For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీమా రైడ‌ర్లు-వాటి ప్ర‌యోజ‌నాలు

ఈ రైడర్లను జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో తీసుకోవచ్చు లేదా తర్వాతైనా పొందేందుకు వీలుంది. బీమా రంగంలో అందుబాటులో ఉండే వివిధ రైడ‌ర్ల గురించి తెలుసుకుందాం.

|

సాధారణ జీవిత బీమా పాలసీలు జీవిత బీమా కల్పిస్తాయి. జీవిత బీమాకు అనుబంధంగా తీసుకునేదాన్ని రైడర్‌ అంటారు. ఈ రైడర్ల కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విడిగా పొందే మార్గం లేదు. కేవలం మనకున్న బీమాతో పాటు అదనంగా రైడర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని సాధారణ జీవిత బీమా పాలసీలు లేదా పెట్టుబడి ఆధారిత జీవిత బీమా పాలసీలతో కలిపి తీసుకోవచ్చు.

ఈ రైడర్లను జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో తీసుకోవచ్చు లేదా తర్వాతైనా పొందేందుకు వీలుంది. బీమా రంగంలో అందుబాటులో ఉండే వివిధ రైడ‌ర్ల గురించి తెలుసుకుందాం.

1)యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌

1)యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌

ప్రమాదం వల్ల అనుకోకుండా బీమాదారుడు మృతిచెందితే ప్రాథమిక జీవిత బీమా పాలసీలో కల్పించే సొమ్ము కంటే రైడర్లతో కలిపి అందించే బీమా సొమ్ము అధికంగా ఉంటుంది. ఈ రైడర్‌ ముఖ్యోద్దేశం అదనపు బీమా సొమ్మును కల్పించడమే.

ఉదాహరణకు ఒక పాలసీదారుడు రూ.కోటి టర్మ్‌ పాలసీ చేయించుకున్నారనుకుందాం. దీనికి అదనంగా రూ.25లక్షల యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌ కొనుగోలు చేశాడనుకుందాం. ఒక వేళ అనుకోకుండా ప్రమాదం జరిగి మృతిచెందితే రూ.కోటితోపాటు అదనంగా రూ.25లక్షల బీమా సొమ్మును బీమా కంపెనీ మృతుడి కుటుంబసభ్యులకు లేదా నామినీకి అందజేస్తుంది.

2) పర్మనెంట్‌ డిసేబిలిటీ రైడర్‌: పాక్షిక / శాశ్వత వైకల్య రైడర్లు :

2) పర్మనెంట్‌ డిసేబిలిటీ రైడర్‌: పాక్షిక / శాశ్వత వైకల్య రైడర్లు :

ప్రమాదం కారణంగా గాయాలపాలై పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం కలిగితే బీమా కంపెనీ బీమా మొత్తంలో కొంత భాగాన్ని క్రమానుగతంగా బీమాదారుడికి కోలుకునే వరకు లేదా నిర్ణీత సమయం వరకు చెల్లిస్తుంది. ఆర్జించ లేని పరిస్థితుల్లో ఈ సొమ్ము ఆదాయ మార్గంగా ఉంటుంది. ఈ రైడర్‌ సాధారణంగా యాక్సిడెంట్‌ రైడర్‌తో కలిపి ఇస్తారు. రైడర్‌ కొనుగోలు చేసే ముందు నియమనిబంధనలను ఓసారి పరిశీలించడం మంచిది.

3) తీవ్రమైన అనారోగ్యానికి వర్తింపజేసే ( క్రిటికల్‌ ఇల్‌నెస్‌) రైడర్‌:

3) తీవ్రమైన అనారోగ్యానికి వర్తింపజేసే ( క్రిటికల్‌ ఇల్‌నెస్‌) రైడర్‌:

బీమా కలిగి ఉన్న సమయంలో ఏదైనా ప్రాణాంతక లేదా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ ఉపయోగపడుతుంది. రైడర్‌కు వర్తించే బీమా సొమ్మును అందజేస్తారు. సహజంగా తీవ్ర అనారోగ్యానికి సంబంధించిన చికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి సమయంలో ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్లు ఆసరాగా ఉంటాయి. సాధారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌, మూత్రపిండాల జబ్బులు, పక్షవాతం, అంధత్వం, అవయవ మార్పిడి, బైపాస్‌ సర్జరీ, గుండె కవటాల మార్పిడులు ఈ రైడర్‌ పరిధిలోకి వస్తాయి. కొన్ని బీమా కంపెనీలు ఒక్కో వ్యాధికి అందించే సొమ్ముకు పరిమితిని విధిస్తాయి. అందువల్ల పాలసీ కొనేముందు ఏయే జబ్బులకు ఈ రైడర్‌ వర్తిస్తుందో వాటి పరిమితులేమిటో తెలుసుకొని ఉండడం మంచిది.

ఈ రైడర్‌ను ఒక్కసారికి మాత్రమే క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రైడర్‌ సమయం ముగిసిపోతుంది.

 4) ప్రీమియం మినహాయింపు ( ప్రీమియం వైవర్‌ ) రైడర్‌:

4) ప్రీమియం మినహాయింపు ( ప్రీమియం వైవర్‌ ) రైడర్‌:

బీమా పొందిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే పాలసీ ప్రీమియం చెల్లించడం భారంగా మారుతుంది. ఇలాంటి సమయంలో భరోసా కల్పించేందుకు రూపొందించిందే ప్రీమియం మిన‌హాయింపు(ప్రీమియం వైవ‌ర్‌) రైడర్‌. ఈ రైడర్‌ పొంది ఉంటే ప్రీమియంలో కొంత భాగం లేదా ప్రీమియం మొత్తం చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంచుకునే రైడర్‌ను బట్టి మినహాయింపు ఉంటుంది.

5) మేజర్‌ సర్జికల్‌ బెనిఫిట్‌ రైడర్‌ :

5) మేజర్‌ సర్జికల్‌ బెనిఫిట్‌ రైడర్‌ :

ఏదైనా పెద్ద శస్త్రచికిత్స అవసరమైనప్పుడు ఈ రైడర్‌ పొందవచ్చు. దీంట్లో అత్యవసర వైద్య సహాయానికి చేసే శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును అందిస్తారు. ఈ రైడర్‌ పరిధిలో వచ్చే శస్త్రచికిత్సలు, వాటికి కల్పించే బీమా మొత్తం, ఇతరత్రా సమచారం పాలసీ డాక్యుమెంట్లలో లభిస్తుంది.

6) టర్మ్‌ రైడర్‌:

6) టర్మ్‌ రైడర్‌:

ఈ రైడర్‌ అదనపు బీమా సొమ్మును పొందే వీలును కల్పిస్తుంది. పాలసీదారుడు అనుకోకుండా మృతిచెందితే బీమా సొమ్ముతోపాటు రైడర్‌ సొమ్మును సైతం అందిస్తారు. సాధారణంగా ప్రాథమిక బీమా సొమ్ముకు సమానంగా రైడర్‌ సొమ్మును హామీ ఇస్తారు.

7)జీవితభాగస్వామికి కల్పించే రైడర్‌:

7)జీవితభాగస్వామికి కల్పించే రైడర్‌:

ఈ రైడర్‌ జీవిత భాగస్వామికి కూడా బీమా అందిస్తుంది. జీవిత భాగస్వామికి ప్రత్యేక బీమా చేయించని సందర్భంలో ఈ రైడర్‌ ఉపయోగపడుతుంది.

Read more about: insurance policy riders
English summary

బీమా రైడ‌ర్లు-వాటి ప్ర‌యోజ‌నాలు | different types of insurance riders available in the insurance market

Riders are add-ons or additional benefits which you can opt for along with your current life insurance policy at affordable rates. Riders are the valuable tools that help you in expanding your life insurance coverage.
Story first published: Saturday, October 7, 2017, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X