For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి... కాస్త ఆలోచించండి

|

వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవచ్చు. మనం వాహనాన్ని సక్రమంగానే నడిపించినా ఎదుటివారు సరిగ్గా నడపకపోతే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వాహనానికి సరైన బీమా ఉంటే ప్రమాదం వల్ల వాహనానికి జరిగిన నష్టాన్ని బీమా కంపెనీ నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ బీమా లేకపోతే మొత్తం ఖర్చు వాహనదారుడే భరించాల్సి ఉంటుంది. అయితే బీమా ఉంటె వాహనానికి జరిగే ప్రతి నష్టానికి క్లెయిమ్ చేసుకోవచ్చా.. ఒకవేళ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది... ఎంత నష్టం జరిగితే క్లెయిమ్ చేసుకోవచ్చో తెలుసుకోవడం మేలు. ప్రతి చిన్న దానికి కూడా క్లెయిమ్ చేసుకుంటే కొన్ని ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది.

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండితగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

క్లెయిమ్ చేసుకోవడానికి ముందు ఇవి చూసుకోవాలి...

క్లెయిమ్ చేసుకోవడానికి ముందు ఇవి చూసుకోవాలి...

* ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే బీమా ఉన్న విషయం గుర్తుకువస్తుంది. ఎంత నష్టం జరిగింది అన్న విషయం పట్టించుకోకుండా చాలామంది క్లెయిమ్ చేస్తుంటారు. అయితే ఇలా క్లెయిమ్ చేయడానికి ముందు జరిగిన ప్రమాదానికి క్లెయిమ్ చేసుకోవచ్చా, ఒక వేళ క్లెయిమ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాన్ని కోల్పోతామో చూసుకోవాలి.

* మీ క్లెయిమ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ పై ప్రభావం ఎంత ఉంటుందో చూసుకోవాలి.

* క్లెయిమ్ అప్పుడు అమలయ్యే తగ్గింపులు చూసుకోవాలి

* భవిష్యత్తులో బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉందొ కూడా తెలుసుకోవాలి.

చిన్నవాటికి క్లెయిమ్ చేసుకోవద్దు

చిన్నవాటికి క్లెయిమ్ చేసుకోవద్దు

* సాధారణంగా బీమాను ఏడాదికి ఒకసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ సమయంలో ఇంతకు ముందు ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లు చేసుకోకపోతే రెన్యూవల్ సమయంలో నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. అంటే చెల్లించాల్సిన ప్రీమియంలో కొంత డిస్కౌంట్ లభిస్తుందన్న మాట.

* నో క్లెయిమ్ బోనస్ 20 శాతం నుంచి ప్రారంభమై క్రమంగా పెరుగుతూ 50 శాతం వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది.

* అంటే ఈ మేరకు ప్రీమియం భారం తగ్గుతుందన్న మాట. ఒక్కసారి క్లెయిమ్ చేసుకున్నా ఈ బోనస్ సున్నాకు చేరుతుంది. అందుకే చిన్న చిన్న క్లెయిమ్ లు చేసుకోక పోవడం మేలు. ప్రతిదానికి క్లెయిమ్ చేసుకుంటే ప్రీమియం పెరగడానికి అవకాశం ఉండవచ్చు.

* రెండు మూడు వేల రూపాయల కోసం కాకుండా దాదాపు పదివేల వరకు నష్టం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు నో క్లెయిమ్ బోనస్ ను కోల్పోయినా పెద్ద నష్టం ఏమీ ఉండదు.

ఈ ప్రభావమూ ఉంటుంది...

ఈ ప్రభావమూ ఉంటుంది...

* బీమా ఉంది కదా అని తరచూ క్లెయిమ్ లు చేసుకోవడం మంచి పద్దతి కాదు. ఇలా చేస్తే క్లెయిమ్ చరిత్రపై ప్రభావం ఉంటుంది.

* క్లెయిమ్ లను బట్టి బీమా ప్రీమియం పెరగడానికి అవకాశం ఉంటుంది.

* మీ వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకుంటే తర్వాత కాలంలో బీమా ప్రీమియం పెరగక పోవచ్చు కానీ మీరే ప్రమాదాలు చేస్తూ క్లెయిమ్ చేస్తుంటే మాత్రం బీమా ప్రీమియం రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది

* థర్డ్ పార్టీ ద్వారా ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకుంటే నో క్లెయిమ్ బోనస్ పై ప్రభావం పడకపోవచ్చు.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని క్లెయిమ్ చేసుకోవడం వల్ల భవిష్యతులో తమకు లభించే ప్రయోజనాలను కోల్పోకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్నీ మర్చిపోవద్దు.

English summary

చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి... కాస్త ఆలోచించండి | Why you should don't claim every time for Vehicle Insurance Claim

“Insurance acts as a financial shield against any unforeseen accidental damage, which can make your vehicle not fit for use.
Story first published: Friday, September 13, 2019, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X