For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కి తీసుకోవ‌చ్చు?

ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన‌క్కు తీసుకోవ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇత‌ర ఫండ్ల విష‌యంలో ఫండ్ ర‌కాన్ని బ‌ట్టి లాక్ ఇన్

|

ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన‌క్కు తీసుకోవ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇత‌ర ఫండ్ల విష‌యంలో ఫండ్ ర‌కాన్ని బ‌ట్టి లాక్ ఇన్ పీరియ‌డ్ మారుతుంది. మొద‌టిసారి ఫండ్ పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ స్కీమ్ సంబంధిత ప‌త్రాన్ని పంపుతుంది. అందులో లాక్ ఇన్ పీరియ‌డ్ వివ‌రాలు ఉంటాయ‌ని తెలుసుకోండి.

ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పీరియ‌డ్

ఫండ్ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకునేట‌ప్పుడు ఎగ్జిట్ లోడ్(నిష్క్ర‌మ‌ణ చార్జీలు) గురించి తెలుసుకోవాలి. నిర్ణీత కాల‌ప‌రిమితి లోపు పెట్టుబ‌డి రిడీమ్ చేసుకునే ముందు ఫండ్ హౌస్ విధించే చార్జీల‌ను ఎగ్జిట్ లోడ్ అంటారు. పెట్టుబ‌డిదారుల‌ను ఒక స్వ‌ల్ప‌కాలిక విధానం నుంచి దారిమ‌ళ్లించేందుకు ఈ ర‌క‌మైన చార్జీలు వ‌సూలు చేస్తారు.
క్లోజ్‌డ్ ఎండెడ్ ఫండ్స్ విష‌యంలో ఎప్పుడు ప‌డితే బ‌య‌ట‌కు రావ‌డానికి ఉండ‌దు. ఫండ్ మెచ్యూరిటీ తేదీ పూర్త‌వ‌గానే ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతాలోకి యూనిట్ల విలువ‌ను జ‌మ చేస్తారు. క్లోజ్‌డ్ ఎండెడ్ ఫండ్ సంబంధిత ప‌థ‌కాల‌న్నింటినీ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేసి ఉంటారు. పెట్టుబ‌డిదారులు యూనిట్ల‌ను ఎక్స్చేంజీ ద్వారా మాత్ర‌మే ఇత‌రుల‌కు అమ్మొచ్చు. మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు స్థానం క‌ల్పించ‌డం ద్వారా నుంచి మ‌ధ్య-దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డులు పొంద‌వ‌చ్చు.

Read more about: mf mutual funds investment
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కి తీసుకోవ‌చ్చు? | when can i withdraw investment in mutual fund

An investment in an open end scheme can be redeemed at any time. Unless it is an investment in an Equity Linked Savings Scheme (ELSS), wherein there is a lock-in of 3 years from date of investment, there are no restrictions on investment redemption.Investors need to keep in mind any applicable exit load on their investment. Exit loads are charges deducted at the time of redemption, only if applicable. AMCs usually impose an exit load to deter short term or speculative investors from entering a scheme
Story first published: Friday, June 16, 2017, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X