For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచి ఆలోచనేనా..!

By Nageswara Rao
|

మన జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళిక ఉండాలి. ఇందుకు సరైన ప్రణాళికను కచ్చితంగా, క్రమశిక్షణతో ఆచరణలో పెట్టడంతో పాటు అందుకు అనువైన పెట్టుబడి పథకాలనూ ఎంచుకోవాలి.

షేర్ మార్కెట్, బాండ్లు, నగదు ఆధారిత పథకాలు ఇలాంటి వాటిల్లో మదుపు చేసే వారికి మ్యూచువల్ ఫండ్స్ తప్పకుండా నచ్చుతాయి. సాధారణంగా దీర్ఘకాలిక లక్ష్యాల కోసమే మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం చేస్తుంటారు.

ఇటీవల కాలంలో వీటిల్లో సులభంగా అర్ధమయ్యేవీ, వెంటనే నగదుగా మార్చుకునే వీలున్న పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం.

సరైన ఎంపిక

సరైన ఎంపిక

మ్యూచువల్ ఫండ్ పథకంలో మదుపు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ముందుగా మన ఆర్థిక లక్ష్యం ఏమిటి? దాన్ని సాధించేందుకు ఉన్న వ్యవధి ఎంత? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ఉదాహరణకు పదవీ విరమణ లాంటి దీర్ఘకాలిక లక్ష్యం కోసం మదుపు చేసేటప్పుడు ఈక్విటీ పండ్లలో అధిక భాగం మదుపు చేయాలి. మంచి పనితీరు, నష్టభయం అధికంగా లేకపోవడం తదితర అంశాలను పరిశీలించాకే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.

పరిస్ధితుల ప్రభావం

పరిస్ధితుల ప్రభావం

మన ఆర్ధిక పరిస్ధితులు ఎప్పుడు ఓకేలా ఉండవు. పెట్టుబడుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు వివాహానికి ముందు పెద్దగా బాధ్యతలు ఉండవు. ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు చేతిలో ఎక్కువ సొమ్ము ఉంటుంది. వివాహం అయ్యాక కొన్ని ఖర్చులు పెరుగుతాయి. మనం అంతక ముందు అనుకున్న లక్ష్యాల్లో కూడా తేడా రావొచ్చు.

 ఆదాయంలో హెచ్చు తగ్గులు

ఆదాయంలో హెచ్చు తగ్గులు

ఫండ్‌లో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది మీ ఆదాయాన్ని బట్టే ఆధాపడి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం మారినప్పుడు లేదా కోల్పోయినప్పుడు ఆదాయాల్లో హెచ్చు తగ్గులుంటాయి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంకన్నా మెరుగైన దాంట్లో చేరినప్పుడు మీకు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. ఈ సందర్భంలో పెరిగిన ఆదాయాన్ని బట్టి, ఎంత శాతం మేరకు పెట్టుబడులనూ పెట్టాలి. కొత్తగా ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలి. ఎంత కాలానికి పెట్టుబడి పెట్టాలి అనే దానిపై సమీక్ష అవసరం.

మ్యూచవల్ ఫండ్స్ పనితీరు ఎలా ఉంటుంది?

మ్యూచవల్ ఫండ్స్ పనితీరు ఎలా ఉంటుంది?

సాధారణంగా దీర్ఘకాలం మదుపు చేయాలనే లక్ష్యంతో మ్యూచువల్ ఫండ్స్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే మ్యూచవల్ ఫండ్స్ పెట్టుబడికి ఒక మార్గం. ఇందులో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఆలోచించి, మంచి పథకంలో మదుపు చేయడం మంచిది. కాలక్రమంలో దాని పనితీరు అదే విభాగంలో ఉన్న ఇతర పథకాలతో పోల్చి చూస్తే బాగాలేదు అనిపించింది. ఆ విషయం మనకు ఎలా తెలుస్తుంది? పథకాల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించుకున్నప్పుడే మనం ఎంచుకున్న పథకం తగిన ప్రతిఫలాన్ని ఇస్తోందా?లేదా? అనేది అర్థమవుతుంది.

English summary

మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచి ఆలోచనేనా..! | When mutual funds are a good idea

Mutual funds offer consumers a great way to access a professionally-managed group of assets at a relatively low cost, with reasonable annual expenses. Mutual funds can be purchased in any investment account, such as an IRA, which can be opened with many different financial institutions, including banks.
Story first published: Tuesday, August 25, 2015, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X