For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఇంధన క్రెడిట్ కార్డులతో డబ్బు ఆదా చేసుకోవచ్చు

By Jai
|

ఈ రోజుల్లో బైక్ లేదా కారు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకే రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇంధనాల వినియోగం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరల్లో ప్రతి రోజు కూడా మార్పు కనిపిస్తోంది. అయితే ఇంధనాల ధరలు అధికమవుతుండటం వల్ల బడ్జెట్ తారుమారు అవుతోంది.

ఈ నేపథ్యంలో ఇంధన వినియోగం తగ్గించుకోవడం లేదా ధరల భారాన్ని తగ్గించుకోవడమే మార్గంగా కనిపిస్తోంది. వాహనాన్ని తప్పనిసరిగా వినియోగించాల్సి వచ్చినప్పుడు బిల్లును తగ్గించుకునే దారి చూసుకోవాలి. ప్రస్తుతం ఇంధన బిల్లులు తగ్గించుకోవడానికి దోహదపడే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులున్నాయి. ఈ కార్డుల ద్వారా ఇంధనం కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. వాటి గురించి తెలుసుకుందామా...

చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ఇంధన విక్రయ కంపెనీలతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డు కంపెనీలకు కొత్త కస్టమర్లు దొరుకుతారు. ఇంధన విక్రయ కంపెనీల అమ్మకాలు పెరుగుతాయి. కస్టమర్లకు డిస్కౌంట్లు లభిస్తాయి. ఎలాగూ ఇంధనంకొనుగోలు చేయక తప్పదు.కాబట్టి ఈ కార్డులను వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఇంధన క్రెడిట్ కార్డులను పరిశీలించండి...

త్వరలో ATM ఛార్జీలు తగ్గే ఛాన్స్, కమిటీ వేయనున్న RBIత్వరలో ATM ఛార్జీలు తగ్గే ఛాన్స్, కమిటీ వేయనున్న RBI

ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం క్రెడిట్ కార్డు

ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం క్రెడిట్ కార్డు

- జూన్ 30 వరకు ఈ కార్డు తీసుకుంటే 30 రోజుల్లోపు చేసే మొదటి ఖర్చుపై 250 టర్బో పాయింట్లను ఆఫర్ చేస్తున్నారు. లావాదేవీ జరిపినప్పటి నుంచి 60 రోజుల్లో ఈ బౌన్స్ పాయింట్స్ కార్డు ఖాతాలో చేరిపోతాయి. ఇతర కొనుగోళ్ళ కోసంకూడా ఈ కార్డును వినియోగించుకోవచ్చు.

- ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్ లెట్లలో రూ. 150 విలువైన ఇంధనం కొనుగోలు చేస్తే 4 టర్బో పాయింట్లు లభిస్తాయి.

- నిత్యావసర సరుకులు, షాపింగ్, డైనింగ్, ఇతర చెల్లింపులపైనా కూడా టర్బో పాయింట్లు లభిస్తాయి.

- ఇంధన కొనుగోలుపై విధించే సర్ చార్జీకి మినహాయింపు ఉంటుంది.

- ఏడాదిలో రూ. 30,000 ఖర్చు చేస్తే వార్షిక ఫీజును ఎత్తివేస్తున్నారు.

ఐ సి ఐ సి ఐ బ్యాంక్ హెచ్ పీ సి ఎల్ కొరల్ క్రెడిట్ కార్డు

ఐ సి ఐ సి ఐ బ్యాంక్ హెచ్ పీ సి ఎల్ కొరల్ క్రెడిట్ కార్డు

- 2.5 శాతం క్యాష్ బ్యాక్

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత

- రూ. 100 ఖర్చు చేస్తే 2 పే బ్యాక్ రివార్డ్ పాయింట్లు

- బుక్ మై షో లో నెలలో 2 సినిమా టిక్కెట్లపై రూ. 100 డిస్కౌంట్

ఐ సి ఐ సి ఐ బ్యాంకు హెచ్ పీ సి ఎల్ కొరల్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డ్

- - 2.5 శాతం క్యాష్ బ్యాక్

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లోరూ. 100 ఖర్చు చేస్తే 6 పే బ్యాక్ పాయింట్లు ఐ సి ఐ సి ఐ బ్యాంక్ హెచ్ పీ సి ఎల్ కొరల్ క్రెడిట్ కార్డు

- 2.5 శాతం క్యాష్ బ్యాక్

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత

- రూ. 100 ఖర్చు చేస్తే 2 పే బ్యాక్ రివార్డ్ పాయింట్లు

- బుక్ మై షో లో నెలలో 2 సినిమా టిక్కెట్లపై రూ. 100 డిస్కౌంట్

ఐ సి ఐ సి ఐ బ్యాంకు హెచ్ పీ సి ఎల్ కొరల్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డ్

- - 2.5 శాతం క్యాష్ బ్యాక్

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత

- హెచ్ పీ సి ఎల్ పంపుల్లోరూ. 100 ఖర్చు చేస్తే 6 పే బ్యాక్ పాయింట్లు

బీపీసీఎల్ ఎస్ బీ ఐ కార్డు

బీపీసీఎల్ ఎస్ బీ ఐ కార్డు

- జాయినింగ్ ఫీజు చెల్లింపు తర్వాత రూ. 500 విలువైన 2,000 అక్టీవేషన్ బోనస్ రివార్డ్ పాయింట్లు

- వీటిని బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చు.

- రూ . 4,000 వరకు చేసే ప్రతి లావాదేవిపై 3.25 +1 శాతం ఇంధన సెర్ ఛార్జ్ ఎత్తివేత

- ఈ కార్డుతో చేసే ఇతర చెల్లింపులపై ఆకర్షణీయమైన ఆఫర్లు

మరికొన్ని కంపెనీలు కూడా ఇంధన క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఈ కార్డులను తీసుకునే ముందు ఆయా కంపనీలు ఇస్తున్న ఆఫర్లను ఒకసారి తెలుసుకోవడం మంచిది.

English summary

ఈ ఇంధన క్రెడిట్ కార్డులతో డబ్బు ఆదా చేసుకోవచ్చు | You can save with these fuel credit cards

You can save with these fuel credit cards. To gain maximum benefit from the best fuel credit cards you should consider following attributes.
Story first published: Thursday, June 6, 2019, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X