English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో విధించే వివిధ రుసుములు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

మీరు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను నిర్వ‌హించే బ్రోక‌ర్లు ఎలా చార్జీలు విధిస్తార‌ని తెలుసుకోవాల‌ని ఉంటుంది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలంటే మ‌న ఫండ్ల‌ను నిర్వ‌హించే సంస్థ‌లు. సాధార‌ణంగా ప్ర‌తి ఫండ్‌కు ఒక మేనేజ‌ర్ ఉంటారు. కంపెనీకి వివిధ రూపాల్లో ఫండ్ నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చుల‌వుతాయి. వీట‌న్నింటిని ఏదో రూపంలో పెట్టుబ‌డిదారు నుంచే రాబ‌డ‌తారు. మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌లో రుసుముల గురించి వివ‌రిస్తారు. వాటి గురించి స‌వివ‌రంగా ఇక్క‌డ తెలుసుకుందాం.

ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్‌

ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్‌

ఇంత‌కుముందు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎంట్రీ లోడ్‌, ఎగ్జిట్ లోడ్ అని ఉండేవి. పెట్టుబ‌డిదారుల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో 2.25%గా ఉన్న ఎంట్రీ లోడ్ 2009 త‌ర్వాత సెబీ తొల‌గించింది. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిర్ణ‌యించిన క‌నీస గ‌డువు క‌న్నా ముందు పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకోవాల‌నుకుంటే మాత్రం ఎగ్జిట్ లోడ్‌(నిష్ర్ర్క‌మ‌ణ చార్జీలు) ఉంటుంది. డ్యూ డేట్ కంటే ముందు ఫండ్ల‌ను రిడీమ్ చేసినా లేదా పూర్తిగా ఫండ్ల నుంచి నిష్క్ర‌మించాల‌ని చూసినా ఫండ్ సొమ్ములో కొంత శాతాన్ని ఎగ్జిట్ లోడ్ రూపంలో సేక‌రిస్తారు.

లావాదేవీ రుసుము

లావాదేవీ రుసుము

సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మొద‌టిసారి పెట్టాల‌నుకునే వారు సిప్ మార్గాన్నే ఎంచుకుంటారు. ఇలాంటి కొత్త ఇన్వెస్ట‌ర్ల విష‌యంలో లావాదేవీల‌కు అయ్యే ఖ‌ర్చుల కోసం ఫండ్ హౌస్ రూ.150 వ‌ర‌కూ వ‌సూలు చేసుకునేందుకు సెబీ అనుమ‌తించింది. అయితే రూ.10 వేల క‌న్నా సిప్ పెట్ట‌బడి విలువ ఎక్కువ పెట్టేవారి విష‌యంలోనే ఇది అమ‌ల‌వుతుంది. ఇప్ప‌టికే పెట్టుబ‌డులు పెడుతున్న వారి విష‌యంలో ఇది రూ.100 వ‌ర‌కూ ఉండ‌గ‌ల‌దు. సిప్ మొత్తం క‌మిట్‌మెంట్ రూ.10 వేలు దాటిన పెట్టుబ‌డుల విష‌యంలో 2వ దాన్నుంచి 4వ ఇన్‌స్టాల్‌మెంట్‌ల స‌మ‌యంలో 4 స‌మాన వాయిదాల్లో ఒక్కోసారి రూ.100 వ‌ర‌కూ లావాదేవీ రుసుమును ఫండ్ నిర్వ‌హ‌ణ సంస్థ వ‌సూలు చేసుకునేందుకు వీలుంది.

ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీ లేదా ఎక్స్‌పెన్స్ రేషియో

ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీ లేదా ఎక్స్‌పెన్స్ రేషియో

మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీ వివిధ సేవ‌ల‌కు చేసే ఖ‌ర్చుల‌కు సంబంధించిన ప్రామాణిక అంశం ఎక్స్‌పెన్స్ రేషియో. ప్ర‌స్తుతానికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ గ‌రిష్టంగా ఈక్విటీల విష‌యంలో 2.5%, డెట్ ఫండ్ల‌లో 2.25% ఎక్స్‌పెన్స్ రేషియోల‌ను భ‌రించ‌వ‌చ్చు. స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్‌ను ఎంచుకునే ముందు త‌క్కువ ఎక్స్‌పెన్స్ రేషియోను సైతం ఒక ముఖ్య‌మైన అంశంగా మ‌దుప‌ర్లు ప‌రిగ‌ణించాలి.

సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్‌

సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్‌

మ‌నం సులువుగా డ‌బ్బును మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌కు ముట్ట‌జెప్పుతాం. దాన్ని ఆయా సంస్థ‌లు వివిధ కంపెనీల్లో స్టాక్‌లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తాయి. అయితే స్టాక్‌ల‌ను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు ఏఎమ్‌సీలు సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని సైతం అంతిమంగా ఇన్వెస్ట‌ర్ల నుంచే వ‌సూలు చేస్తారు. అయితే నేరుగా ఇది పెట్టుబ‌డి ప్రారంభ ద‌శ‌లో వ‌సూలు చేయ‌రు. మ‌న రాబ‌డుల‌ను తిరిగి చెల్లించే ముందు వీట‌న్నింటిని మిన‌హాయిస్తారు.

ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేముందు ఎంపిక ఇలా...

ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేముందు ఎంపిక ఇలా...

ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే ముందు అనేక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ పథకంలో దీర్ఘకాలిక రాబడులు, ఖర్చుల వివరాలు, ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డ్‌, ఇన్వె్‌స్టమెంట్‌ పోర్టుఫోలియో, టర్నోవర్‌ రేషియో, ఆ పథకానికి ఉన్న రేటింగ్‌లు వంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంకా అనుమానాలు ఉంటే ఎవరైనా మంచి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించాకే ఆ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా నిపుణుల స‌లహాలు పాటించినా మార్కెట్ ఒడిదుడుకుల ఆధారంగా మీ ఫండ్లు ప్ర‌భావిత‌మ‌వుతాయ‌ని గుర్తించాలి. రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో రాబ‌డులు ఉంటాయి కాబ‌ట్టి మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

Read more about: mf, mutual fund, mutual funds
English summary

what are the various charges in mutual fund investments

Asset Management Companies or fund houses which manage mutual fund investments do charge for the service they provide on the investment. Through the process of starting an investment and staying invested to redeeming the mutual fund scheme, there are various charges that are applicable. Every investor should be aware of charges before investing in any mutual fund scheme. Here are some of these
Story first published: Thursday, April 27, 2017, 13:26 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC