English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఎక్కువ వ‌డ్డీ రేట్లు అందించేవి ఇవే...

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్నాయి. ఈ క్ర‌మంలో పెట్టుబ‌డుల‌కు ఎఫ్‌డీలు అంత స‌రైన‌వి కావు. అయిన‌ప్ప‌టికీ చాలా మందికి ఫేవరెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లే. ఏది ఏమైనప్ప‌టికీ ఎఫ్‌డీల్లోనే డ‌బ్బు పెట్టాల‌నుకునేవారు ఆచితూచి స‌రైన ఎఫ్‌డీని ఎంచుకోవాలి. అందుకోస‌మే ఉత్త‌మ వ‌డ్డీ రేట్ల‌ను అందించే ఎఫ్‌డీల‌ను ఇక్క‌డ అందిస్తున్నాం.

కేటీడీఎఫ్‌సీ

కేటీడీఎఫ్‌సీ

కేటీడీఎఫ్‌సీ ఈ డిపాజిట్ల‌కు కేర‌ళ ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. ఎందుకంటే కేటీడీఎఫ్‌సీ కేర‌ళ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. అందుకే వ‌డ్డీ,అస‌లు చెల్లించ‌డంలో విఫ‌లం అవ్వ‌క‌పోవ‌చ్చు. 1, 2, 3,5 ఏళ్ల డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్లు 8.25% నుంచి 8.75% వ‌ర‌కూ ఉన్నాయి. ఇవి ప్ర‌స్తుతం మంచి వ‌డ్డీ రేట్ల‌ను చెప్పాలి. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిట్ల‌కు అద‌నంగా 0.25 శాతం వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ఎఫ్‌డీ అస‌లు,వ‌డ్డీ మీద క‌లిపి 75% వ‌రకూ రుణం పొంద‌వ‌చ్చు.

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

బ్యాంకు డిపాజిట్ల‌లో ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చే దాని కోస‌మే చూస్తుంటే మీకు ఐడీఎఫ్‌సీ స‌రైన‌ది. ఇటీవ‌లే బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించిన ఐడీఎఫ్‌సీ ఎక్కువ డ‌బ్బు సేకరించేందుకు గాను వ‌డ్డీ రేట్ల‌ను కాస్త ఎక్కువ‌గానే ఆఫ‌ర్ చేస్తోంది. వివిధ కాలావ‌ధుల్లో ఉన్న డిపాజిట్ల‌కు 8.25% వ‌డ్డీని ఇస్తోంది. 366-400 రోజుల డిపాజిట్‌పై వ‌డ్డీ రేట్ 8.25% ఉండ‌గా; 401-500 రోజుల డిపాజిట్‌కు 8% వ‌డ్డీ రేట్ ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 8.75% వ‌డ్డీ ఇస్తున్నారు.

బంధ‌న్ బ్యాంకు

బంధ‌న్ బ్యాంకు

బంధ‌న్ బ్యాంకు ఏడాది వ్య‌వ‌ధి క‌లిగిన ఎఫ్‌డీల‌కు 8.00% వ‌డ్డీని ఇస్తోంది. బంధ‌న్ బ్యాంకులో క‌నీస డిపాజిట్ రూ.1000 నుంచి మొద‌ల‌వుతుంది. నెల‌వారీ, త్రైమాసికానికి వ‌డ్డీని చెల్లించే ఆప్ష‌న్ ఇస్తున్నారు. 7 రోజుల నుంచి మొద‌లుకొని 10 ఏళ్ల కాలం వ‌ర‌కూ ఎఫ్‌డీలు చేసుకోవ‌చ్చు. మొత్తం ఎఫ్‌డీ సొమ్ములో కొంత వెన‌క్కు తీసుకునేందుకు లేదా ముంద‌స్తు ఎఫ్‌డీ ముగింపుకు అవ‌కాశం ఉంది. ఆటోమేటిక్ రెన్యువ‌ల్, నామినీ సౌక‌ర్యాలు సైతం ఉన్నాయి. సందేహాల కోసం బ్యాంక్ టోల్‌ఫ్రీ:18002588181

బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ వ‌డ్డీ రేట్లు ఎప్పుడూ ఆక‌ర్ష‌ణీయంగానే ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ ఆర్థిక సంస్థ 8.2% వ‌డ్డీ రేటును ఇస్తోంది. రూ.1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అద‌నంగా 0.10% వ‌డ్డీని ఇస్తారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మామూలుగా వ‌చ్చే దాని క‌న్నా అద‌నంగా 0.25% వ‌డ్డీ వ‌స్తుంది. క్ర‌మ‌మైన పెట్టుబ‌డుల‌కు స‌హేతుక‌మైన వ‌డ్డీ కావాలంటే ఇది ఒక మంచి మార్గం.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఎఫ్‌డీ

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఎఫ్‌డీ

రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ 1సంవ‌త్స‌రం నుంచి 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధి డిపాజిట్ల‌కు ఈ కంపెనీ 7.49%-8.19% మ‌ధ్య వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తోంది. 5 ఏళ్ల డిపాజిట్‌కు రాబ‌డి 10.06%గా ఉండ‌గ‌ల‌దు. క్యుములేటివ్ డిపాఇజ‌ట్ల‌కు 8.19% వ‌డ్డీ ప్ర‌క‌టించారు. ఈ డిపాజిట్ల‌కు రేటింగ్ ఏఏఏ ఉంది కాబ‌ట్టి నిశ్చింత‌గా వీటిలో పెట్టుబ‌డి పెట్టొచ్చు.

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎఫ్‌డీ

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎఫ్‌డీ

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎఫ్‌డీ మీకు క‌నీసం 8శాతం వ‌డ్డీని అందిస్తుంది. మ‌హీంద్రా ఎఫ్‌డీల్లో ఆక‌ర్ష‌ణీయ అంశం ఏమిటంటే గ్రూప్ యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎఫ్‌డీలు చేసే వారంద‌రికీ రూ.1 ల‌క్ష వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను చేయిస్తారు. ఈ కంపెనీ ఎఫ్‌డీల‌కు క్రిసిల్ రేటింగ్ FAAA అని ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిట్ల‌కు అద‌నంగా 0.25% వ‌డ్డీని ఇస్తారు.

డీహెచ్ఎఫ్ఎల్

డీహెచ్ఎఫ్ఎల్

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలో పేరెన్నిక‌గ‌న్న ఆర్థిక సంస్థ‌ల్లో ఒక‌టి. రూ. 1 కోటి లోపు డిపాజిట్ల‌కు 12 నెల‌ల దానికి-8.00%, 14 నెల‌ల డిపాజిట్‌కు-8.05%, 24 నెల‌ల డిపాజిట్‌కు 8.05%, 3ఏళ్ల‌(36 నెల‌ల‌) డిపాజిట్‌కు 8.10%, 40 నెల‌ల డిపాజిట్‌కు 8.15%, 48 నెల‌ల నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన డిపాజిట్ల‌కు 8.25 శాతంగా వ‌డ్డీ రేట్లు ఉన్నాయి.సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.25% అద‌న‌పు వ‌డ్డీని అందిస్తారు.

డిస్‌క్లెయిమ‌ర్‌

డిస్‌క్లెయిమ‌ర్‌

గ్రేనియ‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీస్‌, దాని అనుబంధ సంస్థ‌లు,ఈ క‌థ‌నం రాసినవారు కానీ మీ పెట్టుబ‌డుల్లో న‌ష్టాల‌కు బాధ్యులు కారు. ఈ ఎఫ్‌డీల రేట్లు కేవ‌లం అవ‌గాహ‌న కోస‌మే. కాబట్టి పెట్టుబ‌డి నిర్ణ‌యం తీసుకునేముందు కంపెనీ గురించి విచారించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సిందిగా సూచించ‌డ‌మైనది.

Read more about: fd, fixed deposits
English summary

7 best fixed deposits for investors in 2017

If you are looking at Fixed Deposits (FDs) in a falling interest rate regime, you will have to pick and choose. Bank interest rates have dipped a great deal and chances are they would slip even further. Here are a few FDs that could still be attractive from a long term perspective
Story first published: Monday, April 10, 2017, 11:11 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC