For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం మారుతున్నవారికి కచ్చితంగా పట్టించాల్సిన కొన్ని విషయాలు మీకోసం!

By girish
|

ఉద్యోగం మానేస్తున్నారా? మరో ఉద్యోగంలో చేరుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మీరు ఏ సంస్ధలో ఉద్యోగం కోసం చేరినా వేతనాలన్నీ బ్యాంకు ద్వారానే జమ అవుతున్నాయి. ఆయా సంస్ధల తమ ఉద్యోగులకు బ్యాంకులు ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఖాతాలనే అందిస్తున్నారు. ఇలా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ప్రారంభించాల్సి ఉంటుంది.

బ్యాంక్ అకౌంట్:

బ్యాంక్ అకౌంట్:

ఇక్కడే చాలా మంది తప్పు చేస్తున్నారు. పాత కంపెనీలో ఉన్న బ్యాంకు ఖాతాను రద్దు చేయకుండానే మరో బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తుంటారు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఆయా కంపెనీ ఇచ్చే శాలరీ అకౌంట్‌లో మూడు నెలల పాటు జీతం పడకపపోతే దాన్ని సేవింగ్స్ అకౌంట్‌గా బ్యాంకులు మార్చేస్తాయి.కొన్ని బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్‌లో నిల్వ రూ. 10 వేల నుంచి 25 వేల వరకూ ఉంటుంది. దీంతో మినిమం బ్యాలెన్స్‌ను ఉంచకపోతే రూ. 750 నుంచి రూ. 1,000 వరకూ రుసుము విధిస్తారు. కాబట్టి ఉద్యోగం మారితే, పాత ఖాతాను రద్దు చేసుకుంటే మంచింది.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్:

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్:

కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత కంపెనీకి చెందిన ప్రావిడెంట్ ఫండ్ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి పాత కంపెనీకి చెందిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం తీసుకుని ఖాతాను రద్దు చేసుకోవడం. రెండోది పాత కంపెనీ పీఎఫ్ ఖాతా రద్దు చేసుకోకుండా కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడం

పెద్ద మొత్తంలో ఆశించేవారు ఇలా చేయడం మంచిది:

పెద్ద మొత్తంలో ఆశించేవారు ఇలా చేయడం మంచిది:

రిటైర్మెంట్ తర్వాత పెద్దమొత్తంలో నగదు ఆశించే వారు ఈపీఎఫ్ నుంచి నగదు తీసుకుండా బదిలీ చేసుకోవడమే ఉత్తమం. దీని వల్ల మీ నగదు చక్రవడ్డీకి దూరం కాదు. దీంతో పాటు ట్యాక్స్ పరంగా కూడా కలిసి వస్తుంది. అయితే కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకోవడానికి కనీసం మూడు నెలలు సమయం పడుతుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్:

ఇన్‌కమ్ ట్యాక్స్:

సాధారణంగా అందరూ ఆర్ధిక సంవత్సరం మొదటి నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు గాను ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి పాత కంపెనీలో పని చేస్తున్నప్పుడు అకౌంట్స్ విభాగానికి సమర్పించిన పన్ను ఆదా పథకాలకు సంబంధించి వివరాలు ఒకసారి చూసుకోండి.

ఇన్సూరెన్స్:

ఇన్సూరెన్స్:

ఇన్సూరెన్స్ పాలసీలు నెలవారీ ప్రీమియం చెల్లిస్తుంటే, బీమా సంస్ధకు మీరు ఉద్యోగం మారిన విషయంతో పాటు కొత్త బ్యాంకు వివరాలను కూడా తెలియజేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీ పాలసీ చెల్లించే ప్రీమియానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Read more about: jobs
English summary

ఉద్యోగం మారుతున్నవారికి కచ్చితంగా పట్టించాల్సిన కొన్ని విషయాలు మీకోసం! | Things to Keep in Mind While You Change Job

Do you have a job? Get another job? But did you take these precautions? Or see it once. All the salaries currently available for a job are deposited by the bank.
Story first published: Friday, December 28, 2018, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X