For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్.. లాభమా? నష్టమా?

|

''డబ్బు అవసరంలో ఉన్నారా? ఆన్‌లైన్‌లో రుణం తీసుకోండి.. జస్ట్ కొన్ని నిమిషాలు వెచ్చించి మీ వివరాలు అందజేస్తే చాలు.. క్షణాల్లో.. మీకు రూ.10 వేల నుంచి రూ.25 వేల పర్సనల్ లోన్ మంజూరు అవుతుంది..'' ఇలాంటి మెసేజ్‌లు ఇప్పుడు అందరికీ సుపరిచితమే.

రోజులో ఏదో ఒక సమయంలో మీ మొబైల్ ఫోన్‌కి ఇలాంటి మెసేజ్ రావచ్చు. లేదంటే మీ ఈ-మెయిల్ బాక్స్‌కి ఇలాంటి మెసేజ్‌తో కూడిన మెయిల్ రావచ్చు. ఇంతకీ ఈ ఇన్‌స్టంట్ ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్.. లాభమా? నష్టమా?

డబ్బు అందరికీ అవసరమే...

డబ్బు అందరికీ అవసరమే...

జీవితంలో డబ్బు అవసరం ఎవరికి రాదు చెప్పండి? ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు.. ఏ స్థాయిలో ఉండే వారికి సమస్యలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. గతంలో లోన్ కావాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సాంకేతికత పుణ్యమాని బ్యాంకులే మన ముంగిటకు వచ్చి లోన్స్ ఇస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే.. ఆన్‌లైన్ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్.

ఆన్‌లైన్‌లోనే అన్నీ...

ఆన్‌లైన్‌లోనే అన్నీ...

అవును, నేటి యువతరం ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉంటోంది. అందుకే రుణ దాతలు కూడా ఆన్‌లైన్ బాట పట్టారు. క్షణాల్లో వెరిఫికేషన్, రుణ మంజూరు జరిగిపోతుండడంతో ఎంతోమంది ఈ ఆన్‌లైన్ ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే, డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఉండదు. రుణ దరఖాస్తు ప్రక్రియ కూడా ఈజీగా స్మార్ట్‌ఫోన్ ద్వారానే జరిగిపోతుంది. పైగా తీసుకున్న రుణాన్ని రోజులు లేదా నెలల వ్యవధిలో తీర్చివేయొచ్చు.

రుణ మంజూరులో అవే కీలకం...

రుణ మంజూరులో అవే కీలకం...

బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడంలో ‘సిబిల్ స్కోర్', ‘క్రెడిట్ హిస్టరీ' పోషించే పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. బ్యాంకుల ప్రతినిధులు ఈ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న వారి చుట్టూ తిరుగుతుంటారు. ఆయా బ్యాంకులు అత్యంత తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తామంటూ ఊదరగొడుతుంటాయి.

క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా...

క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా...

అయితే ఇటీవలి కాలంలో మీ సిబిల్ స్కోర్ ఎంతున్నా పర్వాలేదు.. మీ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా పట్టించుకోం.. అసలు క్రెడిట్ హిస్టరీ లేకున్నా కూడా మీకు వ్యక్తిగత రుణం ఇచ్చేస్తామంటూ కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు రుణాల మంజూరుకు ముందుకొస్తున్నాయి. దీంతో ‘అరె.. ఇదేదో బాగానే ఉందే..' అనుకుంటూ ఇలాంటి సంస్థల పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారు.

ఈ జాగ్రత్తలు అవసరం...

ఈ జాగ్రత్తలు అవసరం...

అయితే రుణం తీసుకునేముందు రుణ గ్రహీతలు తప్పనిసరిగా కొన్ని విషయాలు ఆలోచించాలి.. మరికొన్ని జాగ్రత్తలూ వహించాలి. ఎందుకంటే, రుణం తీసుకోవడం సులభతరమే అయినా తీసుకున్న తరువాత పద్ధతిగా చెల్లించాల్సింది వారే. ఆన్‌లైన్ రుణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్యూరెన్స్ ప్రీమియం, రుణంపై వడ్డీ, ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ, ఇంకా ఇతరత్రా చార్జీలు ఏమైనా ఉన్నాయా? తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత కాలంలో తిరిగి చెల్లించగలమా? ఇలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే రుణం తీసుకోవాలి.

అర్హత ఎంతున్నా.. అవసరం మేరకే...

అర్హత ఎంతున్నా.. అవసరం మేరకే...

రుణం తీసుకునే విషయంలో రుణ గ్రహీతలు మరొక విషయం కూడా ఆలోచించాలి. మీకు రుణార్హత ఎంత ఉన్నప్పటికీ.. మీ అవసరం మేరకే రుణం తీసుకోవడం శ్రేయస్కరం. ఉదాహరణకు.. మీకు లక్ష రూపాయల అవసరం ఉంటే.. అంతే రుణం తీసుకోవాలి తప్ప. రూ.3 లక్షల మేర రుణ అర్హత ఉందని చెప్పగానే సంబరపడిపోయి ఆ మొత్తం రుణం తీసుకోకూడదు. రుణం తీసుకుంటే, ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు చట్టబద్ధంగా మీరు కట్టుబడినట్టే. కాబట్టి మీ చెల్లింపు సామర్థ్యం ఎంతో కూడా చూసుకోవాలి.

చెల్లింపు విధానం అత్యంత కీలకం...

చెల్లింపు విధానం అత్యంత కీలకం...

ఈ రోజుల్లో రుణం తీసుకోవడం సులభమే. కానీ తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరైన పద్ధతిలో చెల్లించడమే అత్యంత కీలకం. లేదంటే మీకే నష్టం. ఎందుకంటే, చెక్కు బౌన్సులు, సకాలంలో ఈఎంఐ చెల్లించలేకపోవడం, పెనాల్టీ చెల్లింపులు, ఆలస్యపు చెల్లింపులు.. ఇలాంటివన్నీ మీ క్రెడిట్ స్కోరును, క్రెడిట్ హిస్టరీని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భవిష్యత్తులో తిరిగి మీరు రుణం పొందడం కష్టమవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న రుణం తాలూకు ఈఎంఐ మీ ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోవడం మంచిది.

English summary

ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్.. లాభమా? నష్టమా? | Taking Instant Online Personal Loans Safe or not?

Taking an online instant loan now made easy. Just check your eligibility within 2 minutes with few basic details like PAN, current address and monthly income.
Story first published: Thursday, September 19, 2019, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X