For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో ఈటీఎఫ్... పెట్టుబడులకు మరో అవకాశం

By Jai
|

ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల షేర్లతో కూడిన ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్ ) ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకు సంబందించిన సాధ్యాసాధ్యాలను పరిశిలించేందుకు త్వరలోనే ఒక అడ్వైసర్ ను నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ఫ్రైజెస్ షేర్లతో కూడిన ఈటీఎఫ్, భారత్ ఈటీఎఫ్ ను అందుబాటులోకి తెచ్చింది. వీటికి ఇన్వెస్టర్లనుంచి మంచి ఆదరణ లభించింది.

ఈ నేపథ్యంలోనే బ్యాంక్ షేర్లతో ఈటీఎఫ్ తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందు భారత్ -22 ఈటీఎఫ్ ద్వారా రూ.,32,900 కోట్లు, సీపీ ఎస్ ఈ ఈటీఎఫ్ ద్వారా రూ. 38,000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అస్యూరెన్సు లతో పాటు 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్స్చేంజి లలో లిస్ట్ అయ్యాయి.

 Investment with public sector banks

- భారత్22 ఈటీఎఫ్ ను 2017-18 సంవత్సరంలో ప్రారంభించారు. ఇందులో 16 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ఫ్రైజెస్ కంపెనీలు, మూడు బ్యాంకులు, ప్రభుత్వం వాటా కలిగిన మూడు ప్రయివేట్ రంగ కంపెనీలు ఉన్నాయి. - సి పీ ఎఫ్ ఎఫ్ -ఈటీఎఫ్ లో 11 కంపెనీలున్నాయి. అవి.. ఓఎంజిఎసీ, కోలిండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ , ఆర్ ఈ సి, భారత్ ఎలక్రోనిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్టీపీసీ , ఎంబి సి సి , ఎం ఎల్ సి, ఎస్ జె వీ ఎన్ ఉన్నాయి.

ప్రయోజనాలు

- సి పీ ఎస్ ఎఫ్ -ఈటీఎఫ్ ల ద్వారా మహారత్న, నవరత్న పీఎస్ యూ కంపెనీల్లో పెట్టుబడి పెట్టె అవకాశం లభిస్తుంది. పీ ఎస్ యూ కంపెనీలు ఆర్థికంగా బలోపేతంగా ఉంటాయి కాబట్టి ఈ కంపెనీల్లో పెట్టుబడి మంచి నిర్ణయమే అవుతుందని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ కంపెనీల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి పెట్టుబడులపై మంచి రిటర్న్ లను ఆశించవచ్చు.
- ఉదాహరణకు నిఫ్టీ సీపీ ఎస్ ఈ ఇండెక్స్ ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 5.52 శాతం డివిడెండ్ యిల్డ్ ను అందిస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ మాత్రం 1.25 శాతం యిల్డ్ ను ఇచ్చింది.

English summary

ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో ఈటీఎఫ్... పెట్టుబడులకు మరో అవకాశం | Investment with public sector banks

The following stocks are worth considering for investing in now. Public sector bank stocks have often been shunned by fund managers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X