For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌తి నెలా ఆదాయం పొందేందుకు పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది?

స్థిర‌మైన ఆదాయం పొందే మార్గాల్లో పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం(ఎంఐఎస్‌) ఒక‌టి. ఇందులో వ‌డ్డీని నెల‌వారీ చెల్లిస్తారు. పెట్టుబ‌డి పెట్టిన రోజు నుంచి వ‌డ్డీ లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. రాబ‌డి హామీ ఉ

|

ప్ర‌స్తుత డిజిట‌ల్ యుగంలో ప‌ట్ట‌ణాల్లో ఉద్యోగాలు చేస్తున్న‌ వారు డ‌బ్బు బాగానే సంపాదిస్తున్నారు. డ‌బ్బు ఎక్కువ సంపాదిస్తున్న‌ప్ప‌టికీ దాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి, కొన్ని ఏళ్ల త‌ర్వాత దాన్ని ఎలా రెండింత‌లు, మూడింత‌లుగా పెంచుకోవాల‌నే విష‌యంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. పొదుపు అంటే మన అవసరాలను తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మును భవిష్యత్తుకోసం దాచిపెట్టడం. చాలా మంది నెల‌వారీ ఎంతో కొంత పొదుపు చేద్దామ‌ని, పెట్టుబ‌డులుగా పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌తో ఉంటారు. అందుకోసం దేశంలో వివిధ రిస్క్ స్థాయిల్లో చాలా పెట్టుబ‌డి మార్గాలు ఉన్నాయి. అందులో రిస్క్ త‌క్కువ ఉండి, స్థిర‌మైన ఆదాయం పొందే మార్గాల్లో పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం(ఎంఐఎస్‌) ఒక‌టి. ఇందులో వ‌డ్డీని నెల‌వారీ చెల్లిస్తారు. పెట్టుబ‌డి పెట్టిన రోజు నుంచి వ‌డ్డీ లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. రాబ‌డి హామీ ఉండే ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

1. వడ్డీరేట్లు ఎలా ఉంటాయి?

1. వడ్డీరేట్లు ఎలా ఉంటాయి?

పోస్టాఫీసు నెలసరి ఆదాయ ఫథకంలో ప్ర‌తి నెలా తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం రూ.1500 తో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా 4.5 ల‌క్ష‌ల‌రూపాయలు, జాయింట్‌(ఉమ్మ‌డి ఖాతా)గా అయితే 9 లక్షల రూపాయల వరకూ పెట్టుబడిగా పెట్టవచ్చు. ఏడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకుంటే డిపాజిట్‌ సొమ్ములో ఐదు శాతం తగ్గించుకుని తిరిగిస్తారు. మూడేళ్ళ తర్వాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్‌ చేసిన సొమ్ముని తిరిగిస్తారు. చివరిదాకా పెట్టిన పెట్టుబడిని ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసేసుకుంటే ఎలాంటి బోనస్‌ ఇవ్వరు.

సెక్షన్‌ 80-ఎల్‌ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడిపై పన్ను మినహాయింపూ ఉంటుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నవారికి ఇది అనుకూలమైందని చెప్పొచ్చు. అదే విధంగా పెద్ద మొత్తంలో పొదుపు చేసి, ప్రతినెలా రాబడి అందుకోవాలని భావించేవారితో ఫెన్షన్‌ సదుపాయం లేనివారికి ఇది అనుకూలమైన పథకం.

2. ఎంఐఎస్ అంటే ఏమిటి?

2. ఎంఐఎస్ అంటే ఏమిటి?

నెలసరి ఆదాయ పథకాలు అనగానే నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం అందించే పథకాలే అని భావిస్తాం. ఇవి అలాంటివే అయినాగానీ సంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకూ వీటికీ చాలా తేడా ఉంటుంది. తఫాలా పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్‌లాంటి డెట్‌ పథకాల్లో వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐపీల్లో మాత్రం పన్ను పరంగా కలిసొస్తుంది. ఇందులో వచ్చే లాభం (డివిడెంట్‌)కు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన పని ఉండదు.

3. నామినీ సౌకర్యం

3. నామినీ సౌకర్యం

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్‌ తెరిచే సమయంలోనే నామినీ పేరును జత చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చా? పన్ను పరంగా కలుస్తాయా? అంటే పన్ను వర్తించే ఆదాయం గరిష్టంగా ఉండి, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా ఉండాలని భావించేవారు ఇలాంటి పథకాలు ఎంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

4. ఎలా చేయ‌వ‌చ్చు?

4. ఎలా చేయ‌వ‌చ్చు?

రూ.1500 గ‌ణాంకాల్లో క‌నీసం రూ.1500 నుంచి ప్రారంభించి పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాల్లో పొదుపు చేయ‌వ‌చ్చు. ఏక ల‌బ్దిదారు అయితే రూ.1500 క‌నీస డిపాజిట్‌, గ‌రిష్టంగా రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఈ విధంగా పొదుపు చేయ‌వ‌చ్చు. అదే ఉమ్మ‌డి ఖాతా(జాయింట్ అకౌంట్‌) అయితే క‌నీసం రూ.1500 నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.9 లక్ష‌ల వ‌రకూ పొదుపు చేయ‌వ‌చ్చు. ఒక పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించి ఆటోమేటిక్ ట్రాన్స్ఫ‌ర్ రిక్వెస్ట్ ఇస్తే నెల‌వారీ అందులో డ‌బ్బు జ‌మ అవుతుంది. మీ నెల‌వారీ ఆదాయ పొదుపు ప‌థ‌కంలోంచి నెల‌వారీ వడ్డీ రిక‌రింగ్ డిపాజిట్ మార్గంలో పొదుపు ఖాతాలోకి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌మ అవుతూ ఉంటుంది.

Read more about: post office savings
English summary

ప్ర‌తి నెలా ఆదాయం పొందేందుకు పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది? | Why should one go for post office monthly income scheme for regular income

Post office monthly income scheme
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X