For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు గవర్నమెంట్ ఉద్యోగి అయితే.. హోమ్‌లోన్స్ చాలా చవక.. తెలుసుకోండి..

|

హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్‌ను ఆయా బ్యాంకులు వివిధ రకాల వడ్డీలకు ఇస్తుంటాయి. ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు... ఇలా విభాగాల వారిగా కూడా వడ్డీలు మారుతుంటాయి. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు హోమ్‌లోన్ విషయంలోను ప్రత్యేకతలు ఉంటాయి. వీరితో పాటు డిఫెన్స్ ఉద్యోగులకు కూడా ఆఫర్లు ఇస్తాయి. సామాన్య ఉద్యోగులతో పోలిస్తే వీరికి మంచి ఆఫర్లు ఉంటాయి. హోమ్‌లోన్స్‌లో వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడమే కాదు జీరో లేదా తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. తక్కువ ఈఎంఐ ఉంటుంది. ప్రీపేమెంట్ పైన ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ, పీఎన్‌బీలు ఇచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం....

SBI Privilege Home loan-ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్

SBI Privilege Home loan-ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్

ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లోన్ ఇస్తారు. ఉద్యోగుల వేతనం, రీపేమెంట్ కెపాసిటీ, వయస్సు, ఆస్తులు, బాధ్యతలు, కొనుగోలు చేయనున్న ఇల్లు లేదా ప్లాట్ ఖరీదు.. ఆధారంగా లోన్ ఎంత అనేది ఉంటుంది.

ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ ఫీచర్స్

ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ ఫీచర్స్

- తక్కువ వడ్డీ రేటు.

- జీరో ప్రాసెసింగ్ ఫీజు

- హిడెన్ ఛార్జీలు ఉండవు.

- ప్రీపేమెంట్ పెనాల్టీ ఉండదు

- డెయిలీ రెడ్యూస్ అయ్యే బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ ఉంటుంది.

- 30 ఏళ్ల వరకు రీపేమెంట్

- మహిళలకు వడ్డీ కన్సెషన్ (రాయితీ)

- ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ.

ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ అర్హతలు

ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ అర్హతలు

- ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి.

- కనీస వయస్సు 18 ఏళ్లు.

- గరిష్ట వయస్సు 75 ఏళ్లు.

- లోన్ కాలపరిమితి - 30 ఏళ్లు.

- మీరు తీసుకునే హోమ్ లోన్ మొత్తం పైన వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 9.25 శాతం వరకు ఆఫర్ చేస్తున్నారు. మహిళలకు అయితే 8.55 శాతం నుంచి 9.15 శాతం మధ్య ఉంది.

SBI Shaurya Home loan - ఎస్బీఐ శౌర్య హోంలోన్

SBI Shaurya Home loan - ఎస్బీఐ శౌర్య హోంలోన్

ఆర్మీ, డిఫెన్స్ ఉద్యోగులకు ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రెండు రకాల వడ్డీ రేట్లు ఉన్నాయి. చెకాఫ్ లేదా వితౌట్ చెకాఫ్ ఫెసిలిటీతో ఉంటాయి. వడ్డీ రేట్లలో తేడా ఉంటుంది. అయితే మహిళల వడ్డీ రేట్లు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. వితౌట్ చెకాఫ్ ఫెసిలిటీ పైన హోమ్ లోన్ 5 బేసిక్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చెకాఫ్ ఫెసిలిటీ ప్రయోజనకరం.

ఇక, హిడెన్ ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు.

జీరో ప్రాసెసింగ్ ఫీజు.

వడ్డీ రేటు డెయిలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంది.

30 ఏళ్ల కాల పరిమితి.

వడ్డీ రేటు మీ కాలపరిమితి, ప్రిన్సిపుల్ అమౌంట్ పైన ఆధారపడి ఉంటుంది.

PNB ప్రైడ్ హౌసింగ్ లోన్

PNB ప్రైడ్ హౌసింగ్ లోన్

పీఎన్‌పీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు PNB ప్రైడ్ హౌసింగ్ హోమ్ లోన్ ఇస్తోంది. రూ.75 లక్షల వరకు ఎంసీఎల్ఆర్ ప్లస్ 0.20 శాతం. రూ.75 లక్షలకు మించితే ఎంసీఎల్ఆర్ ప్లస్ 0.25 శాతం. పీఎన్‌బీఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది.

ఇల్లు లేదా ప్లాట్ లేదా మరమ్మతులు లేదా పునర్నిర్మాణం లేదా మార్పులు అయితే రీపేమెంట్ కాలపరిమితి గరిష్టంగా 15 ఏళ్లు. ఇతర లోన్ అయితే 30 ఏళ్ళ కాలపరిమితి. ఒకవేళ మారటోరియం ఉంటే.. అది కూడా కలుపుకొని.

భార్యా లేదా పిల్లలు సంపాదిస్తే వారి సంపాదన కూడా కలపవచ్చు.

English summary

మీరు గవర్నమెంట్ ఉద్యోగి అయితే.. హోమ్‌లోన్స్ చాలా చవక.. తెలుసుకోండి.. | Cheap home loans for government employees: Here is a list of schemes with zero processing fees, low EMIs

Many banks have been introducing various benefits in the form of home loans especially to the state and central government employees including defence personnel. Bankers generally offer attractive interest rates on home loans to government employees compared to general category.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X