For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక మందగమనం: లాభాల కోసం ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి

|

ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంగా పలు స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా పడిపోయింది. ఎన్నో కంపెనీలు ప్రతికూల రాబడితో ఉన్నాయి. డొమెస్టిక్ ఆర్థిక వృద్ధి దృక్ఫథం సన్నగిల్లడం, వినియోగం మందగించడం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గడం, బలహీన కార్పోరేట్ లాభాలు, కొత్త ట్యాక్స్ సర్‌ఛార్జ్ వంటివాటికి తోడు ప్రపంచ ఆర్థిక మందగమనం మార్కెట్ల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. NBFC రంగం కూడా ఇబ్బంది పడుతోంది. బ్యాంకులు ఎన్పీయే ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఆటో, రియల్ సెక్టార్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఆందోళన ఉంటుంది.

<strong>ATM కార్డు తిరిగిచ్చే టైం! SBI కస్టమర్స్ తెలుసుకోవాలి</strong>ATM కార్డు తిరిగిచ్చే టైం! SBI కస్టమర్స్ తెలుసుకోవాలి

ఈ సూచనలు పాటిస్తే బెట్టర్

ఈ సూచనలు పాటిస్తే బెట్టర్

డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్‌లలో ఇన్వెస్ట్ చేసేవి ఏవి అనే విషయాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే మార్కెట్ నిపుణులు ఈ స్టాక్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వారి సలహాలు, సూచనల మేరకు పెట్టుబడులు పెడితే బాగుండవచ్చు. రాబోయే రోజుల్లో బలమైన స్టాక్స్‌ను గుర్తించడానికి నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వారికి వ్యాపార దృక్పథంతో పాటు ఆయా సంస్థల బలాలు, బలహీనతలు కూడా తెలిసి ఉంటాయి.

స్టాక్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ...

స్టాక్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ...

FPIలపై సర్‌చార్జ్ పెద్ద పెద్ద కంపెనీలను, ఎక్కువగా లాభాల్లో కొనసాగే స్టాక్స్‌ను కూడా ప్రభావితం చేశాయి. విక్రయాలు పెరగడంతో ప్రైస్ ఎర్నింగ్స్‌ను తగ్గించాయి. అదే సమయంలో భవిష్యత్తును ఊహించిన కొందరు ఇన్వెస్టర్లకు తక్కువ ధరలకే మంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేందుకు మార్గం ఏర్పడింది. ఓ వైపు పలు స్టాక్స్ నష్టాల పాలవుతున్న కొంతమంది దీర్ఘకాలిక ఆలోచనతో కొనుగోలు చేసినవారు లేకపోలేదు.

రాబడి అవకాశాలు...

రాబడి అవకాశాలు...

ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మంచి రాబడి ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతూ కొన్ని స్టాక్స్‌ను సూచిస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవడం మాత్రం మంచిది. రిటర్న్ ఆన్ ఈక్విటీ (%) (RoE), రిటర్న్ ఆన్ అసెట్స్ (%) (RoA), ప్రైస్ ఎర్నింగ్స్ (PE), మల్టిబుల్ అండ్ డివిడెండ్ ఈల్డ్ (%) వంటి ఆధారంగా గుర్తించవచ్చునని చెబుతున్నారు.

ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ

ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ

ఎన్ఎండీసీ... మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ. ఇది ఖనిజాల అన్వేషణ చేస్తుంది. ఆకర్షణీయమైన డివిడెండ్ దిగుబటి, మెరుగైన కార్యాచరణ పని తీరు, ధరల శక్తి, తక్కువ స్థిర ఖర్చులు వంటి అంశాల కారణంగా విశ్లేషకులు ఈ స్టాక్స్ పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇనుము, ఐరన్ ఓర్ ధరలు పెరుగుతాయి. జూన్ 2019లో దాని ఏకీకృత సర్దుబాటు ఈపీఎస్ బ్లూమ్‌బర్గ్ అంచనాల కంటే 9.3 శాతం ఎక్కువ.

భారత్ ఎలక్ట్రానిక్స్

భారత్ ఎలక్ట్రానిక్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వరంగ సంస్థ. నవరత్న హోదా కలిగి ఉంది. ఇది డిఫెన్స్ సెక్టార్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సిస్టంలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. నాలుగు సంవత్సరాలకు పైగా బలమైన రెవెన్యూ విజిబిలిటీ కలిగి ఉంది. తక్కువ మూలధన వ్యయం, బెట్టర్ వర్కింగ్ కాపిటల్ మేనేజ్‌మెంట్ నేపథ్యంలో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ప్రభుత్వం రక్షణ రంగ పరంగా ఏ చర్యలు తీసుకున్నా తొలి లబ్ధిదారు ఇదే.

ఆపార్ ఇండస్ట్రీస్

ఆపార్ ఇండస్ట్రీస్

ఆపార్.. ఆయిల్స్, పవర్ కండక్టర్స్, కేబుల్స్, వైర్స్ మానుఫ్యాక్చరింగ్‌కు చెందినది. ఓ రీసెర్చ్ ప్రకారం ఈ సంస్థ తన అన్ని వ్యాపార విభాగాలలో, అధిక స్కేలబులిటీ సామర్థ్యాన్ని, మార్కెట్ లీడర్‌షిప్‌ను కలిగి ఉంది. రైల్వే, రక్షణ రంగాల నుంచి డిమాండ్ పెరుగుతున్న కారణంగా కేబుల్ విభాగం దృక్ఫథం ఆశాజనకంగా ఉంటుంది. 2018-19 నుంచి 2020-21 మధ్యలో ఈ కంపెనీ CAGR 30% శాతం ఉంటుందని బ్రోకరేజ్ హౌస్ అంచనా. జూన్ 2019లో దాని ఏకీకృత సర్దుబాటు ఈపీఎస్ బ్లూమ్‌బర్గ్ అంచనాల కంటే 23.9% శాతం ఎక్కువ.

 మహానగర్ గ్యాస్

మహానగర్ గ్యాస్

ముంబై, థానే నగరాలతో పాటు దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలకు మహానగర్ గ్యాస్ సీఎన్జీ, పీఎన్జీని సరఫరా చేస్తుంది. స్థిరమైన వ్యాల్యూమ్స్, మెరుగైన మార్జిన్లు, నెట్ వర్క్ విస్తరణపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వం కూడా క్లీనర్ ఫ్యూయల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో ఇది గణనీయంగా వృద్ధి చెందుతుందని అంచనా. హెచ్‌డీఎప్‌సీ సెక్యూరిటీస్ ప్రకారం కంపెనీ ధరల కొనుగోలు శక్తిని కొనసాగిస్తుంది. సిటీ గ్యాస్ బిజినెస్‌లో నియంత్రణ ప్రతికూలతలు ఉండే అవకాశం లేదు. జూన్ 2019లో దాని ఏకీకృత సర్దుబాటు ఈపీఎస్ బ్లూమ్‌బర్గ్ అంచనాల కంటే 18.5% శాతం ఎక్కువ.

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ

ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎల్ఎన్జీ రిసీవింగ్, రిగాసిఫికేషన్ టెర్నినల్స్‌ను నిర్వహిస్తోంది. నేచరల్ గ్యాస్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్‌లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందని అంచనా. ఈ కంపెనీ రెవెన్యూ, ఎబిట్డా 2018-19 నుంచి 2020-21 మధ్య వరుసగా 16.5 శాతం, 14 శాతం పెరుగుతుందని అంచనా. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

English summary

ఆర్థిక మందగమనం: లాభాల కోసం ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి | Reasonably valued stocks that are good bets during slowdown

Troubles in the NBFC space and high NPA of banks have spoiled the credit flow to the auto and real estate sectors, further dampening sentiments. So where should you invest now?
Story first published: Monday, August 26, 2019, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X