పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మన ఇంటి కరెంట్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం 'నేచురల్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్ ఆర్డర్ 2026'ను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల కర్ణాటకలోని ఏకైక గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రంపై వేటు పడింది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

యలహంక ప్లాంట్‌లో ఆగిపోయిన విద్యుత్
బెంగళూరు నగర పరిధిలో ఉన్న 370 మెగావాట్ల సామర్థ్యం గల యలహంక గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు గ్యాస్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచే ఈ ప్లాంట్ పని చేయడం ఆగిపోయింది. కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPCL) నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ రాష్ట్ర అవసరాలకు ఎంతో కీలకం. అయితే కేంద్రం విడుదల చేసిన ప్రాధాన్యత జాబితాలో విద్యుత్ రంగానికి అత్యల్ప ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్లాంట్ కు అందాల్సిన గ్యాస్ నిలిచిపోయింది.
కేంద్రం కొత్త రూల్స్ ఏంటి?
ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగానికి మాత్రమే గ్యాస్ కేటాయించాలని నిర్ణయించింది. ఈ జాబితాలో వంట గ్యాస్ (PNG/LPG), రవాణా ఇంధనం (CNG), ఎరువుల కర్మాగారాలు , పారిశ్రామిక వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వీరందరికీ సరఫరా చేసిన తర్వాతే విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల బెంగళూరు (Bengaluru) లోని ఈ కీలక ప్లాంట్‌కు గ్యాస్ అందకుండా పోయింది.
సామాన్యులపై ప్రభావం ఎంత?
ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సుమారు 355 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిమాండ్‌ను థర్మల్, జలవిద్యుత్, సోలార్ , ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా భర్తీ చేస్తోంది. అయితే యలహంక ప్లాంట్ నిలిచిపోవడం వల్ల స్వల్ప స్థాయిలో అంతరాయాలు కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే, మున్ముందు వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. యుద్ధ మేఘాలు తొలగి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ టెన్షన్ తప్పేలా లేదు.
మొత్తంగా చూస్తే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మన స్థానిక మౌలిక సదుపాయాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో ఈ ఘటన నిరూపిస్తోంది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications