English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

వీట‌న్నింటికి పాన్ నంబ‌రు త‌ప్ప‌నిస‌రి.. మీ ద‌గ్గ‌ర పాన్ ఉందా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

120 కోట్ల దేశ జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 10 శాతం లోపే. చాలామంది పన్ను పరిధిలో ఉన్నా, లావాదేవీలను అక్ర‌మ మార్గాల్లో నడిపించడం ద్వారా పన్ను ఎగ్గొడుతున్నారు. వీరినందరినీ ట్యాక్స్ బ్రాకెట్‌లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకోస‌మే చాలా ఆర్థిక లావాదేవీల విష‌యంలో పాన్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. కాబట్టి ఇక నుంచి పాన్‌కార్డు వివరాలను సెల్‌ఫోన్‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవడంతో పాటు, లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా ఒరిజినల్ పాన్‌కార్డ్ ఉండేలా చూసుకోండి. న‌గ‌దు లావాదేవీల్లో విప‌రీతంగా జ‌రుగుతున్న న‌ల్ల‌ధ‌న చెలామ‌ణీని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని చోట్ల క‌ట్ట‌డి చేస్తూ వ‌స్తోంది. తెర‌చాటు వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తూ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్నదే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఈ నేప‌థ్యంలో ఏయే సంద‌ర్భాల్లో కేంద్రం పాన్ వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రి చేసిందో తెలుసుకుందాం.

 1. వ‌స్తు, సేవ‌ల అమ్మ‌కాలు

1. వ‌స్తు, సేవ‌ల అమ్మ‌కాలు

రూ. 2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి చేసే వ‌స్తు కొనుగోలు, అమ్మ‌కాల‌కు పాన్ కార్డు నంబ‌రు త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల్సిందే. సేవ‌ల‌కు సంబంధించి సైతం లావాదేవీ రూ. 2 ల‌క్ష‌ల‌కు మించితే పాన్ త‌ప్ప‌నిసరి కాబ‌ట్టి మీరు ఎక్క‌డైనా రూ. 2 ల‌క్ష‌లకు మించి వ‌స్తు, సేవ‌ల కొనుగోలు, అమ్మ‌కాలు చేప‌ట్టేముందు పాన్ తీసుకెళ్ల‌డం మ‌రిచిపోవ‌ద్దు.

2. స్థిరాస్తి లావాదేవీలు

2. స్థిరాస్తి లావాదేవీలు

స్థిరాస్తి విలువ రూ.10 ల‌క్ష‌ల‌కు మించి ఉన్న‌ప్పుడు ఆ ప్రాప‌ర్టీని కొనాల‌న్నా, అమ్మాల‌న్నా పాన్ త‌ప్ప‌నిస‌రి. స్టాంప్ వాల్యుయేష‌న్ అధికారులు ఏదైనా ఆస్తి విలువ‌ను లెక్కించేట‌ప్పుడు రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ అని తేలిస్తే పాన్ కార్డు సంఖ్య‌ను ఇవ్వాల్సిందే. ఇంత‌కు ముందు ఈ ప‌రిమితి రూ.5 ల‌క్ష‌లుగా ఉండేది. ఇక్క‌డ కొన్న‌వారు, అమ్మిన‌వారు ఇద్దరూ కూడా పాన్ వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

3. రెస్టారెంటు బిల్లు రూ. 50 వేలు దాటిందా?

3. రెస్టారెంటు బిల్లు రూ. 50 వేలు దాటిందా?

పార్టీల పేరుతో ఎక్కువ‌గా బ‌య‌టే తింటున్నారా? అయితే జేబు గుల్ల‌వ‌డం మామూలే. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. హోట‌ల్‌, రెస్టారెంట్ బిల్లు రూ. 50 వేల‌కు మించితే అక్క‌డ పాన్ కార్డు నంబ‌రును ఇవ్వాల్సిందేన‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

4. బ్యాంకు ఖాతా

4. బ్యాంకు ఖాతా

కొత్త‌గా బ్యాంకు ఖాతా తెర‌వాలంటే పాన్ కార్డు వివ‌రాలు ఇవ్వాల‌ని ఆర్‌బీఐ సూచించింది. బ్యాంకులు లేదా స‌హ‌కార బ్యాంకులు, ఇంకా బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల్లో ఎఫ్‌డీ చేసిన‌ప్పుడు సైతం పాన్ వివ‌రాలు ఇవ్వాల్సిందే.

5. ఖాతాలో చేసే డిపాజిట్ల విష‌యంలో

5. ఖాతాలో చేసే డిపాజిట్ల విష‌యంలో

మీ బ్యాంకు ఖాతాలో రోజుకు రూ. 50 వేలకు మించి న‌గ‌దు డిపాజిట్ చేయాలంటే పాన్ వివ‌రాలు ఇవ్వ‌క త‌ప్ప‌దు. లేకుంటే ఫారం 60 అయినా నింపాలి. త‌ప్పుదు ధ్రువీక‌ర‌ణ‌కు ఏడేళ్ల వ‌ర‌కూ జైలు, జ‌రిమానా వంటి శిక్ష‌లు ఉంటాయి. క‌నీస జైలు శిక్ష 3 నెల‌ల‌యినా ఉండేలా కేంద్రం నిబంధ‌న‌లు రూపొందించింది.

6. ఆభ‌ర‌ణాల‌, న‌గ‌ల కొనుగోళ్లు

6. ఆభ‌ర‌ణాల‌, న‌గ‌ల కొనుగోళ్లు

రూ. 2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి విలువ క‌లిగిన బంగారు ఆభర‌ణాల కొనుగోలుకు పాన్ నంబ‌రు ఇవ్వాల్సి ఉంది. జ‌న‌వ‌రి 1,2016 నుంచి ఇది అమ‌ల్లోకి వ‌చ్చింది.

7. డిపాజిట్ల కోసం

7. డిపాజిట్ల కోసం

బ్యాంకు ఖాతాలో డిపాజిట్ల‌కు మాత్ర‌మే పాన్ త‌ప్ప‌నిస‌రి అని స‌రిపెట్ట‌లేదు ప్ర‌భుత్వం. పోస్టాఫీసులు, స‌హ‌కార బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల‌కూ సైతం ఇది వ‌ర్తిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతా విష‌యంలో రూ. 50 వేల డిపాజిట్‌కు సంబంధించి ప్ర‌స్తుతం కాస్త స‌డ‌లింపు ఇచ్చారు. బ్యాంకు డిపాజిట్ల‌పై ఏడాదికి సంక్ర‌మించే ఆదాయం రూ. 10 వేల‌కు మించితే 20% టీడీఎస్ అమ‌ల‌వుతుంది. పాన్ నంబ‌రు ఇస్తే ఈ కోత 10 శాతానికి ప‌రిమిత‌మ‌వుతుంది. పాన్ నంబ‌ర్ ఇవ్వ‌ని ప‌క్షంలో 20% టీడీఎస్ మిన‌హాయింపుకు సంబంధించి బ్యాంకు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌దు.

8. ఇత‌ర చెల్లింపు సాధనాలు

8. ఇత‌ర చెల్లింపు సాధనాలు

ఒక రోజులో రూ. 50 వేల‌కు మించి డీడీలు, బ్యాంక‌ర్ల చెక్కులు తీసుకున్న‌ప్పుడు కూడా పాన్ నంబ‌రు ఇవ్వాలి. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ చ‌ట్టం ప్ర‌కారం క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీ విలువ రూ. 50 వేల‌ను దాటితే అలాంటి స‌మ‌యంలో పాన్ కార్డు వివ‌రాలు ఇవ్వాలి.

9. మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో

9. మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో

రూ. 50 వేల‌కు పైబ‌డి విలువ చేసే మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్లు కొనుగోలు చేస్తే పాన్ కార్డు నంబ‌రు ఇవ్వాల్సిందే.

10. విదేశీ ప్ర‌యాణాలు

10. విదేశీ ప్ర‌యాణాలు

విదేశీ ప్ర‌యాణాల‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న‌ప్పుడు టిక్కెట్ విలువ రూ. 50 వేల‌కు మించితే పాన్ నంబ‌రును పేర్కొనాల్సిందే. విదేశీ ప్ర‌యాణాల‌కు అయ్యే ఖ‌ర్చు రూ. 50 వేల‌ను మించి దాన్ని న‌గ‌దు రూపంలో చెల్లిస్తున్నా లేదా విదేశీ క‌రెన్సీ మార్చుకునే విలువ రూ. 50 వేల క‌న్నా ఎక్కువ ఉంటే పాన్ త‌ప్ప‌నిసరి. ఇక‌పై ఒక రోజులో రూ. 50 వేల పైబ‌డి విదేశీ క‌రెన్సీ మార్చుకోవాలంటే పాన్ వివ‌రాలు ఇవ్వాల్సిందేన‌ని గుర్తుంచుకోండి. అంటే మొత్తంగా విదేశీ ప్రయాణాల్లో నగదుతో టికెట్లు కొన్నప్పుడు, నగదుతో విదేశీ కరెన్సీ కొన్నప్పుడు కూడా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలని అర్థం చేసుకోవాలి.

11. హెచ్ఆర్ఏ క్లెయిం కోసం

11. హెచ్ఆర్ఏ క్లెయిం కోసం

మీరు హెచ్ఆర్‌ఏ క్లెయిం చేయాల‌నుకుని భావించి, ఆ విలువ రూ. 1 ల‌క్ష‌కు మించి ఉంటే; మీ ఇంటి య‌జ‌మాని పాన్ వివ‌రాలు ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఇందుకోసం ల్యాండ్ లార్డ్‌(య‌జ‌మాని) నుంచి పాన్ కార్డు డిక్ల‌రేష‌న్ ఫారంను తీసుకోవాలి. అంతే కాకుండా మీరు ట్యాక్స్ ఎక్సెంప్ష‌న్ క్లెయిం ఫారంను స‌మ‌ర్పించాలి.

12. బాండ్ల‌కు సంబంధించి

12. బాండ్ల‌కు సంబంధించి

ఆర్బీఐ బాండ్లు, డిబెంచ‌ర్లను కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. రూ. 50 వేల‌కు మించి విలువ క‌లిగిన బాండ్లు, డిబెంచ‌ర్ల‌రును కొనుగోలు చేస్తుంటే పాన్ వివ‌రాల‌ను ఇవ్వాల్సిందేన‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

13. జీవిత బీమా ప్రీమియం

13. జీవిత బీమా ప్రీమియం

ఏడాది వ్యవధిలో జీవితబీమా ప్రీమియం కోసం రూ.50,000 చెల్లిస్తున్నా పాన్ వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. మీరు ఎంచుకున్న ప్లాన్‌ను, కంపెనీని బ‌ట్టి ప్రీమియం మారుతూ ఉంటుంద‌ని గుర్తుంచుకోండి. పాల‌సీదారు ఏడాది కాలంలో చెల్లించే జీవిత బీమా ప్రీమియం రూ. 50 వేల‌ను మించితేనే ఈ నిబంధ‌న‌.

14. షేర్ల కొనుగోలు స‌మ‌యంలో

14. షేర్ల కొనుగోలు స‌మ‌యంలో

ల‌క్ష రూపాయ‌ల‌కు మించి విలువ చేసే షేర్లు కొంటుంటే పాన్ కార్డు సంఖ్య‌ను న‌మోదు చేయక త‌ప్ప‌దు. అలాగే లిస్ట్ కాని కంపెనీకి సంబంధించిన షేర్లు రూ. 1 లక్ష‌కు మించి కొన్నా, అమ్మినా పాన్ వివ‌రాలు ఇవ్వాలి.

15. వాహ‌న కొనుగోలుకు సంబంధించి

15. వాహ‌న కొనుగోలుకు సంబంధించి

ప్రతి మోటార్ వాహనం కొనుగోలు సమయంలోనూ పాన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వా లి. దీన్నుంచి ద్విచక్ర వాహన లావాదేవీలను మాత్రం మినహాయించారు. ఎవ‌రైనా త‌మ వాహ‌నం(4 వీల‌ర్‌) అమ్ముతున్న‌ప్పుడు సైతం పాన్ నంబ‌రు ఇవ్వాల్సిందే.

16. కార్డులు, వ్యాలెట్లు

16. కార్డులు, వ్యాలెట్లు

అలాగే క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాన్‌కార్డు ఉండాలి. రూ. 50 వేల‌కు మించి ప్రీపెయిడ్ మ‌నీ వ్యాలెట్ల‌లో లావాదేవీలు జ‌రిపినా పాన్ నంబ‌రు ఇవ్వాలి. గిఫ్ట్ కార్డుల విష‌యంలోనూ రూ. 50 వేలు దాటితే పాన్ త‌ప్ప‌నిస‌రే.

17. ట్యాక్స్ రిట‌ర్నులు

17. ట్యాక్స్ రిట‌ర్నులు

ప్ర‌స్తుతం దేశంలో ఎవ‌రి ఆదాయ‌మైనా రూ. 2.5 ల‌క్ష‌ల‌కు మించితే ట్యాక్స్ రిట‌ర్నులు సమర్పించాల్సిందే. అయితే ట్యాక్స్ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు పాన్ సంఖ్య‌ను కోట్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెల్ల‌డించింది. అంతే కాకుండా కొన్ని మిన‌హాయింపులు(టీడీఎస్‌) క్లెయిం చేసుకోవాలంటే పాన్ నంబ‌రు ఇవ్వాల‌ని ఐటీ శాఖ సూచించింది.

18. వ్యాట్‌, ప‌న్నులు

18. వ్యాట్‌, ప‌న్నులు

ఎక్సైజ్ డ్యూటీ, సేవా ప‌న్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌-విలువ ఆధారిత ప‌న్ను(వ్యాట్) వంటి వాటి చెల్లింపుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం వ‌ద్ద న‌మోదు చేసుకునే స‌మ‌యంలో ఆయా వ్యాపార‌స్థులు పాన్ నంబ‌రు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

19. ఎన్‌పీఎస్

19. ఎన్‌పీఎస్

ఎన్‌పీఎస్‌లో కొత్త‌గా ఆన్‌లైన్ ద్వారా న‌మోద‌య్యే చందాదార్ల‌కు పాన్ వివరాలు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఎన్‌పీఎస్ ప‌థ‌కాన్ని భ‌విష్య నిధి నియంత్ర‌ణ,అభివృద్ది సంస్థ నిర్వ‌హిస్తోంది.

20. డీమ్యాట్

20. డీమ్యాట్

ఏప్రిల్ 1,2006 నుంచి డీమ్యాట్ ఖాతా తెర‌వాలంటే పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి అని సెబీ నిబంధ‌న పెట్టింది. ఎందుకంటే మీ క్లయింట్‌ను తెలుసుకోండి(Know Your Client) నిబంధ‌న‌ల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు. కాబ‌ట్టి ఇక‌పై పాన్ ఉంటేనే డీమ్యాట్ ఖాతా తెర‌వ‌గ‌ల‌రు.

ఈ పాన్ త‌ప్ప‌నిస‌రి అని కేంద్రం విధించిన నిబంధ‌న‌ల‌కు సంబంధించిన స‌ర్కుల‌ర్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి http://pib.nic.in

English summary

Where do you need to quote pan number And When PAN is madatory in India

The Permanent Account Number (PAN) is a must for most of the financial transaction. The government has issued new guidelines in order to curb circulation of black money and widening of tax base, for which quoting PAN is necessary. The government has also enhanced the monetary limits of certain transactions which require quoting of PAN. The changes to the Rules will take effect from 1st January, 2016.Everyone dealing with cash needs to produce PAN card details.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC