుణాలు ఎంచుకోవాలి?

ఎలాంటి రుణాలు ఎంచుకోవాలి?

మీరు కొత్తగా రుణాలు తీసుకోవాలనుకుంటే ప్లోటింగ్ వడ్డీ రేటు ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానమైన బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. అదే సమయంలో వడ్డీ రేటుకు అదనంగా బ్యాంకులు ఎంత వడ్డీని అదనంగా వసూలు చేస్తున్నాయో తెలుసుకోవాలి. ఎక్కడ తక్కువ వడ్డీ రేటు ఉంటుందో చూసుకొని మీకు అనుకూలమైన వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకును ఎంచుకోవచ్చు.

రెపో రేటు పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది

రెపో రేటు పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే రెపో రేటు పెరిగితే వడ్డీ రేటు కూడా అదే విధంగా పెరుగుతుంది. రెపో రేటు తగ్గితేనే వడ్డీ రేటు తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇతర బాహ్య బెంచ్ మార్క్ ఆధారంగా కూడా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి.

రెపో రేటు తగ్గింపుపై...

రెపో రేటు తగ్గింపుపై...

రెపో రేటు పావు శాతం తగ్గడం ఆహ్వానించదగ్గ విషయమని, వడ్డీ రేట్ తగ్గింపు ద్వారా బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేస్తాయని భావిస్తున్నామని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా అన్నారు.

రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గడం, పైగా మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు.

పండగల సీజన్ ప్రారంభంలో రేట్ల తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్లకు ఊతమిస్తుందని ఇండియన్ బ్యాంకు ఎండీ పద్మజా అన్నారు.

English summary

రుణాలు చౌక కానీ అక్కడే ట్విస్ట్: ఎంత తగ్గుతుంది, మీరేం చేయాలి? | Home loan EMIs to fall as RBI cuts repo rate for fifth time this year

From October 1, all banks have been asked to link new floating rate retail loans, including auto and home loans, to an external benchmark. For new floating auto and home loans, banks have the freedom to decide the spread over the external benchmark.
Story first published: Saturday, October 5, 2019, 12:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X