For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్ల టెన్యూర్ హోంలోన్: వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ఎలిజిబులిటీ తెలుసుకోండి, ప్రయోజనాలివీ

|

శాలరైడ్ ఉద్యోగులు పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, హోమ్ లోన్లు తీసుకుంటుంటారు. మొదటి రెండు లోన్లు దాదాపు మూడు నుంచి అయిదేళ్ల లోపు పూర్తవుతాయి. కానీ హోం లోన్లు లాంగ్ టర్మ్ ఉంటాయి. కాబట్టి మొదటి రెండింటి కంటే హోంలోన్ విషయంలో అన్నింటిని చూసుకున్న తర్వాతే తీసుకోవడం మంచింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఇండివిడ్యువల్స్‌కు కాంపిటేటివ్ రేట్స్‌తో హోంలోన్లు ఆఫర్ చేస్తోంది. BOBలో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విలీనమయ్యాయి. దీంతో ఈ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది.

BOB హోమ్ లోన్లు ఇండియన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్‌లకు ఇస్తుంది. వయస్సు 21 ఏళ్లు ఉండాలి. అప్లికెంట్ సిబిల్ స్కోర్‌ ఆధారంగా హోంలోన్ వడ్డీ రేటును అందించే కొన్ని బ్యాంకుల్లో BOB ఒకటి. అప్లికెంట్ వేతనం ఆధారంగా హోమ్ లోన్ ఇస్తారు. వడ్డీరేటు ఏడాది ఎంసీఎల్ఆర్‌కు లింక్ చేసి ఉంటుంది. యాన్యువల్ బేస్ ఆధారంగా రీషెడ్యూల్ చేస్తారు. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ 8.65 శాతంగా ఉంది. BOB వడ్డీ రేట్లు 8.65 నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి.

SBI ఎడ్యుకేషన్ లోన్: ఈ డాక్యుమెంట్స్ అవసరంSBI ఎడ్యుకేషన్ లోన్: ఈ డాక్యుమెంట్స్ అవసరం

హోం లోన్ కాలపరిమితి, మారటోరియం

హోం లోన్ కాలపరిమితి, మారటోరియం

హోమ్ లోన్ కాలపరిమితి (టెన్యూర్) ఆ లోన్ మొత్తం, లోన్ తీసుకునే వ్యక్తి వేతనం పైన ఆధారపడి ఉంటుంది. గరిష్ట కాలపరిమితి 30 ఏళ్లు. మారటోరియం పీరియడ్ కూడా ఉంటుంది. లోన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత గరిష్టంగా 36 నెలలు ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ ఇళ్లకు, 7 అంతస్తుల ఫ్లోర్ నిర్మాణాలకు 18 నెలల మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఫ్లోర్‌కు 6 నెలల మారటోరియం. గరిష్ట మారటోరియం 36 నెలలు.

హోంలోన్ అమౌంట్ ఎక్కువ రావాలంటే..

హోంలోన్ అమౌంట్ ఎక్కువ రావాలంటే..

తమ కుటుంబ సభ్యులను కో-అప్లికెంట్‌గా పేర్కొనడం ద్వారా ఎవరైనా ఎక్కువ లోన్ ఎలిజిబులిటీ కూడా పొందవచ్చు. ఎక్కువ లోన్ ఎలిజిబులిటీ కోసం క్లోజ్ రిలేటివ్‌ను కో-అప్లికెంట్‌గా పేర్కొనవచ్చు. ఒకవేళ క్లోజ్ రిలేటివ్ కాకుండా ఇతరులు ఎవరైనా కో-అప్లికెంట్‌గా కావాలంటే ప్రాపర్టీ ఓనర్‌గా జాయింట్‌లో ఉండాలి. క్లోజ్ రిలేటివ్స్‌లో కొడుకు భార్య, కూతురు భర్త, సోదరుడు, సోదరి, సోదరుడి భార్య, సోదరి పిల్లలు, సోదరుడి పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు.

BOB హోమ్ లోన్‌తో ఈ ప్రయోజనాలు

BOB హోమ్ లోన్‌తో ఈ ప్రయోజనాలు

BOB హోమ్ లోన్ తీసుకుంటే కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రీ క్రెడిట్ కార్డు, కారు లోన్ పైన 0.25 శాతం కన్‌సెషన్ పొందవచ్చు. BOB ప్రతి హోమ్ లోన్ పైన ఫ్రీ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ పాలసీని ఆఫర్ చేస్తుంది. హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మృతి చెందితే ఫ్యామిలీకి ఇన్సురెన్స్ పాలసీ కవర్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ అమౌంట్ ఆధారంగా మాత్రమే ఫ్యామిలీ చెల్లించవచ్చు. హోమ్ లోన్ తీసుకున్న వారు ఈఎంఐతో పాటు ప్రీమియం చెల్లించవచ్చు.

అన్ని ఛార్జీలు ఏకీకృతం

అన్ని ఛార్జీలు ఏకీకృతం

BOB బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం హోమ్ లోన్లు, టాపప్ లోన్ల పైన ప్రాసెసింగ్ ఛార్జీలకు మినహాయింపు ఉంది. అన్ని కలిపి రూ.7,500 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్/వెట్టింగ్ ఛార్జీలు, ప్రీ-శాంక్షన్ ఇన్‌స్పెక్షన్ (కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్-సీపీవీ) చార్జీలు, వన్ టైమ్ పోస్ట్ ఇన్‌స్పెక్షన్ చార్జీలు, లీగల్ ఆప్షన్ కోసం అడ్వోకేట్ ఛార్జీలు, వ్యాల్యుయేషన్ కోసం వ్యాల్యూర్ ఛార్జీలు, బ్యూరో రిపోర్ట్ ఛార్జీలు, CERSAI ఛార్జీలు, ఐటీఆర్ వెరిఫికేషన్ ఛార్జీలు.. అన్నీ కలిపి ఉంటాయి.

జీఎంఐ వివరాలు ఇలా..

జీఎంఐ వివరాలు ఇలా..

హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి నెలసరి స్థూల ఆదాయం (GMI) ఆధారంగా వారి రీపేమెంట్ కెపాసిటీని అంచనా వేస్తారు. ఇతర ఈఎంఐలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం ఇలా ఉండాలి.

- వేతనజీవులకు:

రూ.20,000 కంటే తక్కువ GMI - 50 శాతం

రూ.20,000 నుంచి రూ.50,000 మధ్య GMI - 60 శాతం.

రూ.50,000 నుంచి రూ.2,00,000 వరకు GMI - 65 శాతం

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు GMI - 70 శాతం

రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ GMI - 75 శాతం.

- ఇతరులకు:

యావరేజ్ GMI (గత రెండేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు) - రూ.6 లక్షల వరకు - 70 శాతం

యావరేజ్ GMI (గత రెండేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు) - రూ.6 లక్షల కంటే ఎక్కువ - 80 శాతం

రూ.30 లక్షల హోమ్ లోన్‌కు మార్జిన్ 10 శాతం. ఎల్టీవీ రేషియో 90 శాతం.

రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు మార్జిన్ 20 శాతం. ఎల్టీవీ రేషియో 80 శాతం.

రూ.75 లక్షల కంటే ఎక్కువ కలిగిన హోమ్ లోన్‌కు 25 శాతం మార్జిన్. ఎల్టీవీ రేషియో 75 శాతం.

English summary

30 ఏళ్ల టెన్యూర్ హోంలోన్: వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ఎలిజిబులిటీ తెలుసుకోండి, ప్రయోజనాలివీ | Bank of Baroda Home Loans with 30 year tenure: Check interest rate, processing fees and eligibility

For someone looking to get a home loan, there are a plethora of options to choose from. Bank of Baroda (BOB) is one such public sector bank which offers home loans at competitive rates to individuals.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X