For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిష్క్ర‌మిస్తున్నారా?. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

నేరుగా మూల‌ధ‌న మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డంతో పోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్లు అనేవి త‌క్కువ ఖ‌ర్చుతో పెట్టుబ‌డి పెట్టే విధానం. ఎందుకంటే బ్రోక‌రేజీ, స్వాధీనానికి సంబంధించిన ఫీజులు, ఇత‌ర రుసుములు త‌గ్గ‌

|

నేరుగా మూల‌ధ‌న మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డంతో పోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్లు అనేవి త‌క్కువ ఖ‌ర్చుతో పెట్టుబ‌డి పెట్టే విధానం. ఎందుకంటే బ్రోక‌రేజీ, స్వాధీనానికి సంబంధించిన ఫీజులు, ఇత‌ర రుసుములు త‌గ్గ‌డం వ‌ల్ల పెట్టుబ‌డిదారుల ఖ‌ర్చు త‌గ్గుతుంది. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఒక‌సారి పెట్టుబ‌డి పెట్టి మధ్య‌లో నిష్ర్ర్క‌మించ‌డం మాత్రం మంచిది కాదు. అది ఎందుకో తెలుసుకుందాం.

1. భారీ నిష్క్రమణ ఛార్జీలు:

1. భారీ నిష్క్రమణ ఛార్జీలు:

మెచ్యూరిటీ తేదీ కన్నా ముందే ఫండ్లను తిరిగి కొనేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అవకాశం ఇచ్చినా భారీ నిష్క్రమణ ఛార్జీల భరించక తప్పదు. ఇది ఒక్కోసారి 4నుంచి 5శాతం వరకు ఉంటుంది.

2. ట్రాక్‌ రికార్డు కొరత:

2. ట్రాక్‌ రికార్డు కొరత:

క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్లు న్యూ ఫండ్‌ ఆఫర్‌ సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నందుకు ఇలాంటి పథకాల పూర్వాపరాలు, వాటి గత పనితీరు పరిశీలించేందుకు అవకాశం లేదు.

* ఎలాంటి పథకం తీసుకోవాలనేది పెట్టుబడిదారు అవసరం, విచక్షణను బట్టి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నిర్ణీత గడువు వరకూ ఉంచుకోవాలనుకుంటే క్లోజ్‌ ఎండెడ్‌ పథకం మంచిది. అదే స్వల్పకాల అవసరాలకు, సులభంగా నగదుగా మార్చుకునే వెసులుబాటు కోరుకునేట్టయితే ఓపెన్‌ ఎండెడ్‌ పథకానికి ఓటేయడం సబబు.

3. మ్యూచువల్‌ ఫండ్‌పై వర్తించే ఛార్జీలు

3. మ్యూచువల్‌ ఫండ్‌పై వర్తించే ఛార్జీలు

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టభయాలు, రాబడి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వీటిపై మదుపర్లు ఎంత పెట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం.

యూనిట్ల కొనుగోళ్ల ఛార్జీలు లేదా కమీషన్‌ను ‘లోడ్‌' అని ఆర్థిక పరిభాషలో పిలుస్తారు.

4. ప్రారంభ ఛార్జీలు (ఎంట్రీ లోడ్‌):

4. ప్రారంభ ఛార్జీలు (ఎంట్రీ లోడ్‌):

పెట్టుబడి ప్రారంభించేటప్పుడు చెల్లించే ఛార్జీలను ఎంట్రీ లోడ్‌ అంటారు. ఆగస్టు 2009 నుంచి సెబీ అన్ని ఎంట్రీ లోడ్‌లు ప్ర‌స్తుతం అమ‌ల్లో లేవు.

5. నిష్క్రమణ ఛార్జీలు (ఎగ్జిట్‌ లోడ్‌):

5. నిష్క్రమణ ఛార్జీలు (ఎగ్జిట్‌ లోడ్‌):

పెట్టుబడిదారు పథకం నుంచి అనుకున్న సమయం కంటే ముందే నిష్క్రమిస్తే ఫండ్‌ సంస్థలు నిష్క్రమణ ఛార్జీలు వేస్తారు. చాలా లిక్విడ్‌ పథకాలు నిష్క్రమణ ఛార్జీలను వర్తింపజేయరు ఎందుకంటే వీటి ప్రధాన లక్షణం మదుపర్లకు అవసరమైనప్పుడు నగదును అందించడం. ఇతర పథకాల్లో నిష్క్రమణ ఛార్జీలు 1నుంచి 3శాతం దాకా ఉంటాయి. పథకంలో కొనసాగిన సమయంపై ఆధారపడుతుంది.

సెబీ నిర్దేశాల ప్రకారం నిష్క్రమణల ద్వారా తక్కువైన సొమ్ము మొత్తాన్ని ఫండ్‌లో తిరిగి క్రెడిట్‌ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఫండ్‌ సంస్థలదని తెలిపింది. ఇందుకు నష్టపోయిన సొమ్మును సమాంతరం చేసుకునేందుకు నిష్క్రమించే మదుపర్లపై ఛార్జీ వేస్తారు ( 20బేసిస్‌ పాయింట్లకు)

6. లావాదేవీల ఛార్జీలు:

6. లావాదేవీల ఛార్జీలు:

* పెట్టుబడిదారులు లావాదేవీ ఛార్జీగా రూ.100 చెల్లించాలి.

* రూ.10వేలు అంతకన్నా తక్కువ పెట్టుబడులకు ఛార్జీ లేదు.

* రూ.10వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రూ.150 ఫీజు కింద తీసుకోవచ్చు.

* సిప్‌ విధానంలో మదుపు చేసేటట్టయితే మొత్తం పథకం రూ.10వేలకు మించినట్టయితే రూ.100 రుసుమును నాలుగు దఫాలుగా వసూలు చేస్తారు.

7. ఇత‌ర రుసుములు

7. ఇత‌ర రుసుములు

ఇవేకాకుండా పెట్టుబడిదారులు పెట్టుబడి కాలమంతటికీ ఇతర ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ఫండ్‌ సంస్థలు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ను కడతారు. ఆ ఛార్జీలను మదుపర్లపై పరోక్షంగా వేస్తారు.

8. నిర్వహణ రుసుములుః

8. నిర్వహణ రుసుములుః

మ్యూచువల్‌ ఫండ్‌లో ఓ వ్యక్తి పెట్టుబడి పెడితే ఆ మొత్తాన్ని ఉపయోగించరు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఫండ్‌ నిర్వహణకు పర్సెంటేజీ రూపంలో కొంత సొమ్ము వసూలు చేస్తారు. పెట్టుబడి నిర్వహణకు, ఏజెంటు కమీషన్‌కు, ఫండ్‌ నిర్వహణ, మార్కెటింగ్‌, అమ్మకపు ఖర్చులు తదితరాలకు కొంత సొమ్ము పెట్టుబడి నుంచి తీసుకుంటారు. ఈ ఖర్చులన్నీ పెట్టుబడిదారు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

సెబీ మార్గదర్శకాల ప్రకారం ఫండ్‌ ఆస్తుల విలువ పెరిగినప్పుడు మదుపర్లపై వేసే రుసుములు తగ్గించాలి. అప్పులతో పాటు పైన తెలిపిన ఖర్చులనూ లెక్కలోకి తీసుకొని నికర ఆదాయ విలువ (ఎన్‌ఏవీ)ను లెక్కిస్తారు. దీన్ని బట్టి ఖర్చులు ఎంత తక్కువుంటే ఫండ్‌ నుంచి రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. సేవా పన్నును అసెట్ మేనేజ్‍మెంట్ కంపెనీలే భరించాలి.

వివిధ ఫండ్లకు వివిధ ఖర్చుల నిష్పత్తి ఉంటుంది. ఇండెక్స్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌ల లాంటి స్తబ్దుగా నడిచే ఫండ్ల నిర్వహణకు ఫండ్‌ నిర్వాహకుడు అవసరం లేదు కాబట్టి తక్కువ ఖర్చుల నిష్పత్తి ఉంటుంది.

* పెట్టుబడిదారు ఫండ్లలో మదుపుచేసే ముందు తక్కువ ఖర్చులు, తక్కువ ఛార్జీలు ఉండేలా చూసుకోవాలి.

English summary

మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిష్క్ర‌మిస్తున్నారా?. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే | want to exit from the mutual fund investments in the middle think about charges

different types of investments related to mutual fund investments
Story first published: Tuesday, January 9, 2018, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X