For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.

కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసుకునేందుకు జీవిత బీమా పాలసీ తీసుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతుంటాయి.

By bharath
|

కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసుకునేందుకు జీవిత బీమా పాలసీ తీసుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతుంటాయి. ఇలాంటి సమయంలో జీవిత బీమా లక్ష్యమే దెబ్బతింటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్‌లను తిరస్కరించేందుకు చట్టబద్ధమైన కారణాలు ఉంటాయి. ఈ చట్టబద్ధమైన కారణాలు ఏంటో తెలుసుకుంటే, క్లెయిమ్‌లు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్త పడే వీలుంటుంది.

ఫారంలో పూర్తి వివరాలు నింపాలి

ఫారంలో పూర్తి వివరాలు నింపాలి

చాలా మంది పాలసీదారులు తమ పాలసీ దరఖాస్తును సొంతంగా నింపకుండా బీమా ఏజెంట్లకే విదిలేస్తుంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బీమా ఏజెంట్లు సమాచారాన్ని దరఖాస్తుల్లో పూర్తిగా నింపకపోవచ్చు. అంతేకాదు పాలసీదారు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. ఈ సందర్భంలో దరఖాస్తులో కొంతమేరకు మాత్రమే సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాల ఆధారంగానే బీమా కంపెనీలు ఇన్సూరెన్స్‌ను జారీ చేస్తాయి. దరఖాస్తులో పూర్తి వివరాలు పొందుపరచకపోతే, వివరాలు సరిగ్గా ఇవ్వలేదని భావించి క్లెయిమును తిరస్కరించే అవకాశాలున్నాయి.

పాలసీ రెన్యువల్

పాలసీ రెన్యువల్

యాక్టివ్‌గా ఉన్న పాలసీల క్లెయిములను మాత్రమే బీమా సంస్థలు చెల్లిస్తాయి. అంతేకాదు ఇన్సూరెన్స్‌ ప్రీమియంను గడువులోగా కట్టేయాలి. లేకపోతే, ప్రీమియంలు చెల్లించకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందన్న కారణంతోనూ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.

ఏ సమాచారాన్ని కూడా దాచిపెట్టొద్దు

ఏ సమాచారాన్ని కూడా దాచిపెట్టొద్దు

పాలసీ దరఖాస్తులో పొందుపరిచే ప్రతి సమాచారం కీలకమే. దీని ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. మీ వయస్సు, వృత్తి, స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు, కుటుంబ ఆరోగ్య వివరాలు, ఇతరత్రా ఉన్న పాలసీల సమాచారం మొదలైనవన్నీ కూడా పొందుపరచాలి. లేదంటే క్లెయిము రిజెక్ట్ అవడానికి కూడా ఇవి కారణంగా మారొచ్చు.

నామినీ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి

నామినీ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి

సాధారణంగా పెళ్లి ముందు తీసుకునే పాలసీకి తల్లిదండ్రులనే నామినీలుగా దరఖాస్తుల్లో పేర్కొంటారు. అయితే పెళ్లి జరిగిన తర్వాత జీవిత భాగస్వామి పేరును కూడా చేర్చడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల తదుపరి చెల్లింపుల్లో సమస్యలు ఉండవు.

క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం

క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం

క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో ఆలస్యం చేయకూడదు. ఇది పలు సందేహాలకు దారి తీస్తుంది. సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో సహాయం చేసేందుకు ప్రత్యేక అధికారి సర్వీసులు అందిస్తుంటాయి. పాలసీదారు తాను తీసుకున్న పాలసీల గురించి, ఏజెంటు కాంటాక్టు నంబరు, జీవిత బీమా సంస్థ గురించి, క్లెయిముకు అవసరమైన పత్రాల గురించి నామినీలకు అన్ని వివరాలు తెలియజేయాలి.

Read more about: insurance policy
English summary

ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. | Why Do Insurance Claims Get Rejected?

There could be many instances and examples of claim rejection. Most of these can be bracketed in the following categories.
Story first published: Friday, February 15, 2019, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X