For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబ‌డి పెట్టేందుకు ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్స్

లార్జ్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘ‌కాలంలో స్థిర‌మైన రాబ‌డుల‌ను అందిస్తాయ‌నే న‌మ్మ‌కం సాధార‌ణంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో కొంత పెట్టుబ‌డిని మిడ్‌, స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ పెడితే స్వ‌ల్ప‌కా

|

లార్జ్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘ‌కాలంలో స్థిర‌మైన రాబ‌డుల‌ను అందిస్తాయ‌నే న‌మ్మ‌కం సాధార‌ణంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో కొంత పెట్టుబ‌డిని మిడ్‌, స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ పెడితే స్వ‌ల్ప‌కాలానికైనా, దీర్ఘ‌కాలానికైనా అద్భుత‌మైన రాబ‌డుల‌ను అందించ‌గ‌ల‌వు. మ‌ల్టీబ్యాగ‌ర్ స్టాక్స్ స్వ‌ల్ప‌కాలంలో అధిక రాబ‌డులు ఇస్తాయి. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను కూడా వీటిలోనే పెట్టుబడి పెడ‌తారు.

2017 సంవ‌త్స‌రంలో టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఏమిటి? దీంట్లో ఎవ‌రు పెట్టుబ‌డి పెట్టొచ్చు? ఇటీవ‌ల బుల్ మార్కెట్ ప‌రుగులో వీటి ప్రాముఖ్య‌త ఏమిటి లాంటి ఆస‌క్తిక‌ర విశేషాల‌ను మీకు అందిస్తున్నాం.

1: రిల‌య‌న్స్ స్మాల్ క్యాప్ ఫండ్‌

1: రిల‌య‌న్స్ స్మాల్ క్యాప్ ఫండ్‌

పెట్టుబ‌డి వృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ స్కీమ్ ప‌నితీరు ఉంటుంది. ఈ ఫండ్‌లోని పెట్టుబ‌డిని చిన్న కంపెనీల్లో పెడ‌తారు. ఈ ఫండ్‌ను ప్రారంభించి కేవ‌లం 5ఏళ్లే అయినా సాటి ఫండ్ల‌తో పోలిస్తే అద్భుత‌మైన రాబ‌డుల‌ను అందించింది.

ఫండ్ పనితీరు:

ఈ స్మాల్ క్యాప్ ఫండ్ త‌న బెంచ్‌మార్క్‌ను త‌ల‌ద‌న్ని గ‌డ‌చిన 5ఏళ్ల‌లో 33శాతం వార్షిక రాబ‌డిని తెచ్చిపెట్టింది. గ‌తేడాది 43శాతం రాబ‌డిని అందించి స్మాల్ క్యాప్ ఫండ్ల‌లోకెల్లా ఉత్త‌మంగా నిలిచింది. ఎవ‌రైనా సిప్ విధానంలో 5ఏళ్ల క్రితం ఈ ఫండ్‌లో నెల‌కు రూ.1000 చొప్పున పెట్టుబ‌డి మొద‌లు పెడితే మొత్తం పెట్టుబ‌డి విలువ ఇప్ప‌టికి రూ.60వేలు(రూ.1000* 60 నెల‌లు) కాగా ప్ర‌స్తుత‌ ఫండ్ విలువ రూ.1.4ల‌క్ష‌లు అయ్యుండేది. అదే 3ఏళ్ల క్రింద రూ.1ల‌క్ష పెట్టిన‌ట్ట‌యితే ఈపాటికి ఫండ్ విలువ రూ.2.1ల‌క్ష‌లు అయ్యేది. అదే 5ఏళ్ల క్రితం పెట్టి ఉంటే ఇప్ప‌టికి రూ.4.1ల‌క్ష‌లు అయి ఉండేది.

దీంట్లోనే మ‌దుపు ఎందుకు:

సాటి ఫండ్ల‌తో పోలిస్తే ఇది గ‌డ‌చిన ఏడాదిలో అత్య‌ధిక రాబ‌డుల‌ను అందించింది. గ‌త 5ఏళ్ల ప‌నితీరు కూడా బాగుంది. క్రిసిల్ ఈ ఫండ్‌కు 2వ ర్యాంకు ఇచ్చింది. కాగా వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ సంస్థ 3 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ ఫండ్ రిస్క్ గ్రేడింగ్ కూడా "Above Avg" గా ఉంది. రాబ‌డుల గ్రేడింగ్ సైతం "Above Avg" గా వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ సంస్థ అభివ‌ర్ణించ‌డం విశేషం. 5-10ఏళ్ల దాకా పెట్టుబ‌డి పెట్టేందుకు 2017లో ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్ ఏదంటే రిల‌య‌న్స్ అని చెప్పొచ్చు.

2 : డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మైక్రోక్యాప్ ఫండ్‌

2 : డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మైక్రోక్యాప్ ఫండ్‌

పెట్టుబ‌డి వృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ ఫండ్ ప్రారంభ‌మైంది. మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ప‌రంగా టాప్ 300లో లేని కంపెనీలకు చెందిన షేర్ల‌ను ఎంచుకొని వాటిలో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడతారు.

2008 నుంచి మొద‌లుకొని బెంచ్‌మార్క్‌ను దాటిన అతి కొద్ది స్మాల్ క్యాప్‌ ఫండ్ల‌లో ఇదీ ఒక‌టి. 2012లో త‌ప్ప 8 ఏళ్ల‌పాటు నిర్విరామంగా సాటి ఫండ్ల‌తో పోలిస్తే అద్భుత‌మైన రాబ‌డుల‌ను అందించింది.

ఫండ్ ప‌నితీరుః

గ‌త 5ఏళ్ల కాలంలో ఈ స్మాల్ క్యాప్ ఫండ్ 33శాతం వార్షిక రాబ‌డిని అందించింది. గ‌తేడాది ఏకంగా 36శాతం రాబ‌డిని ఇచ్చింది. ఇది అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్ల‌లో రాబ‌డి ప‌రంగా 2వ ర్యాంకు పొంద‌డం విశేషం. 5ఏళ్ల క్రితం ఎవ‌రైనా నెల‌కు రూ.1000తో సిప్ మొద‌లుపెట్టి ఉంటే ఇప్ప‌టికీ దాని విలువ రూ.1.42ల‌క్ష‌లు అయి ఉండేది. 3ఏళ్ల కింద రూ.1లక్ష పెట్టి ఉంటే ఇప్ప‌టికి దాని విలువ రూ.2.4ల‌క్ష‌లు అయ్యేది. ఒక వేళ 5ఏళ్ల కింద పెడితే రూ.4.1ల‌క్ష‌లు చేతికొచ్చేవి. సిప్ విధానంలోనే కాదు ఏక మొత్తంలో పెట్టిన పెట్టుబ‌డి పైనా మంచి రాబ‌డే వ‌చ్చింద‌ని తెలుస్తుంది.

ఇన్వెస్ట్ చేసేందుకు కార‌ణాలుః

సాటి ఫండ్ల‌ను ప‌నితీరులో త‌ల‌ద‌న్నే రాబ‌డుల‌ను అందించింది. ఏడాది కాలంపాటు చూసినా, గ‌డ‌చిన 5ఏళ్ల‌లోనూ అత్య‌ధిక రాబ‌డుల‌ను అందించింది. క్రిసిల్ దీనికి 1వ ర్యాంకు ఇవ్వ‌గా, వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ 4స్టార్ రేటింగ్‌ను ప్ర‌సాదించింది. ఫండ్ రిస్క్ గ్రేడింగ్‌ను "Average"గా రాబ‌డుల గ్రేడింగ్‌ను "Above Avg" గా వాల్యూ రీసెర్చ్ అభివ‌ర్ణించింది. 5-10ఏళ్ల పాటు పెట్టుబ‌డిపెట్టేందుకు ఉత్త‌మ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇదీ ఒక‌టి. ప్ర‌స్తుతం ఈ ఫండ్లో ఎలాంటి కొత్త పెట్టుబడులను అనుమ‌తించ‌డంలేదు. ఇదివ‌ర‌కే దీంట్లో మ‌దుపు చేసిన‌ట్ట‌యితే దీంట్లో పెట్టుబ‌డిని కొన‌సాగించ‌గ‌ల‌రు. సిప్‌లు కొన‌సాగుతున్న‌ట్ట‌యితే ఇలాంటి ఫండ్ల‌నే ఎంచుకుంటే లాభ‌దాయ‌కం. దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న మార్గాలు

3: ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీ ఫండ్‌

3: ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీ ఫండ్‌

దీర్ఘ‌కాల పెట్టుబ‌డి వృద్ధి ల‌క్ష్యంగా ఈ ఫండ్ పనితీరు ఉంటుంది. ఎక్కువ‌గా మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఈ ఫండ్ పెట్టుబ‌డి పెడుతుంది. సాధార‌ణంగా 75శాతం నిధుల‌ను చిన్న కంపెనీల‌లో పెట్టుబ‌డి పెడ‌తారు.

ఫండ్ ప‌నితీరుః

ఈ ఫండ్ త‌న‌ బెంచ్‌మార్క్‌ను దాటేసి గ‌డ‌చిన 5ఏళ్ల కాలంలో 33శాతం వార్షిక రాబ‌డిని అందించ‌గ‌లిగింది. ఈ ఫండ్ గ‌తేడాది 28శాతం రాబ‌డుల‌ను పొంద‌గ‌లిగింది. స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో రెండో అత్య‌ధిక స్థానం సంపాదించింది. 5ఏళ్ల క్రితం ఎవ‌రైనా నెల‌కు రూ.1000తో సిప్ మొద‌లుపెట్టి ఉంటే ఇప్ప‌టికీ దాని విలువ రూ.1.3ల‌క్ష‌లు అయి ఉండేది. 3ఏళ్ల కింద రూ.1లక్ష పెట్టి ఉంటే ఇప్ప‌టికి దాని విలువ రూ.2ల‌క్ష‌లు అయ్యేది. ఒక వేళ 5ఏళ్ల కింద ఇంతే సొమ్ము పెడితే ఇప్ప‌టికి రూ.4.2ల‌క్ష‌లు చేతికొచ్చేవి. ఏక‌మొత్తంలో పెట్టిన పెట్టుబ‌డిపై 5ఏళ్ల‌కు ఈ ఫండ్ మంచి రాబ‌డుల‌నే అందించినా.. మూడేళ్ల కాల‌వ్య‌వ‌ధిలో సాటి ఫండ్ల‌తో పోలిస్తే అంత ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో అత్య‌ధిక రాబ‌డుల‌ను అందించిన‌వాటిలో ఇదీ ఒక‌టి.

దీంట్లో ఎందుకు మ‌దుపు చేయాలిః

ఇదే మాదిరిగా ఉన్న‌ ఫండ్ల‌తో పోలిస్తే ఈ ఫండ్ ఏడాది, 5ఏళ్ల కాలంలో మంచి రాబ‌డుల‌ను అందించింది. క్రిసిల్ దీనికి 2వ ర్యాంకును, వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ ఫండ్ రిస్క్ గ్రేడింగ్‌ను "Moderately High"గా, రాబ‌డుల గ్రేడింగ్‌ను "Low"గా వాల్యూ రీసెర్చ్ అభివ‌ర్ణించింది. 2017 సంవ‌త్స‌రానికిగాను 8-10ఏళ్ల వ్య‌వ‌ధికి ఉత్త‌మ పెట్టుబ‌డి స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో ఇదీ ఒక‌టి.

4: ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌

4: ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌

దీర్ఘ‌కాల పెట్టుబ‌డి వృద్ధి ల‌క్ష్యంగా ఈ ఫండ్ పనితీరు ఉంటుంది. ఎక్కువ‌గా మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల‌లో వైవిధ్య‌భ‌రిత‌మైన‌వాటిలో ఈ ఫండ్ పెట్టుబ‌డి పెడుతుంది.

ఫండ్ ప‌నితీరుః

ఈ ఫండ్ త‌న‌ బెంచ్‌మార్క్‌ను దాటేసి గ‌డ‌చిన 5ఏళ్ల కాలంలో 32 శాతం వార్షిక రాబ‌డిని అందించ‌గ‌లిగింది. ఈ ఫండ్ గ‌తేడాది 31 శాతం రాబ‌డుల‌ను పొంద‌గ‌లిగింది. స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో 4వ స్థానాన్ని సంపాదించుకుంది. 5ఏళ్ల క్రితం ఎవ‌రైనా నెల‌కు రూ.1000తో సిప్ మొద‌లుపెట్టి ఉంటే ఇప్ప‌టికీ దాని విలువ రూ.1.33ల‌క్ష‌లు అయి ఉండేది. 3ఏళ్ల కింద రూ.1లక్ష పెట్టి ఉంటే ఇప్ప‌టికి దాని విలువ రూ.2.3 ల‌క్ష‌లు అయ్యేది. ఒక వేళ 5ఏళ్ల కింద ఇంతే సొమ్ము పెడితే ఇప్ప‌టికి రూ.4 ల‌క్ష‌లు చేతికొచ్చేవి.

మ‌దుపు చేసేందుకు కార‌ణం:

ఇదే మాదిరిగా ఉన్న‌ ఫండ్ల‌తో పోలిస్తే ఈ ఫండ్ ఏడాది, 5ఏళ్ల కాలంలో మంచి రాబ‌డుల‌ను అందించింది. క్రిసిల్ దీనికి ర్యాంకు కేటాయించ‌లేదు. వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ మాత్రం 3 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ ఫండ్ రిస్క్ గ్రేడింగ్‌ను "Average" గా, రాబ‌డుల గ్రేడింగ్‌ను "Above Average" గా వాల్యూ రీసెర్చ్ అభివ‌ర్ణించింది. 2017 సంవ‌త్స‌రానికిగాను 8-10ఏళ్ల వ్య‌వ‌ధికి ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో ఇదీ ఒక‌టి.

 5: ఎల్ అండ్ టీ మిడ్ క్యాప్ ఫండ్‌

5: ఎల్ అండ్ టీ మిడ్ క్యాప్ ఫండ్‌

మిడ్ క్యాప్ షేర్లలో ప్ర‌ధానంగా పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా క్ర‌మేపీ వృద్ధి వ‌చ్చేలా ఈ ఫండ్ చూస్తుంది. మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ప‌రంగా రూ.300కోట్ల నుంచి రూ.3వేల కోట్ల మ‌ధ్య ఉన్న కంపెనీల్లో ఈ ఫండ్ పెట్టుబ‌డి పెడుతుంది కాబ‌ట్టి దీన్ని స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కిందికి వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.

ఫండ్ ప‌నితీరుః

ఈ ఫండ్ త‌న‌ బెంచ్‌మార్క్‌ను దాటేసి గ‌డ‌చిన 5ఏళ్ల కాలంలో 29 శాతం వార్షిక రాబ‌డిని అందించ‌గ‌లిగింది. ఈ ఫండ్ గ‌తేడాది ఏకంగా 45 శాతం రాబ‌డుల‌ను పొంద‌గ‌లిగింది. స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో 2వ స్థానాన్ని సంపాదించుకుంది. 5ఏళ్ల క్రితం ఎవ‌రైనా నెల‌కు రూ.1000తో సిప్ మొద‌లుపెట్టి ఉంటే ఇప్ప‌టికీ దాని విలువ రూ.1.28ల‌క్ష‌లు అయి ఉండేది. 3ఏళ్ల కింద రూ.1లక్ష పెట్టి ఉంటే ఇప్ప‌టికి దాని విలువ రూ.2.04 ల‌క్ష‌లు అయ్యేది. ఒక వేళ 5ఏళ్ల కింద ఇంతే సొమ్ము పెడితే ఇప్ప‌టికి రూ.3.6 ల‌క్ష‌లు చేతికొచ్చేవి. తోటి ఫండ్ల‌తో పోల్చి చూసుకున్న‌ట్ట‌యితే ఇది గ‌తేడాది అన్నింటిని త‌ల‌ద‌న్నే రాబ‌డుల‌ను అందించింది.

మ‌దుపు చేసేందుకు కార‌ణంః

ఇదే మాదిరిగా ఉన్న‌ ఫండ్ల‌తో పోలిస్తే ఈ ఫండ్ ఏడాది, 5ఏళ్ల కాలంలో మంచి రాబ‌డుల‌ను అందించింది. క్రిసిల్ దీనికి 2వ‌ ర్యాంకు కేటాయించ‌గా, వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ 3 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ ఫండ్ రిస్క్ గ్రేడింగ్‌ను " Below Average" గా, రాబ‌డుల గ్రేడింగ్‌ను "Average" గా వాల్యూ రీసెర్చ్ అభివ‌ర్ణించింది. 2017 సంవ‌త్స‌రానికిగాను 8-10ఏళ్ల వ్య‌వ‌ధికి ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో ఇదీ ఒక‌టి.

6. స్మాల్ క్యాప్ ఫండ్లు ఎవ‌రికి అనుకూలం

6. స్మాల్ క్యాప్ ఫండ్లు ఎవ‌రికి అనుకూలం

చిన్న కంపెనీలు పెరిగేందుకు అవ‌కాశాలెక్కువ‌. అలాంటి వాటిలోనే స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను పెడ‌తారు. ప్ర‌ధానంగా స్మాల్ క్యాప్ షేర్ల‌లో ఇంకొంచెం మిడ్ క్యాప్ షేర్ల‌లో పెడ‌తారు. ఇలాంటి ఫండ్ల‌లో రాబ‌డి చాలా హెచ్చుత‌గ్గుల‌కు లోన‌వుతుంటుంది. ఒక్కోసారి పెట్టుబ‌డిలో కొంత మొత్తం పోయినా ఆశ్చ‌ర్యం లేదు. మ‌రోవైపు కేవ‌లం కొన్నేళ్ల‌ల్లో పెట్టిన సొమ్ము రెట్టింపు అవ్వొచ్చు.

స్మాల్ క్యాప్ షేర్ల‌లో నేరుగా పెట్టేదానికంటే ఫండ్ల‌లో పెట్ట‌డం మంచిద‌ని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. మ‌న పోర్ట్‌ఫోలియోలో క‌నీసం 15 నుంచి 20శాతం స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో పెడితే అధిక రిస్క్ అధిక రాబ‌డుల‌ను అందిపుచ్చుకోవ‌చ్చు. హై రిస్క్‌, మాడ‌రేట్ రిస్క్ తీసుకునేవాళ్ల‌కు 5 నుంచి 10ఏళ్ల దాకా మ‌దుపు చేయాల‌నుకునేవారికి స్మాల్ క్యాప్ స‌రైన ఎంపిక‌. సిప్ ద్వారా లేదా మార్కెట్లు క‌రెక్ష‌న్‌కు గుర‌వుతున్న స‌మ‌యంలో ఏక‌మొత్తంలో పెట్టుబ‌డి పెట్ట‌డాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు.

7. డిస్ క్లెయిమ‌ర్

7. డిస్ క్లెయిమ‌ర్

ఇక్క‌డ పెట్టుబ‌డుల‌కు సంబంధించి మార్కెట్లో ఫండ్ల‌ను అంచ‌నా వేసి మాత్ర‌మే ఇచ్చాం. వీటిపై పెట్టుబ‌డులు పెట్టేముందు మీ సొంత ఆలోచ‌న‌తో లేదా ఆర్థిక నిపుణుల స‌ల‌హాతో మాత్ర‌మే తుది నిర్ణ‌యం తీసుకోండి. వీటి ద్వారా వ‌చ్చే లాభ న‌ష్టాల‌పై గుడ్ రిటర్న్స్ యాజ‌మాన్యానికి కానీ ర‌చ‌యిత‌కు కానీ సంబంధం లేదు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచి ఆలోచనేనా..!

Read more about: investments mutual funds
English summary

పెట్టుబ‌డి పెట్టేందుకు ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్స్ | 5 best small cap mutual funds to invest in 2017

Top 5 Best Small Cap Funds to invest in 2017 Largecap mutual funds provide stable returns to investors in the long term. However, one should also invest in midcap and small cap mutual funds that can provide amazing returns in short term to long term. Small Cap Funds invests in multibagger stocks that has potential to get very high returns in short to medium term.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X