For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్స‌ర్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు "ఎస్‌బీఐ సంపూర్ణ క్యాన్స‌ర్ సుర‌క్ష‌"

ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ క్యాన్స‌ర్ సుర‌క్ష పాల‌సీతో పాల‌సీదారుల ఆర్థిక క‌ష్టాల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీని గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

|

ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ అంటే అంద‌రికీ తెలిసేది కాదు. ఇప్పుడు వైద్య రంగంలో వ‌చ్చిన పురోగ‌తి మూలంగా క్యాన్స‌ర్‌పైన అవ‌గాహ‌న పెరిగింది. గ‌త ద‌శాబ్దం నుంచి క్యాన్స‌ర్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఎవ‌రికైనా కుటుంబంలో క్యాన్స‌ర్ వ‌చ్చిందంటే అది మొత్తం కుటుంబం కుంగిపోయేలా చేస్తుంది. వ్య‌క్తికి ఉండే విల్ ప‌వ‌ర్‌, జీవితంపైన ఉండే ఆశావాద దృక్ప‌థం, వైద్య సాంకేతిక‌త‌లో వ‌చ్చిన మార్పులు క్యాన్స‌ర్ వ్యాధిని న‌యం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. అయితే దీనిక‌య్యే ఖ‌ర్చు మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. దాన్ని చాలా మంది భ‌రించే స్థాయిలో ఉండ‌రు. అందుకే బీమా కంపెనీలు త‌క్కువ ప్రీమియంతో పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. అదే విధంగా ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ క్యాన్స‌ర్ సుర‌క్ష పాల‌సీతో పాల‌సీదారుల ఆర్థిక క‌ష్టాల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీని గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

పాల‌సీ అర్హ‌తలు

పాల‌సీ అర్హ‌తలు

క‌నీస వ‌య‌సు: 6, గ‌రిష్ట వ‌య‌సు: 65 ఏళ్లు

వ్య‌క్తికి 75 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది.

పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి ప్రీమియంను బ‌ట్టి మారుతూ ఉంటుంది.

అంటే క‌నీసం 5 ఏళ్లు మొద‌లుకొని 30 ఏళ్ల పాటు వ‌ర్తించేలా తీసుకోవ‌చ్చు.

పాల‌సీ ప్ర‌యోజ‌నాలు

పాల‌సీ ప్ర‌యోజ‌నాలు

బీమా హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. క్యాన్స‌ర్ ప్రాథ‌మిక ద‌శ‌లో గుర్తించిన‌ట్ల‌యితే బీమా హామీ సొమ్ములో 30 శాతం చెల్లిస్తారు. రెండోసారి మైన‌ర్ క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే మ‌రోసారి 30 శాతం వ‌ర‌కూ చెల్లింపులు చేస్తారు. ఆ త‌ర్వాత మేజ‌ర్ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే మిగ‌తా 40 శాతం ప‌రిహారాన్ని అందిస్తారు. పాల‌సీ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి. https://www.sbilife.co.in/en/individual-life-insurance/traditional/sampoorn-cancer-suraksha

ప్రీమియం చెల్లింపు

ప్రీమియం చెల్లింపు

ప్రీమియం చెల్లింపును పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి పాల‌సీ కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కూ చేయాలి.

ప్రీమియంను ప్ర‌తి నెలా, మూడు నెల‌ల‌కు, ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి మ‌న వీలును బ‌ట్టి చెల్లించ‌వ‌చ్చు. ప్రీమియం చెల్లింపు గ‌డువును మొద‌ట్లోనే ఎంచుకోవాలి.

రూ.15 ల‌క్ష‌ల పాల‌సీని కొనుగోలు చేస్తే నెల‌కు అయితే రూ.50, సంవ‌త్స‌రానికి అయితే రూ.600 వ‌ర‌కూ చెల్లించాలి. ఇది బీమా హామీ మొత్తాన్ని బ‌ట్టి మారుతూ ఉంటుంది.

ఇత‌ర వివ‌రాలు

ఇత‌ర వివ‌రాలు

క్యాన్స‌ర్ మూడు ద‌శ‌లు మైన‌ర్‌, మేజ‌ర్‌, అడ్వాన్స్‌డ్ ద‌శ‌ల‌ను బ‌ట్టి మూడు ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉండేలా స్టాండ‌ర్డ్‌, క్లాసిక్‌, ఎన్‌హాన్స్‌డ్ అనే మూడు ర‌కాలుగా క్యాన్స‌ర్ పాల‌సీని రూపొందించారు.

మ‌నం ఎంచుకునే ర‌కాల‌ను బ‌ట్టి మ‌న‌కు అందే ప్ర‌యోజ‌నాలు మారుతూ ఉంటాయి.

ఇదివ‌ర‌కే హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉంటే పాల‌సీ వ‌ర్తించ‌దు.

కార్సినోమా ఇన్సిట్యూ లాంటి ముంద‌స్తు వ్యాధులు ఉంటే పాల‌సీ వ‌ర్తించ‌దు.

న్యూక్లియ‌ర్‌, బ‌యోలాజిక‌ల్‌, ర‌సాయ‌న కాలుష్యం కార‌ణంగా క్యాన్స‌ర్ వ‌స్తే దానికి పాల‌సీ వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

180 రోజుల వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది.

పాల‌సీని ఏటా రెన్యువ‌ల్ చేసుకునే స‌దుపాయం ఉంది.

ఆదాయపు ప‌న్ను చ‌ట్టం 80డీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

Read more about: sbi life insurance
English summary

క్యాన్స‌ర్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు "ఎస్‌బీఐ సంపూర్ణ క్యాన్స‌ర్ సుర‌క్ష‌" | SBI Life rolls out cancer policy these are the features

SBI Life Insurance on Tuesday announced the launch of ‘SBI Life-Sampoorn Cancer Suraksha’, an individual, non-participating, non-linked health insurance product which helps one to prepare financially upon diagnosis of cancer.
Story first published: Saturday, August 5, 2017, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X