For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI రెపో రేటు ఎఫెక్ట్: డిపాజిట్లపై ICICI, యాక్సిస్, కొటక్ వడ్డీ రేటు కోత

|

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. 25 బేసిక్ పాయింట్స్ తగ్గించడంతో రెపో రేటు 5.75కు తగ్గింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు తమ కస్టమర్ల డిపాజిట్ల పైన వడ్డీ రేటును తగ్గించాయి. దీంతో వడ్డీ రేటు స్వల్పంగా తగ్గుతున్నాయి.

బడ్జెట్ 2019: ఆదాయపన్నుపై రివిజన్ ఉండేనా? సామాన్యుల ప్రాధాన్యతలు ఇవే..బడ్జెట్ 2019: ఆదాయపన్నుపై రివిజన్ ఉండేనా? సామాన్యుల ప్రాధాన్యతలు ఇవే..

ఐసీఐసీఐ వడ్డీ రేట్లు

ఐసీఐసీఐ వడ్డీ రేట్లు

ICICI బ్యాంకు వడ్డీ రేటును 10 బేసిక్ పాయింట్ల నుంచి 25 బేసిక్ పాయింట్ల మధ్య తగ్గించింది. రూ.2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలకు ఇది వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఇక నుంచి 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితిపై 6 శాతం వడ్డీ ఇస్తుంది. ఇదివరకు ఇది 6.25 శాతంగా ఉంది. 390 రోజుల నుండి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి, 2 నుంచి 3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది.

యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు

యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు

యాక్సిస్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిపాజిట్ల పైన రూ.2 కోట్ల వరకు ఒక సంవత్సరం మెచ్యూరిటీపై డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు బ్యాంకు 1 టెన్యూర్ పైన బ్యాంక్ 7.10 శాతం ఇచ్చింది. సవరణల తర్వాత 7.3 శాతం ఇవ్వనుంది.

కొటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు

కొటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు

కొటక్ మహీంద్రా బ్యాంక్ టెన్యూర్ కాలాన్ని 20 నెలల నుంచి 18 నెలలకు తగ్గించింది. 18 నెలల నుంచి 2 సంవత్సరాలలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 7.10 శాతంగా నిర్ణయించింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్స్ పైన 10 బేసిక్ పాయింట్స్ తగ్గించి 7 శాతం చెల్లిస్తోంది.

English summary

RBI రెపో రేటు ఎఫెక్ట్: డిపాజిట్లపై ICICI, యాక్సిస్, కొటక్ వడ్డీ రేటు కోత | ICICI, Axis, Kotak Mahindra tweak FD rates after RBI repo rate cut

In the wake of the RBI's monetary policy committee (MPC) voting to reduce the repo rate by 25 basis points (bps) to 5.75 per cent, some of the country's leading private sector lenders have also cut their interest rates on deposits by varying percentages.
Story first published: Thursday, June 20, 2019, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X