For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బిఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులలో మినిమం బ్యాలన్స్ షరతులు.

రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు వినియోగదారులు ప్రతి నెల కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిర్వహించాల్సిన అవసరం ఉంది.

By bharath
|

రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు వినియోగదారులు ప్రతి నెల కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిర్వహించాల్సిన అవసరం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు పట్టణ, మెట్రో, అర్బన్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ల ఖాతాలో నెలసరి సగటు బ్యాలెన్స్ అవసరాలను నిర్ణయించాయి. వారి పొదుపు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించని వినియోగదారుడు, బ్యాంకుకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది, ఇది బ్యాంక్ స్థాన వంటి అంశాలకు భిన్నంగా ఉంటుంది.

ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్లో కనీస సగటు బ్యాలెన్స్ వివరాలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ):SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ):SBI

మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న ఎస్బిఐ బ్రాంచీలలో సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాల నినియోగదారులు నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 3,000 రూపాయలు ఉండాలని దేశం లో అతిపెద్ద రుణదాత ఐన ఎస్బిఐ తన అధికార వెబ్ సైట్ sbi.co.in లో తెలిపింది.పాక్షిక పట్టణ మరియు గ్రామీణ శాఖలలో ఎస్బీఐ పొదుపు ఖాతాల వినియోగదారులు కనీస సగటు బ్యాలన్స్ రూ.2,000 మరియు రూ. 1,000 రూపాయలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

హెచ్డిఎఫ్సి బ్యాంక్:HDFC

హెచ్డిఎఫ్సి బ్యాంక్:HDFC

మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచీలలో నెలవారీ కనీస బ్యాలెన్స్ నిలువ రూ.10,000 రూపాయలు ఉండాలని తన వెబ్ సైట్ hdfcbank.com లో తెలిపింది. పాక్షిక పట్టణ శాఖలలో సాధారణ పొదుపు ఖాతాదారులు సగటు బ్యాలన్స్ ప్రతి నెల రూ.5,000 రూపాయలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.గ్రామీణ శాఖలలో, వినియోగదారులు సగటు త్రైమాసిక బ్యాలన్స్ (AQB) రూ. 2,500 లేదా స్థిర డిపాజిట్ రూ.10,000 నిలువ కనీసం ఒక సంవత్సరం మరియు ఒక రోజు కాల పరిమితి నరకు నిర్వహించాల్సి ఉంది.

ఐసిఐసిఐ బ్యాంక్: ICICI

ఐసిఐసిఐ బ్యాంక్: ICICI

మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచీలలో సాధారణ పొదుపు ఖాతాను కలిగి ఉన్న ఖాతాదారులు సగటు నెలవారీ బ్యాలన్స్ రూ. 10,000 రూపాయలు ఉండాలని, బ్యాంకు వెబ్సైట్ icicibank.com లో వెల్లడించింది. పాక్షిక పట్టణ, గ్రామీణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలసరి బ్యాలెన్స్ రూ. 5,000 ,రూ. 2,000 మరియు రూ.1,000 రూపాయలు నిర్వహించాలి.

English summary

ఎస్బిఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులలో మినిమం బ్యాలన్స్ షరతులు. | Minimum Balance Rules Of State Bank of India (SBI), HDFC Bank, ICICI Bank

Regular savings bank accounts require customers to maintain a certain minimum average balance (MAB) every month.
Story first published: Saturday, October 20, 2018, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X