మ్యూచువల్ ఫండ్లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక కొంత మంది సతమతమవుతూ ఉంటారు. సమగ్రంగా చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్లలో డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ అని రెండు రకాలు ఉంటాయి. వాటి గురించి ఇ
చాలా మందికి తరుచూ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను చూసి నిరాశ కలిగి ఉంటుంది. అయితే మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు అంత రిస్క్ తీసుకోలేరు. అలాంటి నష్టభయాన్ని తట్టుకోలేని వారికి మ్యూచువల్ ఫండ్లు ఒక మంచి మార్గం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలం ఆర్థిక లక్ష్యాలు కలిగిన వారికి ఇతర డిపాజిట్ల కంటే ఫండ్లు ఎప్పుడూ మంచి రాబడిని ఇస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక కొంత మంది సతమతమవుతూ ఉంటారు. సమగ్రంగా చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్లలో డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ అని రెండు రకాలు ఉంటాయి. వాటి గురించి ఇంకా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్లలో డైరెక్ట్ ప్లాన్
మ్యూచువల్ ఫండ్లు రెండు దశాబ్దాల కిందే ప్రారంభం అయినా డైరెక్ట్ ప్లాన్ అమల్లోకి వచ్చింది మాత్రం 2013లోనే. మధ్యవర్తుల ద్వారా పెట్టుబడి పెట్టేటప్పుడు దరఖాస్తు పత్రాన్ని నింపే సమయంలో సాధారణంగా ఏజెంట్ చెప్పే రెగ్యులర్ ప్లాన్ టిక్ చేసి... మిగిలిన వివరాలు నింపుతారు. పెట్టుబడిదారులకు మరిన్ని ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో సెబీ డైరెక్ట్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
డైరెక్ట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్, క్యామ్స్(CAMS) లేదా ఆన్‌లైన్ పోర్టళ్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఎవరూ సూచనలు, సహాయం అందించే వారు లేకపోవడం వల్ల కేవైసీ ప్రక్రియ మొత్తం మీరే కష్టపడి పూర్తిచేసుకోవాలి.

ఇండియాలో డైరెక్ట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే మార్గాలు
ప్రతి ఫండ్‌కు ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ ఒకటి ఉంటుంది. దాన్ని అసెట్ మేనేజ్‌మెంట్(ఏఎమ్‌సీ) కంపెనీ అంటారు. ఈ ఏఎమ్‌సీలు తమ వెబ్‌సైట్ల ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్ లావాదేవీ జరపొచ్చు.
1. ఏఎమ్‌సీ వెబ్‌సైట్లు
2. మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ
3. క్యామ్స్ ఆన్‌లైన్/ MYCAMS
4. ఇతర మధ్యవర్తుల వెబ్‌సైట్లు
ఈ కింద ఉదాహరణ కోసం కొన్ని సంస్థల వెబ్సైట్లు చూడండి.
http://www.franklintempletonindia.com/, http://www.hdfcfund.com/, http://www.icicipruamc.com/, http://www.dspblackrock.com/, http://www.birlasunlife.com/

3. బ్యాంకుల ద్వారా
ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులన్నీ మ్యూచువల్ ఫండ్ పథకాలను సేల్ చేస్తున్నాయి.
కేవలం ఫండ్లను అమ్మే బ్యాంకు శాఖకు వెళ్లి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.
సేవల విషయంలో బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు కాస్త అసౌకర్యంగా ఉంటుంది.

స్వతంత్ర వెబ్‌సైట్లు((independent websites)
ఫండ్స్ ఇండియా, జిప్ సిప్, ఫండ్స్ సూపర్ మార్ట్ ఇలా వంటి వెబ్సైట్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏ ఏఏమ్సీ పథకంలోనయినా ఒకే ఖాతాతో పెట్టుబడులు పెట్టుకునే వీలును ఈ స్వతంత్ర వెబ్సైట్లు కల్పిస్తాయి. దాంతో పాటు పెట్టుబడుల వివరాలన్నీ ఒకే చోట ఉంటాయి. ఏ పథకంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, వాటి విలువ ఎంత తదితర వివరాలను వెబ్సైట్లో లాగిన్ అయి సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, ఇవి డైరెక్ట్ ప్లాన్స్ కావు. రెగ్యులర్ ప్లాన్స్. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులపై మధ్య వర్తిత్వపు కంపెనీలకు ఏఎమ్సీలు కంపెనీలు కొంత కమీషన్ చెల్లిస్తాయి. దీర్ఘకాలంలో అందుకునే ప్రతిఫలంలో డైరెక్ట్ ప్లాన్స్ తో పోలిస్తే రెగ్యులర్ ప్లాన్స్ లో అందుకునే మొత్తం స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. కానీ, పెట్టుబడుల పరంగా ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి.

ఏజెంట్ల ద్వారా
మ్యూచువల్ ఫండ్ల కొనుగోలుకు ప్రారంభం నుంచి ఎక్కువ మంది మొగ్గు చూపే మార్గం ఏజెంటు ద్వారా. ఏజెంట్లకు కాల్ చేయడమే ఆలస్యం వాళ్లే ఇంటికి వచ్చి పెట్టుబడి ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఫారంలన్నీ ఏజెంటే పూరించి చెక్ లేదా డీడీ, అవసరమైన పత్రాలను వాళ్లే తీసుకుని వెళ్లిపోతున్నారు. మీరు సంతకాలు చేస్తే చాలు. అతడికి కంపెనీ కమీషన్ చెల్లిస్తుంది కాబటట్ఏ అతడు ఇదంతా చేస్తున్నాడనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కొంత కాలం పాటు అలా చేసిన వ్యవహారాలను గమనిస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్ కంటే మ్యూచువల్ పండ్ ఏజెంటుకు ఎక్కువ కమీషన్ లభిస్తుంది. మీకు తెలియకుండానే మీ పెట్టుబడిలో ఏజెంటుకు కొంత కమీషన్ రూపంలో వెళుతుంది .
కానీ అసలు మ్యూచువల్ ఫండ్ల గురించి అంతవరకూ తెలియని వారికి మరో దారి లేక ఈ రకంగా చేస్తున్నారు. పథకం ఎంపికలో సరైన సలహాలు ఇచ్చే ఏజెంటు అయితే ఆందోళన లేకుండా అతడి ద్వారానే కొనుగోలు చేయడం మంచిది. కొత్తగా పెట్టుబడి ప్రారంభించే వారు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏజెంటు లేదా బ్రోకర్ సేవలను పొందడం సూచనీయం. అయితే పెట్టుబడుల గురించి కాస్త అవగాహన ఉన్నవారు ఇలా చేయడం మంచిది కాదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications