For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌నీ బ్యాక్ పాల‌సీ ఎలాంటి వారు తీసుకోవాలి?

జీవితంలో సంపాద‌న పెరుగుతున్న కొద్దీ పెట్టుబ‌డుల‌ను విస్త‌రించ‌డం ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని. సాధార‌ణంగా మ‌న దేశంలో ఎక్కువ మంది బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే

|

జీవితంలో సంపాద‌న పెరుగుతున్న కొద్దీ పెట్టుబ‌డుల‌ను విస్త‌రించ‌డం ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని. సాధార‌ణంగా మ‌న దేశంలో ఎక్కువ మంది బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు పొందాంటే స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్‌లు మంచి పెట్టుబ‌డి మార్గం అని కొంత మంది గుర్తిస్తున్నారు. అదే విధంగా జీవితంలో అనిశ్చిత ప‌రిస్థితుల నుంచి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రాకూడ‌దంటే బీమా తీసుకోవ‌డం ముఖ్యం. జీవిత బీమాలో ప‌లు ర‌కాల పాల‌సీలు ఉన్నాయి. ఎండోమెంట్ పాల‌సీ లానే బీమా మొత్తం కాల‌ప‌రిమితిలో మ‌ధ్య మ‌ధ్య‌లో క‌వ‌రేజీ సొమ్మును వెన‌క్కు పొందాలంటే మ‌నీ బ్యాక్ పాల‌సీని ఆశ్ర‌యించ‌వ‌చ్చు. దీని గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

మ‌నీ బ్యాక్ పాల‌సీ అంటే ఏమిటి?

మ‌నీ బ్యాక్ పాల‌సీ అంటే ఏమిటి?

పెట్టుబ‌డిని, బీమా ర‌క్ష‌ణ‌ను రెండింటినీ క‌లిపి ఒకే దానిలో అందించేదే మ‌నీ బ్యాక్ పాల‌సీ.

ఎండోమెంట్ ప్లాన్‌లో పాలసీ కాలంలో పాలసీదారు "క్రమానుగత చెల్లింపుల"ను మరియు దాని టర్మ్ కొనసాగినప్పు ఒకేసారి మొత్తం న‌గ‌దును పొందుతాడు. అదే మ‌నీ బ్యాక్‌ పాలసీ విష‌యంలో చూస్తే టర్మ్ కాలంలో మరణం సంభవించినప్పుడు, ఆ రోజు వరకు చెల్లించిన మొత్తాలను తగ్గించకుండానే, లబ్దిదారు హామీ ఇవ్వబడిన పూర్తి మొత్తాన్ని పొందగలడు, తదుపరి ప్రీమియంలు చెల్లించనవసరం లేదు. ఈ రకం పాలసీలు చాలా ప్రజాదరణ పొందుతాయి, ఎందుకంటే ఇవి పాలసీదారు అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట కాలాలకు గాను పెద్ద మొత్తాలను అందించగలుగుతాయి.

పాల‌సీ ఉద్దేశం

పాల‌సీ ఉద్దేశం

పాల‌సీదారుడికి క్ర‌మానుగ‌తంగా డ‌బ్బును చెల్లిస్తూ బీమా క‌ల్పించ‌డం మ‌నీబ్యాక్ పాల‌సీ ఉద్దేశం. కుటుంబ అవ‌స‌రాల కోసం నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో డ‌బ్బు కావాల‌నుకునేవారికి ఈ పాల‌సీ త‌గిన‌దిగా చెప్పుకోవ‌చ్చు. సాధార‌ణ వ్య‌క్తులు 13 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారి వ‌ర‌కూ మ‌నీబ్యాక్ పాల‌సీలు తీసుకునే వీలుంది. 7 సంవ‌త్స‌రాలు మొద‌లుకొని 25 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉన్న పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి.

పాల‌సీ ఎలా ప‌నిచేస్తుందంటే

పాల‌సీ ఎలా ప‌నిచేస్తుందంటే

సుమిత్ మ‌నీ బ్యాక్ పాల‌సీ తీసుకున్నాడు. రూ.5 లక్ష‌ల బీమా హామీ మొత్తంతో 25 ఏళ్ల ట‌ర్మ్ ఉన్న పాల‌సీ అనుకుందాం. అంటే 25 ఏళ్ల పాటు పాల‌సీ ప్రీమియంల‌ను చెల్లించాలి. పాల‌సీ మ‌ధ్య‌లో కొన్ని సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి కొంత మొత్తాన్ని అత‌డు పొందుతాడు. ఉదాహ‌ర‌ణ‌కు 25 ఏళ్ల పాల‌సీ విష‌యంలో బీమా హామీ మొత్తంలో 15% సొమ్మును నాలుగు సార్లుగా తీసుకుంటాడు. పాల‌సీ మొద‌లైన రోజు నుంచి 5,10,15, 20 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధుల్లో ఒక్కోసారి 15% చొప్పున 20 సంవ‌త్స‌రాల ట‌ర్మ్ పూర్త‌య్యేస‌రికి 60% సొమ్ము వెన‌క్కు వ‌స్తుంది. పాలసీ మెచ్యూరిటీ పూర్త‌యిన త‌ర్వాత మిగిలిన 40% సొమ్మును బీమా కంపెనీ చెల్లిస్తుంది.

 ఎలాంటి వారు మ‌నీ బ్యాక్ పాల‌సీ తీసుకుంటే మంచిది?

ఎలాంటి వారు మ‌నీ బ్యాక్ పాల‌సీ తీసుకుంటే మంచిది?

సంపాద‌న వ‌య‌సులో పిల్ల‌ల చ‌దువులు, ఇంటి కొనుగోలు, పిల్ల‌ల వివాహం, కారు కొనుగోలు వంటి అవ‌స‌రానికి త‌గిన సంపాద‌న లేని వారు పొదుపు ద్వారా వీటిని సాధించాలంటే మ‌నీ బ్యాక్ పాల‌సీ వారికి స‌రిపోతుంది. ఎందుకంటే ఎట్టిప‌రిస్థితుల్లోనైనా మ‌ధ్య‌లో చెల్లించిన సొమ్ముతో సంబంధం లేకుండా మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాన్ని నామినీకి చెల్లిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు పాల‌సీ తీసుకుని ట‌ర్మ్(కాల‌ప‌రిమితి)కి ముందే బీమాదారు చ‌నిపోతే నామినీకి మొత్తం బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.

 పెట్టుబ‌డి, ప‌న్ను ఆదా

పెట్టుబ‌డి, ప‌న్ను ఆదా

ఎవ‌రి జీవితాన్ని అయినా బీమాతో ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం ముఖ్యం. అది కూడా మీరు సంపాద‌న‌ప‌రులైతే మీ త‌ర్వాత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక బీమా పాలసీ తీసుకోవ‌డం సూచ‌నీయం. ఇది వ‌ర‌కూ జీవిత బీమా ఉండి ఉంటే, ఇంకా పెట్టుబ‌డి లాగా ఒక పాల‌సీ తీసుకోవాల‌ని ఆలోచిస్తే అలాంటి వారికి మ‌నీ బ్యాక పాల‌సీ బాగా న‌ప్పుతుంది. దీని ద్వారా ఒక పెట్టుబ‌డి అవ‌కాశంతో పాటు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

English summary

మ‌నీ బ్యాక్ పాల‌సీ ఎలాంటి వారు తీసుకోవాలి? | For whom money back plan is ideal

money back plan is ideal for people who want a guaranteed return on their investments and are looking for regular payouts at the same time in addition to an insurance cover for themselves for the same money they are putting in as premium.
Story first published: Tuesday, June 20, 2017, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X