న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ పరిశ్రమకు, అక్కడి నుంచి రుణాలు తీసుకునే వారికి చేదువార్త. నాన్ బ్యాకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చే అప్పులు ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ తీవ్ర నిధుల కొరతతో అస్తవ్యస్తమవుతోంది. మరోవైపు, వీటికి రుణాల రూపంలో అందే సొమ్ములు కూడా ప్రియం కానున్నాయి. దీంతో ఈ సంస్థలు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశముంది.
సాధారణంగా సూక్ష్మ రుణ మార్కెట్లో ఎన్‌బీఎఫ్‌సీల ఆధిపత్యం ఎక్కువ. దీంతో కొన్ని పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ రుణాలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాలు ప్రియం అయితే ఈ వర్గాల వ్యాపారాలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఆర్బీఐ పైన ఒత్తిడి పెంచాయి. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఎన్‌బీఎఫ్‌సీలపై ఒత్తిడి పెంచాలని భావించడంలేదు.

గత ఏడాది ఐఎల్ఎఫ్‌ఎస్ సంస్థ దివాళ అంచులకు చేరింది. దీంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ ఏడాది వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచింది. కానీ సమస్యలు తీరలేదు. ఎస్సెల్ గ్రూప్ సమస్యల్లో చిక్కుకోవడం, దేవాన్ హౌసింగ్‌పై ఆరోపణలు వంటివి ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై ప్రభావం చూపాయి. ఈ పరిశ్రమకు నిధులు అందటం కష్టమైంది. ఫలితంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ పరిశ్రమలో రుణాలు 12 నుంచి 24 శాతం ఉంటాయి. కొన్ని కంపెనీల్లో 26 శాతం వరకు కూడా ఉంటాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications